https://oktelugu.com/

Red Color: ప్రపంచవ్యాప్తంగా ఎరుపు రంగును ప్రమాద సంకేతంగా ఎందుకు ఉపయోగిస్తారు?

Red Color ఎరుపు రంగు మెదడు మీద ప్రత్యక్షంగా ప్రభావం చూపిస్తుంది అంటున్నారు నిపుణులు. అంటే దీని వల్ల వెంటనే మనం వెంటనే అప్రమత్తం అవుతారు. అందుకే ఈ రంగు రోడ్లపైనే కాకుండా వైద్య అత్యవసర పరిస్థితుల్లో, సైనిక జెండాలు, విషపూరిత పదార్థాలు, వన్యప్రాణులలో కూడా ప్రమాదానికి సంకేతంగా మారింది.

Written By: , Updated On : March 17, 2025 / 01:50 PM IST
Red Color

Red Color

Follow us on

Red Color: ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ లైట్ లోనే, అగ్ని ప్రమాద హెచ్చరికలు రెడ్ గానే, అధిక వోల్టేజ్ సూచికలు రెడ్ గానే, ట్రైన్ ఆగాలంటే రెడ్ లైట్, ఎర్రజెండానే ఇంతకీ ఈ ఎరుపు వెనుక ఉన్న మత్లబ్ ఏంది అని ఎప్పుడైనా ఆలోచించారా? ప్రపంచవ్యాప్తంగా, ఎరుపు రంగును ప్రమాదకరంగా, హెచ్చరిక కు చిహ్నంగా చూస్తుంటారు. మరి దీని వెనుక దాగి ఉన్న అర్థం, పరమార్థం మాత్రం చాలా మందికి తెలియదు. ఇంతకీ అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఎరుపు రంగు మెదడు మీద ప్రత్యక్షంగా ప్రభావం చూపిస్తుంది అంటున్నారు నిపుణులు. అంటే దీని వల్ల వెంటనే మనం వెంటనే అప్రమత్తం అవుతారు. అందుకే ఈ రంగు రోడ్లపైనే కాకుండా వైద్య అత్యవసర పరిస్థితుల్లో, సైనిక జెండాలు, విషపూరిత పదార్థాలు, వన్యప్రాణులలో కూడా ప్రమాదానికి సంకేతంగా మారింది. మరి ఎరుపు రంగుకు మాత్రమే ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారు. దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయం ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం. ఈ విషయం తెలుసుకున్నప్పుడు మీరు ఈ రంగును చూస్తే ప్రత్యేకంగా చూస్తారు ఈ సారి..

Also Read: లేవగానే మొబైల్ పడుతున్నారా? ముందు ఈ పనులు చేయండి

రంగుల ప్రపంచంలో, ప్రతి రంగుకు ఒక అర్థం దాగి ఉంటుంది. ఎంత దూరం నుంచి కనిపించాలో నిర్ణయిస్తుంది కూడా. అయితే ఈ ఎరుపు రంగు మాత్రం చాలా పొడవు వరకు కూడా కనిపిస్తుంది (సుమారు 620-750 నానోమీటర్లు) కలిగి ఉంటుంది. అంటే మిగిలిన రంగులకంటే ఈ రంగు ఎక్కువ దూరం నుంచి కూడా కనిపిస్తుంది అన్నమాట. అందుకే స్టాప్ సంకేతాలు, ట్రాఫిక్ లైట్లు, రైల్వే సిగ్నల్స్ , డేంజర్ బోర్డులను ఎరుపు రంగులో నే ఉంచుతారు. అంటే దీన్ని ఎక్కడి నుంచి అయినా ప్రజలు గమనించి జాగ్రత్త పడతారు అన్నమాట.

రంగులు భావోద్వేగాలు, ఆలోచనలపై లోతైన ప్రభావాన్ని చూపుతాయి అంటున్నారు నిపుణులు. మనం ఎరుపు రంగును చూస్తే మెదడు అప్రమత్త స్థితిలోకి వెళుతుంది. ఇది హృదయ స్పందనను పెంచుతుంది. తద్వారా తక్షణ చర్య తీసుకోవాలి అని అలర్ట్ అవుతారు. అందుకే ఈ రంగును అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగిస్తారు. తద్వారా ప్రజల దృష్టిని వెంటనే ఆకర్షించవచ్చు.

కొన్ని విషపూరిత కప్పలు, పాములు, కీటకాలు ఎరుపు లేదా ప్రకాశవంతమైన రంగులలో కనిపిస్తాయి. మీరు ఎప్పుడైనా దీన్ని గమనించారా? దీనిని “అపోసెమాటిక్ కలరేషన్” అంటారు. ఈ జీవులు ప్రమాదకరంగా ఉండవచ్చని మాంసాహారులకు సంకేతాలు ఇస్తుంది. ఉదాహరణకు, కొన్ని విషపూరిత కప్పలు, సాలెపురుగులు వాటి ఎరుపు, నారింజ లేదా పసుపు రంగు ద్వారా అవి విషపూరితమైనవని, తాకడం ప్రమాదకరమని చెబుతుంటాయి అన్నమాట. మానవులకు హెచ్చరిక సంకేతాలలో కూడా ఈ ప్రత్యేకమైన ప్రకృతి నియమం చాలా అవసరం అవుతుంది. అంటే ప్రకృతి వరం కదా.

ఎరుపు రంగు అగ్ని, రక్తంతో ముడిపడి ఉంది
నిప్పు, రక్తం రెండూ ఎరుపు రంగులో ఉంటాయి. రెండూ ప్రమాదంతో ముడిపడి ఉన్నాయి. అగ్ని దహించడాన్ని సూచిస్తే.. రక్తస్రావం గాయం, ప్రమాదాలను సూచిస్తుంది. ఒక వ్యక్తి ఎరుపు రంగును చూసినప్పుడు, అతని మనస్సులో వెంటనే ప్రమాదం లేదా అత్యవసర భావన అనేది వస్తుంటుంది. అందుకే ఆసుపత్రులలో అత్యవసర సూచికలు కూడా ఎరుపు రంగులో ఉంటాయి.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. ట్రెండింగ్ తెలుగు వెబ్ సైట్ ఈ విషయాన్ని నిర్ధారించదు. దయచేసి గమనించగలరు.