https://oktelugu.com/

Mystery : ఈ లక్షణాలు చివరి క్షణాల్లో కనిపించకపోతే.. ఇక నరకానికే వెళ్తారా?

ఒక మనిషి చనిపోయే ముందు కొన్ని లక్షణాలు వారు స్వర్గానికి వెళ్తారా? లేకపోతే నరకానికి వెళ్తారా? అనే విషయాలను తెలియజేస్తుంది. మరి చనిపోయే ముందు మనిషిలో కనిపించే ఆ లక్షణాలు ఏంటి? అవి ఏం తెలియజేస్తాయో ఈ స్టోరీలో చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 28, 2024 / 07:32 AM IST

    Mystery

    Follow us on

    పుట్టిన మనిషికి మరణం తప్పదు. మరణించిన మనిషికి జననం తప్పదని మన పురాణాలు చెబుతుంటాయి. అయితే ఎవరి సమయం వచ్చినప్పుడు ప్రతీ మనిషి చనిపోవాల్సందే. ఒక మనిషి భూమి మీద ఉన్న అన్ని రోజుల కంటే చనిపోతే ఎక్కువ విలువ సంపాదిస్తారు. అప్పటి వరకు తిట్టిన వాళ్లు కూడా చివరకు పొగుడుతారు. అయితే మరణించిన మనుషులు వారు చేసే పాప పుణ్యాల బట్టి స్వర్గం లేదా నరకానికి వెళ్తుంటారు. పుణ్యం చేస్తే స్వర్గానికి, పాపాలు చేస్తే నరకానికి వెళ్తుంటారు. అయితే ఒక మనిషి చనిపోయే చివరి క్షణాలు చాలా కీలకమైనవి. మంచి వారైన, చెడ్డ వారైన చనిపోతే స్వర్గానికే పోవాలని అందరూ కోరుకుంటారు. ఎన్ని పాపాలు చేసిన కూడా స్వర్గానికి వెళ్లాలని ప్రతీ ఒక్కరూ కూడా కోరుకుంటారు. అయితే ఒక మనిషి చనిపోయే ముందు కొన్ని లక్షణాలు వారు స్వర్గానికి వెళ్తారా? లేకపోతే నరకానికి వెళ్తారా? అనే విషయాలను తెలియజేస్తుంది. మరి చనిపోయే ముందు మనిషిలో కనిపించే ఆ లక్షణాలు ఏంటి? అవి ఏం తెలియజేస్తాయో ఈ స్టోరీలో చూద్దాం.

    భగవద్గీత ప్రకారం శరీరంలో మొత్తం తొమ్మిది ప్రధాన రంధ్రాలు ఉంటాయి. జీవితంలో పుణ్యాలు చేసిన వారికి శరీరం పైభాగం నుంచి అనగా కళ్లు, ముక్కు, నోరు, చెవుల నుంచి ఆత్మ బయటకు వెళ్తుంది. మరణించేటప్పుడు ముక్కు నుంచి ఆత్మ బయటకు వెళ్తే.. కాస్త వక్రంగా మారుతుందట. అదే కళ్లు మూసుకోకుండా ఉండటంతో పాటు చెవి కాస్త లాగినట్లు కనిపిస్తుందట. అలాగే చనిపోయేటప్పుడు నవ్వుతూ మరణించిన వారు స్వర్గానికి వెళ్తారట. ఏదో కోల్పోయినట్లు బాధపడుతూ చనిపోయిన వారు నరకానికి వెళ్తారట. మరణం మీద భయం లేనివారు కచ్చితంగా స్వర్గానికే.. కానీ మరణం మీద భయంతో ఉన్నవారు నరకానికి వెళ్తారని మన పురాణాలు చెబుతున్నాయి. అలాగే మరణించేటప్పుడు కొందరు భయపడి మలం, మూత్రం విసర్జన చేస్తుంటారు. ఇలా చేయకుండా ఉన్న వారు స్వర్గానికి వెళ్తారట. అయితే మరణించేటప్పుడు నోటిలో తులసి నీళ్లు లేదా గంగాజలం వేయడం వల్ల వారు స్వర్గానికి వెళ్తారట. అలాగే ఎంతో అదృష్టవంతులు అని కొన్ని పురాణాలు చెబుతున్నాయి.

    అలాగే మరణించే సమయంలో వారికి నల్ల దుస్తుల్లో ఉన్న వారు కనిపిస్తే నరకానికి వెళ్తారట. వారిని స్వయంగా యమధూతలే తీసుకెళ్లడానికి వచ్చారట. అదే వీరికి పసుపు రంగు దుస్తుల్లో ఉండేవారు కనిపిస్తే వారిని స్వర్గానికి తీసుకెళ్లడానికి వచ్చినట్లు అని చెబుతున్నారు. మరణించేటప్పుడు కనిపించే లక్షణాల బట్టి స్వర్గానికి లేదా నరకానికి వెళ్తుంటారట. అందుకేనేమో ఆత్మహత్య చేసుకోకూడదు, చనిపోయేటప్పుడు నవ్వుతూ ఉండాలని, బాధపడకూడదని మన పెద్దలు చెబుతుంటారు. ఆత్మహత్య చేసుకున్న వారు ఏదో బాధతో చనిపోతారు. దీనివల్లనే వారు నరకానికి వెళ్తారని అంటుంటారు. అందుకే మన పెద్దలు ఊరికే చెప్పరు. ప్రతీ దానికి ఓ కారణం ఉందని కొందరు అంటుంటారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.