Homeవింతలు-విశేషాలుReal life lion king moment video: సింహం లయన్ కింగ్ సినిమా చూసింది.. అచ్చం...

Real life lion king moment video: సింహం లయన్ కింగ్ సినిమా చూసింది.. అచ్చం అలానే ఫోజిచ్చింది.. మామూలు వీడియో కాదిదీ

Real life lion king moment video: మనుషులు సినిమాలు చూస్తారు. ఎందుకంటే సినిమాలను మనుషులే తీస్తారు కాబట్టి.. సినిమాల మాదిరిగానే అప్పుడప్పుడు నిజ జీవితంలో కనిపిస్తుంటారు. సినిమా హీరోల మాదిరిగానే చేష్టలకు పాల్పడుతుంటారు. కానీ జంతువులు సినిమాలు చూస్తాయా? సినిమాలలో ఉన్నట్టుగానే ప్రవర్తిస్తాయా? ఇప్పుడు ఈ ప్రశ్నకు ఈ సింహం తన చేష్టలతో సమాధానం చెప్పింది. హాలీవుడ్లో ఆ మధ్య లయన్ కింగ్ అనే ఒక సినిమా వచ్చింది. అందులో ఒక అడవికి రాజుగా సింహం […]

Real life lion king moment video: మనుషులు సినిమాలు చూస్తారు. ఎందుకంటే సినిమాలను మనుషులే తీస్తారు కాబట్టి.. సినిమాల మాదిరిగానే అప్పుడప్పుడు నిజ జీవితంలో కనిపిస్తుంటారు. సినిమా హీరోల మాదిరిగానే చేష్టలకు పాల్పడుతుంటారు. కానీ జంతువులు సినిమాలు చూస్తాయా? సినిమాలలో ఉన్నట్టుగానే ప్రవర్తిస్తాయా? ఇప్పుడు ఈ ప్రశ్నకు ఈ సింహం తన చేష్టలతో సమాధానం చెప్పింది.

హాలీవుడ్లో ఆ మధ్య లయన్ కింగ్ అనే ఒక సినిమా వచ్చింది. అందులో ఒక అడవికి రాజుగా సింహం ఉంటుంది. మిగతా జంతువులను మొత్తం తన కంట్రోల్లో ఉంచుకుంటుంది. అడవిని మొత్తం పరిపాలించడానికి ఒక ఎత్తైన గుహ మీదికి వెళ్తుంటుంది. అందులో ఉన్న బండరాయి మీదికి ఎక్కి.. అడవిని మొత్తం పరిశీలిస్తూ ఉంటుంది. ఇతర జంతువుల కదలికలను ఎప్పటికప్పుడు పసిగడుతూ ఉంటుంది. తమకు వచ్చే ముప్పును అంచనా వేసి .. ప్రతిస్పందిస్తూ ఉంటుంది.

లయన్ కింగ్ సినిమాలో మాదిరిగానే ఓ సింహం ప్రవర్తించింది. అందులో సింహం ఓ రాతి గుట్ట మీదికి ఎక్కి పరిశీలించినట్టుగానే.. ఆ సింహం కూడా అలానే వ్యవహరించింది.. ఈ దృశ్యాన్ని కొంతమంది వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్త చర్చకు దారి తీయడం మొదలుపెట్టింది. ఇప్పటికే లక్షలాది వీక్షణలను ఆ వీడియో సొంతం చేసుకుంది.

ఆ వీడియోలో కనిపించిన దృశ్యాలు మొదట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించినట్టు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. కానీ, ఆ దృశ్యాలు నిజంగా చోటు చేసుకున్నవే. ఆ వీడియోలో కనిపించిన సింహం ఒరిజినలే. ఇది ఇంగ్లాండ్లో ఓ అడవిలో చోటుచేసుకుంది. అడవి మొత్తం ఓపెన్ జూ మాదిరిగా ఉంటుంది. అందువల్లే పర్యాటకులు అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. జంతువులు బయటికి వచ్చే సమయంలో సఫారీ ద్వారా వాటిని వీక్షించవచ్చు. అయితే ఇటీవల ఒక సింహం అక్కడ ఉన్న రాతి గుట్టమీదికి ఎక్కింది. అచ్చం లయన్ కింగ్ సినిమాలో దృశ్యాన్ని మాదిరిగానే అది పోలి ఉంది. దీంతో సఫారీ కి వెళ్ళిన వారంతా ఆ దృశ్యాలను తమ కెమెరాలలో చిత్రీకరించారు.

 

View this post on Instagram

 

A post shared by NDTV (@ndtv)

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper