Homeవింతలు-విశేషాలుNASA satellite images India: మన యూపీ, బీహార్ ను.. అంతరిక్షం నుంచి చూసి నాసానే...

NASA satellite images India: మన యూపీ, బీహార్ ను.. అంతరిక్షం నుంచి చూసి నాసానే ఆశ్చర్యపోయింది..

NASA satellite images India: మనదేశంలో బీమారి రాష్ట్రాలుగా ఉత్తర ప్రదేశ్, బీహార్ పేరుపొందాయి. ఇక్కడ పేదరికం అధికంగా ఉంటుంది. నిరక్షరాస్యత కూడా అదే స్థాయిలో ఉంటుంది. అందువల్లే ఇక్కడి ప్రజలు దారిద్రంలో జీవిస్తుంటారు.. ఇక్కడి రాష్ట్రాల రూపురేఖలు మార్చడానికి ప్రభుత్వాలు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ.. మార్పు అంతంతమాత్రంగానే ఉంది.

ఇటీవల కాలంలో మాత్రం ఈ రాష్ట్రాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా 2014 నుంచి 2022 వరకు ఈ రాష్ట్రాలలో అభివృద్ధి అనేది కొత్త పుంతలు తొక్కింది. ఇది నాసా తీసిన శాటిలైట్ ఫోటోల ద్వారా తెలిసింది. 2014 నుంచి 2022 కాలంలో 9 సంవత్సరాల పాటు రాత్రి వేళ నాసా ఉపగ్రహాలు 1.16 మిలియన్ శాటిలైట్ ఇమేజెస్ ను తీశాయి. ఈ ఫోటోలలో బీహార్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. మిగతా రాష్ట్రాలు కూడా కాంతివంతంగా కనిపిస్తున్నాయి. విద్యుత్ కాంతులలో బీహార్, ఉత్తరప్రదేశ్ మెరిసిపోవడం మార్పునకు సంకేతమని భారతీయులు పేర్కొంటున్నారు.

ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలను గతంలో వెనుకబడిన రాష్ట్రాలు అని పిలిచేవారు. ఈ రాష్ట్రాలలో ఇప్పుడు అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. రోడ్లు, వంతెనలు, మౌలిక రంగ ప్రాజెక్టుల నిర్మాణం ఇక్కడ వేగంగా సాగుతోంది. అందువల్లే ఈ ప్రాంతాలు అభివృద్ధి బాట పడుతున్నాయి. అభివృద్ధి వల్లే అక్కడ విద్యుత్ వినియోగం పెరిగింది. విద్యుత్ అంటే తెలియని ప్రాంతాలకు సరికొత్తగా సౌకర్యం కల్పించారు. అందువల్లే నాసా తీసిన ఉపగ్రహ చిత్రాలలో అది స్పష్టంగా కనిపించింది.

బీహార్, ఉత్తరప్రదేశ్ మాత్రమే కాకుండా.. మిగతా రాష్ట్రాలు మరింత కాంతివంతంగా కనిపించాయి. దక్షిణాది రాష్ట్రాలను ఆకాశాల నుంచి చూస్తే అత్యంత అందంగా దర్శనమిచ్చాయి. దక్షిణాది రాష్ట్రాలలో విద్యుత్ వినియోగం మొదటి నుంచి కూడా ఎక్కువే. ఇక్కడ అభివృద్ధి పనులు విస్తృతంగా జరుగుతూ ఉంటాయి. అందువల్లే ఈ ప్రాంతాలు సరికొత్తగా కనిపిస్తుంటాయి.. నాసా తీసిన చిత్రాల్లో కూడా ఈ దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి.. తాజాగా మౌలిక రంగ ప్రాజెక్టుల నిర్మాణం ఇక్కడ వేగిరం కావడంతో భూముల ధరలు అమాంతం పెరిగాయి.. సోలార్ పవర్ తయారీకి కొత్తగా పార్కులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సూర్య ఘర్ అనే పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది..

 

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version