Mumbai Metro Launches Bike Friendly Coach: నేటి కాలంలో సోషల్ మీడియా వినియోగం అధికంగా పెరిగిపోయింది. సోషల్ మీడియాలో కూడా రకరకాల సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. సదుపాయాలు ఏ స్థాయిలో అయితే అందుబాటులోకి వచ్చాయో.. అదే స్థాయిలో సంచలనమైన వీడియోలు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తోంది. ఆ వీడియోను చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. వామ్మో ఇలా కూడా జరుగుతుందా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.
సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియో ప్రకారం.. ముంబై మహానగరంలో ఓ యువతి మెట్రో రైలులో ప్రయాణిస్తుంది. స్పోర్ట్స్ వేర్ ధరించింది. నెత్తికి హెల్మెట్ పెట్టుకుంది. అంతేకాదు మెట్రో రైలులో తను మాత్రమే కాకుండా.. తన వెంట సైకిల్ ను తీసుకెళ్ళింది. ఆ రైలులో తను అప్పటిదాకా ప్రయాణించిన సైకిల్ ను పార్క్ చేసింది. వాస్తవానికి మెట్రో రైలు ముంబై నగరంలో నిండుగా ప్రయాణికులతో పరుగులు తీస్తూ ఉంటుంది. రద్దీ సమయాలలో మెట్రో రైలు లో అడుగు తీసి అడుగుపెట్టే అవకాశం కూడా ఉండదు. అలాంటి చోట ఓ మహిళ అందులో ప్రయాణించడమే కాదు.. తాను అప్పటిదాకా ప్రయాణించిన సైకిల్ ను కూడా పార్క్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తోంది.
ఆ యువతి మెట్రో రైల్ కోచ్ లో సైకిల్ పార్క్ చేయడం సంచలనం కలిగిస్తోంది. అయితే ముంబై మెట్రోలో ప్రయాణించేవారు సైకిళ్ళను పార్క్ చేయడానికి కార్నర్లో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. అసౌకర్యాన్ని ఆ యువతి మొట్టమొదటిసారిగా ఉపయోగించుకున్నారు. అంతేకాదు ఇలా కార్నర్లో సైకిల్ పార్క్ చేయడానికి చేసిన ఏర్పాట్లను ఆమె మెచ్చుకున్నారు. అయితే ఈ వీడియోని చూసిన వారంతా కూడా.. ఇది ముంబైలో జరిగి ఉండదని.. జర్మనీ లాంటి ప్రాంతాలలో జరిగి ఉంటుందని భావించారు. కానీ అసలు విషయం తెలుసుకొని ఇండియా కూడా చాలా డెవలప్ అయిందని వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు. అయితే ముంబైలో ఇటీవల కాలంలో ప్రజలలో ఆరోగ్య స్పృహ పెరిగింది. దగ్గర ప్రాంతాలకు వెళ్లడానికి ద్విచక్ర వాహనాలకు బదులుగా సైకిళ్ళను ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మెట్రోలలో కార్నర్ పార్కింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సౌకర్యాన్ని వచ్చే రోజుల్లో ప్రయాణికులు ఉపయోగించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
Mumbai Metro commuters have an easy way to travel with their bicycles on Lines 2A and 7. pic.twitter.com/vcowgNGBSH
— Indian Infra Report (@Indianinfoguide) October 11, 2025