Palm Leaf Manuscripts : : మనం కనుగొన్న విషయాన్ని.. ఆవిష్కరించిన కొత్త పద్ధతికి పేటెంట్ రైట్ తీసుకుంటున్నాం. తద్వారా భారీగా సంపాదిస్తున్నాం. కానీ ఇవేవీ అందుబాటులో లేని రోజుల్లో.. అసలు శాస్త్రీయ పరిజ్ఞానం అనేది పురుడు పోసుకోలేని సమయాలలో.. విజ్ఞానం ఎలా ఉండేది.. విజ్ఞానవంతులు తమ పరిజ్ఞానాన్ని ఎలా రాసేవారు.. దానిని ఎలా భద్రపరిచేవారు.. అలా భద్రపరచడానికి ఎలాంటి విధానాలు అవలంబించేవారు.. నాడు తమ జ్ఞానాన్ని భద్రపరిచే విషయంలో వారు ఎటువంటి పద్ధతులను పాటించేవారు.. వీటన్నింటికీ ఒకే ఒక సమాధానం ఈ చెట్టు. ఈ చెట్టు ఒక రకంగా ప్రకృతి ప్రసాదించిన వరం. దాని ఆకులు అద్భుతమైన దస్త్రాలు. అందువల్లే వాటిని మన పూర్వీకులు వారికి అనుగుణంగా ఉపయోగించుకున్నారు. వాటి ద్వారా విజ్ఞాన సర్వస్వాన్ని ప్రపంచానికి అందించారు. ఇంతకీ ఆ చెట్టు ఏమిటి? ఆ చెట్టు ఆకులను ఎలా ఉపయోగించేవారు.. దానిపై ఎలాంటి రాతలు రాసేవారు? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
Also Read : ఒక్కో ఈకలో సప్తవర్ణాలకు మించిన రంగులు.. ఈ బాతులను చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే?
వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఇవన్నీ కూడా కొన్ని భౌతికంగా కనిపిస్తుంటే.. కొన్ని తాళపత్రాల రూపంలో దర్శనమిచ్చాయి.. వెనుకటి రోజుల్లో తవ్వకాలు జరుగుతున్నప్పుడు తాళపత్రాలలో విజ్ఞాన సర్వస్వం కనిపించింది.. వెనుకటి రోజుల్లో పేపర్లు ఉండేవి కావు. పెన్నులు కూడా ఉండేవి కావు. అలాంటప్పుడు మన పూర్వీకులు తమ విజ్ఞాన సర్వస్వాన్ని, విజ్ఞాన విద్వత్తును లోహపు పెన్ను సహాయంతో తాళపత్రాల మీద రాసేవారు. వాటిని అత్యంత జాగ్రత్తగా భద్రపరిచేవారు. పదునైన లోహపు కాలంతో రాయడం వల్ల ఆ విషయాలు మొత్తం భద్రంగా ఉండేవి. భావితరాలకు అవి ఉపయోగపడాలనే ఉద్దేశంతో లోహపు కలం తో అక్షరాలను చెప్పేవారు. ఒక్కసారి అక్షరాలను చెక్కిన తర్వాత వాటిని చెరిపి వేయడానికి అవకాశం ఉండేది కాదు. అలా మన పూర్వీకులు ఎంతో శ్రమించి.. తమ విజ్ఞాన సర్వస్వాన్ని తరతరాలకు అందించారు..
తాళపత్ర వృక్షం నిటారుగా పెరుగుతుంది. దీని కాండం అత్యంత దృఢంగా ఉంటుంది. పత్రాలు కూడా దళసరిగా ఉంటాయి. లోహపు పెన్నుతో అక్షరాలు రాస్తున్న సందర్భంలోనూ పత్రాలు చెదిరిపోవు. ధ్వంసం కావు. పైగా ఈ పత్రాలు సంవత్సరాలకు సంవత్సరాలు ఉన్నప్పటికీ చెదలు పట్టవు. అందువల్లే ఈ పత్రాలను మన పూర్వీకులు తమ విజ్ఞానాన్ని భద్రపరచడానికి.. వారు సముపార్జించిన విషయాలను ఆ పత్రాల మీద రాసేవారు.. అందువల్లే తాళపత్రాలు గ్రంధాలుగా చలామణి అయ్యాయి. మన తరానికి.. మన ముందు తరానికి. ఆపై తరానికి.. అంతకు మించిన తరాలకు దిక్సూచిగా మారిపోయాయి. భూత కాలాన్ని.. ఆ కాలంలో జరిగిన విషయాలను సజీవంగా కళ్ళ ముందు ఉంచాయి. తాళపత్రంలో ప్రత్యేకమైన రసాయనాలు దానిని దృఢంగా ఉంచుతాయి. ఎలాంటి కాలంలోనైనా పాడుకాకుండా కాపాడుతాయి.