Old 5 Rupee Coins: డిజిటల్ మనీ అందుబాటులోకి వచ్చిన తర్వాత లిక్విడ్ మనీ చలామణి తగ్గిపోయింది. వీటిలో ప్రస్తుతం కాయిన్స్ వాడకం మరీ తగ్గిపోయింది. అయితే ఒకప్పుడు ఐదు రూపాయల కాయిన్స్ మందంగా ఉండేది. కానీ ఇప్పుడు సన్నటి బిల్ల అందుబాటులో ఉంది. అయితే మందపాటిగా ఉన్న ఆ కాయిన్స్ ఆర్బిఐ రద్దు చేసింది. వాటి స్థానంలో సన్నటి గోల్డ్ కలర్ లో ఉన్న కాయిన్స్ ను ముద్రిస్తున్నారు. అసలు పాత అయిదు రూపాయల కాయిన్స్ ఎందుకు చలామణిలో లేదు? దానిని బ్యాన్ చేయడానికి కారణాలేంటి?
పాత అయిదు రూపాయల కాయిన్ ను కప్రో, నికెల్ వంటి లోహాలతో తయారు చేశారు. అయితే ఈ ఐదు రూపాయల కాయిన్స్ ను బంగ్లాదేశ్ కు అక్రమంగా తరలించారు. అక్కడ ఈ ఐదు రూపాయల కాయిన్స్ కరిగించి రేజర్ బ్లేడ్లను తయారు చేశారు. ఒక ఐదు రూపాయల కాయిన్స్ నుంచి ఆరు బ్లేడ్లను ఉత్పత్తి చేసేవారు. ఒక్కో బ్లేడు ధర రూ.2 .. అంటే ఒక ఐదు రూపాయల నుంచి రూ. 12 రూపాయలు సంపాదించేవారు. ఈ విషయాన్ని గమనించిన ఆర్బిఐ పాత ఐదు రూపాయల బిల్లల ఉత్పత్తిని ఆపివేసింది. వాటి స్థానంలో గోల్డ్ కలర్ లో ఉన్న కాయిన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
అంతేకాకుండా పాత అయిదు రూపాయల కాయిన్ ను తయారు చేయడానికి ఉపయోగించే లోహం ధర పెరిగిపోయింది. ధర పెరిగినప్పుడు కాయిన్స్ ఉత్పత్తిని ఆపివేస్తారు. ఐదు రూపాయల కాయిన్ ను ఉత్పత్తి చేయడానికి మింటింగ్ అంటారు. ప్రభుత్వ ఆధీనంలో మింటింగ్ ఉత్పత్తి కేంద్రాలు ఉంటాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐదు రూపాయల కాయిన్ తయారు చేయడానికి నికెల్, ఇత్తడి లోహాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ మిశ్రమం తయారైన తర్వాత ఒక పలకలాగా తయారుచేస్తారు. ఆ తర్వాత గుండెటి బిళ్ళలను కట్ చేసి వాటిపై ముద్రణ చేస్తారు. చుట్టూ అంచు కొద్దిగా ఎత్తుగా ఉండేలా తయారు చేస్తారు. ఆ తర్వాత తయారుచేసిన బిల్లలను లెక్కిస్తారు. ప్రతిరోజు ఒక పరిణామంలో మాత్రమే కాయిన్స్ ను తయారు చేసి లెక్కిస్తారు. అంతేకాకుండా ఒక క్రమ పద్ధతిలో వీటిని విడుదల చేస్తారు. పరిమాణం కంటే ఎక్కువగా రిలీజ్ చేసే అవకాశం ఉండదు. చిల్లర వినియోగంలో ఈ ఐదు రూపాయల కాయిన్స్ ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పాత వాటి కంటే ఇప్పటి కాయిన్స్ చాలా తేలికగా ఉంటున్నాయి. దీంతో వీటిని ఎక్కువమంది ఉపయోగిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఐదు రూపాయలు, పది రూపాయల కాయిన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే 20 రూపాయల కాయిన్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. గతంలో 25np, 50 np ఉండేవి. కానీ వీటి విలువ తగ్గడంతో ఇవి మార్కెట్లోకి రావడం తగ్గిపోయింది.