https://oktelugu.com/

Sunita Williams: సునీతా విలియమ్స్‌ను తీసుకురండి.. అగ్రరాజ్యాధినేతకు ప్రపంచ కుభేరుడి వినతి!

అంతరిక్ష కేంద్రంలోకి 8 నెలల క్రితం వెళ్లిన భారత సంతతి వ్యోమగామిని అక్కడే చిక్కుకుపోయింది. మరో వ్యోమగామి బుచ్‌ విల్మోర్‌తో కలిసి అంతరిక్షంలోకి వెళ్లారు. వారిని తీసుకెళ్లిన అంతరిక్ష నౌక స్టార్‌ లైనర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో అక్కడే చిక్కుకుపోయారు. ఎనిమిది నెలలుగా అక్కడే ఉన్నారు.

Written By: , Updated On : January 30, 2025 / 08:56 PM IST
Sunita Williams

Sunita Williams

Follow us on

Sunita Williams: నాసా వ్యోమగామి, భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్(Sunitha williams), మరో ఆస్ట్రోనాట్‌ బుచ్‌ విల్మోర్‌(Buch Willmore)ను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌) నుంచి తీసుకురావాలని టెక్‌ దిగ్గజం, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కోరాడు. ఈ విషయాన్ని ఆయన తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్‌(Trouth)లో షేర్‌ చేశాడు. బైడెన్‌ ప్రభుత్వం అంతరిక్ష కేంద్రంలో వదిలేసిన ఇద్దరు ధైర్యవంతులైన వ్యోమగామును తీసుకురావాలని మస్క్‌ను కోరుతున్నా. సునీతా విలియమ్స్, బుచ్‌ విల్మోర్‌ నెలలుగా అంతరిక్షంలో ఉన్నారు. వీలైనంత త్వరగా వారిని తీసుకురావాలి. గుడ్‌ లక్‌ ఎలాన్‌’ అని ట్రంప్‌ తన పోస్టులో పేర్కొన్నాడు. దీనికి మస్క్‌(Musk)కూడా స్పందించారు. ఆయన కూడా తన సొంత సోషల్‌ మీడియా ఎక్స్‌ వేదికగా రిప్లై ఇచ్చారు. ‘మేం తీసుకువస్తాం. బైడెన్‌ ప్రభుత్వం ఇంతకాలం వారిని వదిలేయడం దారుణం’ అని మస్క్‌ కామెంట్‌ చేశారు.

పది రోజుల మిషన్‌ కోసం..
ఇదిలా ఉంటే.. సునీతా విలియమ్స్, బుచ్‌ విల్మోర్‌ పది రోజుల మిసన్‌ కోసం 2024, జూన్‌ 5న అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. అయితే అక్కడకు వెళ్లాక వ్యోమ నౌకలో థ్రస్టర్‌ పనిచేయకపోవడ, హీలియం లీక్‌ కావడంతో వ్యోమగామును అక్కడే వదిలేసి స్టార్‌లైనర్‌(Star Liner) క్యాప్సుల్‌ మాత్రం సెప్టెంబర్‌ 7న భూమికి తిరిగి వచ్చింది. అంతరిక్షంలో ఎక్కువకాలం ఉండడంతో ఆమె చాలా బరువు పెరిగినట్లు ఇటీవల బయటకు వచ్చిన ఫొటోల ద్వారా వెల్లడైంది. అయితే తన ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలను గతేడాది నవవంబర్‌లో సునీతా విలియమ్స్‌ తోసిపుచ్చారు. తన శీరంర కొద్దిగా మారిందని, అదే బరుతోతో ఉన్నానని చెప్పారు. ఒకవేల మార్చి నెలాఖరులోపు వీరిద్దరూ భూమిపైకి తిరిగి వస్తే.. అనుకోకుండా అక్కడే ఉండిపోయి 300 రోజులపాటు అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములుగా మరో రికార్డు నెలకొల్పుతారు.

ఎలా నడవాలో గుర్తు చేసుకుంటున్నా…
ఇదిలా ఉంటే.. ఏడు నెలలుగా అంతరిక్ష కేంద్రంలో ఉండిపోయిన సునీతా తాను చదివిన పాఠశాల విద్యార్థులతో సోమవారం(జనవరి 27న) మాట్లాడారు. వర్చువల్‌గా జరిగిన ప్రశ్నోత్తరాల సెషన్‌లో సునీతను విద్యార్థులు అత్యల్ప గురుత్వాకర్షణ స్థితిపై ప్రశ్నలు అడిగారు. ఈత కొట్టడం, ఎగరడం వంటి అనుభూతిని మాత్రమే ఆస్వాధిస్తున్నానని సునీత విలియమ్స్‌ తెలిపారు. ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉండడంతో తన శరీరం అనేక సర్దుబాట్లకు లోనైందని తెలిపారు. చాలాకాలంగా నడవలేదని పేర్కొన్నారు. కూర్చోలేదని, పడుకోలేదని, నడవడం ఎలా ఉంటుందో గుర్తుచేసుకుంటున్నా అని వివరించారు. ఎలాగో తిరిగి రావడానికి ఇంకా నెల రోజులు సమయం పడుతుందనుకున్నా.. కానీ, ఇన్ని రోజులైనా ఇంకా ఉండాల్సి రావడం కాస్త ఇబ్బందిగా ఉంది. వృద్ధాప్యంలో ఉన్న నా తల్లితో వీలైనంత ఎక్కువ సేపు మాట్లాడుతున్నా. అంతరిక్ష కేంద్రంఓల బిజీ షెడ్యూల్, కుటుంంతో క్రమం తప్పకుండా మాట్లాడడం వల్ల తాను ఒంటరిగా ఉన్నట్లు భావించడం లేదు అని వివరించారు.