Premature Baby Survival: వెనుకటి కాలంలో బాల్యవివాహాలు అధికంగా జరిగేవి. అప్పట్లో పిల్లలు నెలలు నిండకుండానే పుట్టేవారు. బరువు కూడా తక్కువగా ఉండేవారు. అందువల్లే అప్పట్లో చిన్నపిల్లలు పురిట్లోనే చనిపోయేవారు. కాలానుగుణంగా వైద్య విధానాలు మారిపోయాయి. అద్భుతమైన వైద్య చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. అందువల్ల చిన్నారుల్లో మరణాల శాతం చాలా వరకు తగ్గింది. ఇతర లోపాల శాతం తగ్గింది. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో వైద్య చికిత్సలు అత్యంత చవక. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో వైద్య చికిత్సలు తక్కువ ధరలు ఉంటాయి. అందువల్లే హైదరాబాద్ నగరం హెల్త్ హబ్ గా కొనసాగుతోంది. ఈ విషయం తెలుసుకున్న ఓ సోమాలియా జంట హైదరాబాద్ వచ్చింది. సోమాలియా నుంచి వచ్చేముందు ఆ మహిళ గర్భంతో ఉంది. హైదరాబాదులో ప్రసవించింది.
ఆ మహిళ ప్రసవించినప్పుడు శిశువు బరువు కేవలం అరకిలో మాత్రమే ఉంది. జన్యుపరమైన మార్పులు.. ఇతర సమస్యలే దీనికి కారణమని తెలుస్తోంది. వాస్తవానికి ఆ మహిళకు ఉన్న అనారోగ్య సమస్యల వల్ల 23 వారాలకే శిశువు జన్మించాడు. బరువు కూడా 565 గ్రాములు మాత్రమే ఉన్నాడు. ఇక అప్పట్నుంచి ఆ శిశువును వైద్యులు అత్యవసర వైద్య విభాగంలో ఉంచి చికిత్స అందించడం మొదలుపెట్టారు. 115 రోజులపాటు ఆ శిశువు అందులోనే ఉన్నాడు. అయితే ఇప్పుడు అతని బరువు ఏకంగా రెండు కిలోలకు పెరిగింది.
Also Read: భూమి లోపల రహస్య ప్రపంచం..!
ఆ సోమాలియా మహిళ కు అంతర్గత సమస్యలు ఉన్నాయి. అందువల్లే ఆమె త్వరగా ప్రసవించింది. ప్రసవించే సమయంలో ఆమెకు తీవ్రస్థాయిలో రక్తస్రావం జరిగింది. ఆయినప్పటికీ వైద్యులు అతికష్టం మీద ఆమెకు సర్జరీ చేశారు. ఆ శిశువును బతికించడానికి అనేక రకాల మార్గాలు అన్వేషించారు. అత్యవసర వైద్య విభాగంలో ఆ శిశువును ఉంచి చికిత్స అందించడం మొదలుపెట్టారు. మొదట్లో ఆ శిశువు బతకడని అనుకున్నారు. ఆ తర్వాత అనేక రకాల ప్రయత్నాలు చేసి బతికించారు. చివరికి ఏకంగా రెండు కిలోలకు బరువులు పెంచారు. శిశువు ఆరోగ్యంగా ఉండడంతో డిశ్చార్జ్ చేశారు.. శిశువు బరువు పెరగడం.. ఆరోగ్యంగా ఉండడంతో సోమాలియా దంపతులు హైదరాబాదులోని ఆ కార్పొరేట్ ఆసుపత్రి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు.