https://oktelugu.com/

Anil Ravipudi -Venkatesh Movie: వెంకటేష్ అనిల్ రావిపూడి సినిమాలో ఆ సూపర్ హిట్ సాంగ్ ను రీమిక్స్ చేస్తున్నారా..?

వెంకటేష్ తో చేయబోయే సినిమాలో కూడా కొన్ని సీన్లను రీ క్రియేట్ చేస్తూ అలాగే ఒక సాంగ్ ను కూడా రీమిక్స్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : April 12, 2024 / 06:58 PM IST

    Anil Ravipudi Venkatesh New Movie

    Follow us on

    Anil Ravipudi -Venkatesh Movie: సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమాని సక్సెస్ చేయడానికి దర్శకులు వివిధ రకాల ఎలిమెంట్స్ ని వాడుతూ ఉంటారు. కొంతమంది దర్శకులు కథ వీక్ గా ఉన్న కూడా ఆ సినిమాలో కొన్ని ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ను వాడి ఆ సినిమాను కమర్షియల్ గా సూపర్ సక్సెస్ చేయడానికి తమదైన రీతిలో కసరత్తులను చేస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు ఒక కమర్షియల్ సినిమాని ప్రేక్షకులకు నచ్చే విధంగా తీయడంలో సిద్ధహస్తుడనే చెప్పాలి.

    ఇక అందుకోసమే ఆయన చేస్తున్న ప్రతి సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ ని ఆడ్ చేస్తూ ఉంటాడు. ఇక ఇప్పుడు వెంకటేష్ తో చేయబోయే సినిమాలో కూడా కొన్ని సీన్లను రీ క్రియేట్ చేస్తూ అలాగే ఒక సాంగ్ ను కూడా రీమిక్స్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇంతకుముందు వెంకటేష్ హీరోగా విజయభాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన “మల్లీశ్వరి” సినిమాలో వెంకటేష్ ‘పెళ్లి కానీ ప్రసాద్’ పాత్రను పోషించాడు. అయితే ఆ పాత్రని రీ క్రియేట్ చేస్తూ ఇప్పుడు చేయబోయే సినిమాలో కొన్ని సీన్లని రాసుకున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక అలాగే వెంకటేష్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిన బొబ్బిలి రాజా సినిమాలో ఎవర్గ్రీన్ సంగ్ గా నిలిచిన “బలపం పట్టి భామ ఒళ్ళో” సాంగ్ ని రిమిక్స్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే అనిల్ రావిపూడి ఏదో ఒక మ్యాజిక్ చేసి సినిమాని సక్సెస్ తీరాలకు చేరుస్తాడు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక తన గత చిత్రాలను కనుక చూసుకుంటే పటాస్ సినిమాలో బాలకృష్ణ హీరోగా నటించిన రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలోని ఒక సాంగ్ ని రీమిక్స్ చేశాడు.

    అలాగే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ హీరోగా వచ్చిన సుప్రీం సినిమాలో కూడా చిరంజీవి హీరోగా వచ్చిన ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’ సినిమాలోని ‘అందం హిందోళం’ అనే సాంగ్ ని రీమిక్స్ చేశాడు. ఇక ఈ సినిమాలో కూడా అలాంటి ఎలిమెంట్స్ ని వాడుతున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఈ సినిమా వెంకటేష్ కెరియర్ లోనే అతి పెద్ద హిట్ గా నిలువబోతున్నట్టుగా తెలుస్తుంది…