Homeలైఫ్ స్టైల్LPG cylinder expiry date: మీరు వాడే మందులకే కాదు.. ఉపయోగించే వంటగ్యాస్ కూ ఎక్స్...

LPG cylinder expiry date: మీరు వాడే మందులకే కాదు.. ఉపయోగించే వంటగ్యాస్ కూ ఎక్స్ పైరి తేదీ ఉంటుంది తెలుసా.. ఎలా చెక్ చేయాలంటే

LPG cylinder expiry date: మనకు ఏదైనా జబ్బు చేస్తే మందులు వాడతాం. ఆ మందులు వాడిన తర్వాత జబ్బు నయమైపోతుంది. సాధారణంగా మందులు తయారు చేస్తున్నప్పుడు అందులో ఉన్న ఔషధ పరిమాణం ఆధారంగా గడువు తేదీ నిర్ణయిస్తారు. ఆ తేదీలో గానే ఆ మందు వాడాలి. ఆ తేదీ ముగిసిన తర్వాత మందు వాడితే ఉపయోగం ఉండదు. పైగా శరీరంలో రకరకాల మార్పులు చోటు చేసుకుంటాయి. మనం వాడే మందుల మాదిరిగానే.. ఆహార ఉత్పత్తులకు కూడా […]

LPG cylinder expiry date: మనకు ఏదైనా జబ్బు చేస్తే మందులు వాడతాం. ఆ మందులు వాడిన తర్వాత జబ్బు నయమైపోతుంది. సాధారణంగా మందులు తయారు చేస్తున్నప్పుడు అందులో ఉన్న ఔషధ పరిమాణం ఆధారంగా గడువు తేదీ నిర్ణయిస్తారు. ఆ తేదీలో గానే ఆ మందు వాడాలి. ఆ తేదీ ముగిసిన తర్వాత మందు వాడితే ఉపయోగం ఉండదు. పైగా శరీరంలో రకరకాల మార్పులు చోటు చేసుకుంటాయి.

మనం వాడే మందుల మాదిరిగానే.. ఆహార ఉత్పత్తులకు కూడా గడువు తేదీ ఉంటుంది. ఆ తేదీలోగానే ఆ ఉత్పత్తులను వాడాల్సి ఉంటుంది. లేనిపక్షంలో శరీరంలో రకరకాల మార్పులకు కారణమయ్యే ప్రమాదం ఉంటుంది. కొన్ని సందర్భాలలో వ్యాధులు కూడా సోకే అవకాశం ఉంటుంది. అందువల్లే మందులు, ఆహార ఉత్పత్తులు తీసుకునేటప్పుడు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సరే పెను ప్రమాదం తప్పదు.

మందులు, ఆహార పదార్థాలు మాత్రమే కాకుండా.. మన ఇంట్లో వాడే గ్యాస్ సిలిండర్ కు కూడా గడువు తేదీ ఉంటుంది. చదువుతుంటే ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ.. ఇది ముమ్మాటికి నిజం. చాలామంది తమ ఇళ్లల్లో గ్యాస్ సిలిండర్లను నెలల తరబడి నిల్వ ఉంచుతారు. ఇక ఇప్పుడు మధ్య ఆసియా ప్రాంతంలో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో చాలామంది సిలిండర్లను స్టాక్ పెట్టుకుంటున్నారు. వాస్తవానికి ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే అదే పనిగా నిలువ చేస్తే గ్యాస్ వినియోగించే గడువు తేదీ ముగిసిపోతుంది. అందువల్లే సురక్షితమైన వాడకం కోసం ఈ తేదీని తీసుకొచ్చారు. సిలిండర్ పై భాగంలో గడువు తేదీ ముద్రిస్తారు. ఉదాహరణకు సి 27 అని గనక ఉండి ఉంటే.. అది 2027లో జూలై నుంచి సెప్టెంబర్ మధ్య ముగుస్తుందని అర్థం. ఏ అని గనుక ఉండి ఉంటే జనవరి నుంచి మార్చి వరకు, బి అని గనక ఉండి ఉంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు, సి అని గనుక ఉండి ఉంటే జూలై నుంచి సెప్టెంబర్ వరకు, డి అని గనక ఉండి ఉంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అని అర్థం. కచ్చితంగా గడువు తేదీ ముగిసిన వాటిని వాడకపోవడమే మంచిది. ఎందుకంటే వాటి వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటాయి.

అప్పుడప్పుడు ఎటువంటి తప్పిదం లేకపోయినా సరే గ్యాస్ ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణం గడువు తేదీ ముగిసిపోవడమే. చాలామందికి ఈ అంశం మీద అంతగా అవగాహన ఉండదు. గ్యాస్ కార్యాలయం వద్దకు వెళ్లి.. నిర్ణీత రుసుమ చెల్లించి.. సిలిండర్లను తీసుకొని వస్తుంటారు. ఆ తర్వాత నెలల తరబడి ఇంట్లో నిల్వ ఉంచుకుంటారు. నిల్వ ఉంచుకోవడం అనేది సరైన విధానం కాదు. గ్యాస్ నిండుకుంటేనే కొత్త దానిని తీసుకోవాలి. అదనంగా ఉంది కదా అని ముందుగానే తెచ్చి పెట్టుకుంటే ఇదిగో ఇటువంటి కష్టాలు వస్తుంటాయి. సాధారణంగా గ్యాస్ కార్యాలయాలలో సిలిండర్లు నిల్వ ఉండవు. పైగా వారు ఎప్పటి స్టాక్ అప్పుడే తెచ్చుకుంటారు. అందువల్ల గడువు తేదీ సమస్య ఉండదు. కానీ కొంతమంది ముందు చూపుతో ముందుగానే సిలిండర్లను నిల్వ ఉంచుకుంటారు. దీనివల్ల మిగతా వారికి సమస్య.. వాళ్లకు కూడా సమస్య. అందువల్లే గ్యాస్ వినియోగంలో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper