Homeవింతలు-విశేషాలుInsurance Fraud bear attack: ఎంతకు తెగించార్రా.. ఇన్సూరెన్స్ కోసం ఎలుగుబంట్లను వాడుకున్నారు.. చివరికి జరిగింది...

Insurance Fraud bear attack: ఎంతకు తెగించార్రా.. ఇన్సూరెన్స్ కోసం ఎలుగుబంట్లను వాడుకున్నారు.. చివరికి జరిగింది ఇదీ

Insurance Fraud bear attack: రోల్స్ రాయిస్, బెంజ్ కార్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటిని కొనుగోలు చేయడానికి శ్రీమంతులు పోటీ పడుతుంటారు. ఎందుకంటే వీటిలో ఉన్న సౌకర్యాలు ఆ స్థాయిలో ఉంటాయి. ఇంజన్ దగ్గర్నుంచి ఇంటీరియర్ వరకు… సీటింగ్ దగ్గర్నుంచి కంఫర్ట్ వరకు ఇందులో సౌలభ్యాలు ఒక స్థాయిలో ఉంటాయి. అందువల్లే వీటిని కొనుగోలు చేయడానికి శ్రీమంతులు పోటీ పడుతుంటారు. వీటిని తమ వద్ద ఉంచుకోవడాన్ని సామాజిక దర్పంలాగా భావిస్తుంటారు.

కేవలం మనదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. వీటికి ధర విపరీతంగా ఉంటుంది కాబట్టి.. వీటిని కొనుగోలు చేసిన వాళ్లంతా కూడా ఇన్సూరెన్స్ చేయిస్తారు. ఈ వాహనాలకు ప్రమాదవశాత్తు ఏదైనా నష్టం జరిగితే ఇన్సూరెన్స్ సంస్థలు డబ్బు చెల్లిస్తుంటాయి.. అమెరికాలోని కాలిఫోర్నియా ప్రాంతంలో ఇటీవల రోల్స్ రాయిస్, బెంజ్ కార్లు కొనుగోలు చేసిన వారు తీవ్రంగా నష్టపోయారు.. దీనికి ప్రధాన కారణం వారు కొనుగోలు చేసిన వాహనాలపై ఎలుగు బంట్లు దాడులు చేశాయి. తాము ప్రయాణం సాగిస్తుండగా అకస్మాత్తుగా ఎలుగు బంట్లు దాడులు చేశాయని ఇన్సూరెన్స్ సంస్థలకు క్లెయిమ్ చేశారు.

ఆ వాహనాలను పరిశీలించిన ఆయా సంస్థల ప్రతినిధులు ఇన్సూరెన్స్ విడుదల చేశారు.. అయితే వారిలో ఒక అనుమానం కలిగింది.. వాహనాలను పరిశీలించిన తర్వాత.. వాటికి నష్టం జరిగిన తీరు చిత్రంగా అనిపించింది.. ఎందుకంటే ఎలుగుబంట్లు పార్క్ చేసిన వాహనాలపై అంతగా దాడులు చేయవు. కాలిఫోర్నియా ప్రాంతంలో ఎలుగు బంట్లు అంతగా ఉండవు. దీంతో ఇన్సూరెన్స్ సంస్థ అధికారులు తమ డబ్బు మంజూరు చేసిన వ్యక్తుల ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో వారి ఇళ్లల్లో ఎలుగు బంట్ల డ్రెస్ లు కనిపించాయి. దీంతో అధికారులు ఆపరేషన్ బేర్ క్లా చేపట్టారు.

బీమా సొమ్ము కోసం కొంతమంది వ్యక్తులు ఈ దుర్మార్గానికి పాల్పడినట్టు అధికారుల విచారణలో తేలింది. వారంతా కూడా ఎలుగుబంటి డ్రెస్ లు వేయించి.. కార్లపై దాడులు చేయించారు. ఆ తర్వాత బీమా సొమ్ము కోసం దరఖాస్తు చేసుకున్నారు.. అధికారుల విచారణలో ఈ వాస్తవాలు తెలియడంతో.. బీమా సొమ్ము కోసం అక్రమాలకు పాల్పడిన ఆ వ్యక్తులకు కేసులు నమోదు చేశారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version