Cannabis plant : గంజాయి.. ఈ మొక్కల పెంపకాన్ని మనదేశం నిషేధించింది. ఇందుకు కారణం ఈ ఆకుల్లో మత్తును కలిగించే ఆల్కలాయిడ్లు ఉంటాయి. ఇవి తీవ్రమైన మత్తును కలిగిస్తాయి. గంజాయి ఆకులను మెత్తగా చేసుకుని తాగితే శరీరం వెంటనే మైకంలోకి వెళ్ళిపోతుంది. ఆ మైకంలో ఏం చేస్తున్నారో వారికి అర్థం కాదు.. పైగా అందులోనే వారు యూపోరియా(తాత్కాలికమైన విపరీత స్వర్గ సుఖం)ను అనుభవిస్తున్నట్టు భావిస్తారు. అయితే ఈ మత్తులో కొంతమంది రకరకాల దుర్మార్గాలకు పాల్పడతారు. ఆ సమయంలో ఏం చేస్తున్నారో వారికి అర్థం కాదు. గంజాయి కి బానిసలై చాలామంది అనేక రకాల దుర్మార్గాలకు పాల్పడుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వం వీటి సాగుపై నిషేధం విధించింది. అయితే ఈ మొక్కలపై వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు కొద్దిరోజులుగా అధ్యయనాలు చేస్తున్నారు. అయితే ఇందులో అనేక రకాల ఆసక్తికర విషయాలు వెలుగు చూసాయి.
ఈ విషయాలు సైంటిఫిక్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి. గంజాయి మొక్కలో ప్రతి భాగాలు ప్రత్యేకమైనవే. కాండం, పుష్పం, ఆకులు, గింజలు, వేర్లు.. ఈ భాగాలను సైకో యాక్టివ్ అని పిలుస్తారు. వీటినుంచి శాస్త్రవేత్తలు కన్నా బిజి రోల్(సీబీజీ) ని ఉత్పన్నం చేశారు. వీటి వినియోగంపై శాస్త్రవేత్తలు హ్యూమన్ ట్రయల్స్ చేశారు. ఈ సందర్భంగా పలు ఆశ్చర్యకరమైన ఫలితాలు వారి కళ్ళకు గట్టాయి. సుమారు 34 మందిపై కన్నా బిజీ రోల్ ను ప్రయోగించారు. అయితే వారిలో ఆందోళన తగ్గిపోయింది. ఒత్తిడి తగ్గుముఖం పట్టింది. జ్ఞాపకశక్తి లో కాస్త మెరుగుదల కనిపించింది.
అయితే వెనుకటి కాలంలో గంజాయిని విస్తారంగా సాగు చేసేవారట. భారత్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ప్రాంతాలలోని సారవంతమైన భూములలో గంజాయితోపాటు నల్లమందును పండించేవారు. అయితే వీటి ద్వారా ఏర్పడే దుష్పరిణామాలు చాలా తీవ్రంగా ఉండడంతో.. మనదేశంలోని ప్రభుత్వం గంజాయి సాగును పూర్తిగా నిషేధించింది. కానీ ఆఫ్గనిస్తాన్ దేశంలో ఇప్పటికీ నల్లమందు సాగు చేస్తున్నారు. దాని ద్వారానే ఆ దేశం ఎంతో కొంత విదేశీ మార్గద్రవ్యాన్ని సంపాదిస్తోంది. అయితే ఆఫ్గనిస్తాన్ ప్రాంతంలో సారవంతమైన నేలలు ఉండడం వల్లే నల్లమందు విస్తారంగా పండుతోంది. గతంలో ఈ ప్రాంతంలో గంజాయి సాగు చేసేవారు. అయితే ఇప్పుడు దానిని విరమించుకున్నారు. పాకిస్తాన్ లోను సింధు నది పరిసర ప్రాంతాల్లో గంజాయి విస్తారంగా సాగవుతుంది. అక్కడి నుంచి దొడ్డిదారిన ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు.
కాగా, గంజాయిని అదే పనిగా తాగితే శరీరంపై దుష్పరిణామాలను చూపిస్తుందని వైద్యులు అంటున్నారు. నాడీ వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితం అవుతాయని హెచ్చరిస్తున్నారు. గంజాయిని ఏ రూపంలో తీసుకున్నా అది శరీరానికి హాని కలిగిస్తుందని వారు వివరిస్తున్నారు. అందువల్ల దాన్ని వాడకాన్ని పూర్తిగా మానివేస్తేనే మంచిదని పేర్కొంటున్నారు. శాస్త్రవేత్తలు పరిశోధనలో ఎలాంటి విషయాలు బయటకు వచ్చినప్పటికీ.. గంజాయి వాడకం శరీరానికి ఏమాత్రం మంచిది కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More