Oceans On The Earth: ఈ భూమ్మీద దాదాపు ముప్పావు వంతుకు మించి నీరు ఉంది. కేవలం కొత్తమేర మాత్రమే భూభాగం ఉంది. ఆ భూ భాగంలోనే మనుషులు, చెట్లు, ఇతర జీవరాశి నివసిస్తూ ఉంటుంది. సముద్రాలలో కూడా జంతువులు.. మొక్కలు ఆవాసం సాగిస్తూ ఉంటాయి.
ధ్రువ ప్రాంతాలు కరగడం వల్ల సముద్ర నీటిమట్టం అంతకంతకు పెరిగిపోతుంది. దీనంతటికీ ప్రధాన కారణం వాతావరణ కాలుష్యం.. భౌగోళికంగా జరుగుతున్న మార్పులు. అందువల్లే ధ్రువ ప్రాంతాలు ఈ స్థాయిలో కరిగిపోతున్నాయి. ఇలా కరిగిపోవడం వల్ల తీర ప్రాంతాలలో ఉన్న నగరాలు మునిగిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు దీవులు కాలగర్భంలో కలిసిపోయాయి. కాలుష్యం ఇదే స్థాయిలో కొనసాగితే అవన్నీ కూడా నీటిలో మునిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది.
ఇక మన భూమ్మీద ఏడు సముద్రాలు ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా కొన్ని సముద్రాలు ఉన్నాయి. భూమి లోపల ఈ స్థాయిలో సముద్రాలు ఉంటే.. మరి భూమి వెలుపల పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ ప్రశ్న చాలా మందికి వచ్చే ఉంటుంది. పురాణాల ప్రకారం హిరణ్యాక్షుడు భూమిని సముద్రంలో దాచాడు.. అప్పుడు భూమి వెలుపల పరిస్థితి ఎలా ఉంటుంది? అనే సందేహం చాలా మందికి వచ్చి ఉంటుంది. అయితే దీనికి ఇప్పుడు సమాధానం లభించింది.
ఈ విశ్వంలో సగం వరకు గర్బోధక జలాలు ఉంటాయి. ఇందులో అనంతమైన నీరు ఉంటుంది. అందువల్ల హిరణ్యక్షుడు భూమిని ఈ విశ్వ జలరాశి అడుగున భద్రపరిచాడు. ఒక నీటి గిన్నెలో బంతి మునిగినట్టుగా భూగోళం అ సముద్రంలో మునిగిపోయింది. అప్పుడు విష్ణుమూర్తి వరహా రూపంలో ఆ జలాల లోపలికి వెళ్లి భూమిని తన కోరల మీద రక్షించాడు. ఇక భూమి లోపల జలాలు ఉన్నట్టే.. కఠినమైన శిలలు.. మృత్తికలు ఉన్నాయి. అవన్నీ కూడా భూమిని సంరక్షిస్తున్నాయి. అందువల్ల ఈ స్థాయిలో నీరు ఉన్నప్పటికీ.. మిగతా భూభాగం సురక్షితంగా ఉంటుంది. సమస్త జీవరాశికి నివాసంగా ఉంటున్నది.
కాలుష్యం, పారిశ్రామికీకరణ జరిగినప్పుడు సముద్రాలు స్థిరంగా ఉండేవి. ధ్రువ ప్రాంతాలు కూడా ఎటువంటి ఒత్తిడి లేకుండా ఉండేవి. ఎప్పుడైతే కాలుష్యం పెరిగిపోయిందో.. పారిశ్రామికీకరణ ఎక్కువైందో.. అప్పటినుంచి వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ధ్రువ ప్రాంతాలు ఒత్తిడికి గురై కరిగిపోతున్నాయి. అందువల్ల సముద్రమట్టాలు ఊహించని విధంగా పెరిగిపోతున్నాయి.