NASA: గ్రహాంతర వాసులు, ఫ్లయింగ్ సాసర్లు, యూఎఫ్‌వోలు ఇలా అనేక అంశాలపై దశాబ్దాలుగా మిస్టరీ కొనసాగుతోంది. ఇవి ఉన్నాయా లేదా అనే విషయాన్ని ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఇక అంతరిక్ష పరిశోధనలో ప్రపంచంలో అగ్ర భాగంలో ఉన్న అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా కూడా దీని గురించి ఏమీ తేల్చలేకపోయింది. ఇదిలా ఉండగా, నాసా, తాజాగా కొన్ని ఆసక్తికర ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
చంద్రుడి చుట్టూ వింత వస్తువు
ఈ ఫొటోలో్ల చంద్రుని చుట్టూ ఓ వింత వస్తువుతు తిరుగుతున్నట్లుగా ఉంది. చంద్రుని చుట్టూ తిరుగుతున్న ఆ వస్తువు సిల్వర్ సర్ఫ్ బోర్డ్ మాదిరిగా ఉందని నాసా వెల్లడించింది. ఈ సర్ఫ్ బోర్డ్ వంటి వస్తువును లూనార్ రికానైసెన్స్ ఆర్బిటర్‌లోని కెమెరా బంధించినట్టు వివరించారు. అయితే, ఆ తర్వాత తేలిందేమిటంటే… నాసా ఎల్‌ఆర్‌వో చిత్రీకరించిందని తేలింది.
వింత ఆకృతి కాదు.. లూనార్ ఆర్బిటర్..
ఇక చివరకు నాసా విడుదల చేసిన ఫొటోల్లో ఉన్న వింత వస్తువే ఏమిటి అంటే అది దక్షిణ కొరియాకు చెందిన మరో లూనార్ ఆర్బిటర్ అని. దక్షిణ కొరియా లూనార్ ఆర్బిటర్ పేరు దనురి. ఇది కూడా చంద్రుడి చుట్టూ తిరుగుతూ పరిశోధనలు చేస్తున్నట్లు గుర్తించారు. ఇది నాసా ఎల్‌ఆర్‌వోకు అభిముఖంగా తిరుగుతున్నట్లు గుర్తించారు. ఈ సమయంలోనే ఫొటోలు తీసినట్లు నిర్ధారణ అయింది. అయితే ఈ రెండు లూనార్ ఆర్బిటర్‌ల ద్రవ్య వేగంలో భారీగా తేడా ఉన్నట్లు తేలింది. అందుకే ఎల్‌ఆర్‌వో తీసిన ఫొటోలో చిన్న గీతలా దనురి కనిపించింది. దనురి దక్షిణ కొరియా చంద్రునిపైకి పంపిన తొలి స్పేస్ క్రాఫ్ట్. ఇది 2022 నుంచి చంద్రుని కక్ష్యలో పరిభ్రమిస్తుంది.