Python Bivittatus
Python bivittatus : పాములలో పైథాన్ అతిపెద్ద జాతి. అవి విషపూరితమైనవి కావు, కానీ వాటి ఎరను పట్టుకుని మింగడం ద్వారా చంపగలవు. చిన్నతనంలో కొండచిలువ మనిషిని మింగేస్తుందని కథలు చెబుతుంటే విన్నాం.. అసలు ఇలాంటి కథలు ఎన్నో విని ఉంటాం. అయితే ఇది నిజంగా జరగవచ్చా? దాని గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం. బర్మీస్ పైథాన్ ఎంత పెద్ద జంతువును మింగగలదో తెలుసుకుందాం.
బర్మీస్ పైథాన్‌లు ఎంత పెద్దవి?
బర్మీస్ పైథాన్ (పైథాన్ బివిట్టటస్) అనేది ముఖ్యంగా ఆగ్నేయాసియాలోని ఉష్ణమండల ప్రాంతాల్లో కనిపించే ఒక పెద్ద పాము. ఈ కొండచిలువ సగటున 3 నుండి 4 మీటర్లు (10 నుండి 13 అడుగులు) పొడవు ఉంటుంది. కానీ కొన్ని బర్మీస్ పైథాన్‌లు 6 మీటర్లు అంటే దాదాపు 20 అడుగుల వరకు ఉంటాయి. బర్మీస్ పైథాన్ బరువు గురించి చెప్పాలంటే.. ఇది 90 కిలోల వరకు ఉంటుంది. ఇప్పుడు అది ఏ మనిషినైనా వేటాడుతుంది.
అది మనిషిని వేటాడగలదా?
ఇటీవల బర్మీస్ పైథాన్ వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో 52 కిలోల, సుమారు 14.8 అడుగుల పొడవు గల ఆడ బర్మీస్ కొండచిలువ జింకను మింగినట్లు కనిపిస్తుంది. ఈ జింక బరువు దాదాపు 35 కిలోలు. ఇప్పుడు జింకను మింగింది కాబట్టి ఈ కొండచిలువ మనిషిని కూడా మింగేస్తుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. బర్మీస్ కొండచిలువ 14 నుండి 15 అడుగుల పొడవు ఉంటే, అది 4 నుండి 5 అడుగుల పొడవు ఉన్న మనిషిని కూడా మింగగలదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, బర్మీస్ పైథాన్ ఒక పెద్ద జంతువును మింగినప్పుడు, అది తన దవడలను 90 శాతానికి పైగా విస్తరిస్తుంది. జింక విషయంలో బర్మీస్ పైథాన్ తన దవడలను 93 శాతం వెడల్పు చేసింది.
మింగడానికి ముందు ఏం చేస్తుందంటే
కొండచిలువ దాని ఆహారం పెద్దదైతే, దానిని మింగడానికి ముందు అది తన గట్టిగా చుట్టేసుకుంటుంది. కొండచిలువ ఆ పెద్ద జీవిని మింగడానికి ముందే చంపేస్తుంది. దాని ఎముకలను విరిచేస్తుంది. తద్వారా అది మింగడం సులభం అవుతుంది. అయితే ఇలాంటి పెద్ద మనిషిని కొండచిలువ మింగేసిన సందర్భాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. కానీ చిన్న పిల్లలను మింగిన సందర్భాలు మాత్రం చాలానే ఉన్నాయి.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Python bivittatus do pythons really swallow humans whole what is the truth in that
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com