Mauritania marriage traditions: పెళ్లిని ఒక వేడుకలాగా మన ప్రాంతంలో జరుపుకుంటారు. భారీగా ఖర్చు పెడతారు. ముఖ్యంగా అమ్మాయిలు నాజుకుగా మారిపోతారు. అబ్బాయిలు కూడా అందంగా రెడీ అవుతారు. శరీర ఆకృతి సరిగా లేకపోతే.. జిమ్ లో రకరకాల కసరత్తులు చేస్తుంటారు. పూర్తిగా సౌష్టవాన్ని పొందుతుంటారు.. మనదేశంలో కాబోయే దంపతులు ఇలా మారిపోతే.. మౌరి టానియా దేశంలో మాత్రం పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంటుంది.
మౌరి టానియా దేశం ఆఫ్రికా ఖండంలో ఉంటుంది. ఇక్కడ పెళ్ళికి ముందు అమ్మాయిలు ఫ్యాట్ ఫార్మ్స్ కు వెళ్తుంటారు. దీని వెనక ఒక కారణం ఉంది. అమ్మాయిలకు పెళ్లి కావాలంటే ఖచ్చితంగా వారు లావు అవ్వాలి. అలా ఉంటేనే ఆ అమ్మాయి కుటుంబం సంపన్నంగా ఉందని అక్కడివారు భావిస్తుంటారు. అమ్మాయిలు బక్కగా ఉంటే.. లావు అవడానికి రకరకాల విధానాలు పాటిస్తారు. వారిని ఫ్యాట్ ఫార్మ్స్ కు పంపిస్తారు. అక్కడ అమ్మాయిలకు బలవంతమైన ఆహారం పెడతారు.. ఒంటె పాలు తాగిస్తారు. లావు అయిన తర్వాత వివాహం జరిపిస్తారు.
మౌరి టానియా దేశంలో లేబ్లే ఆచారంలో భాగంగా ఇక్కడి యువతులకు ఈ విధంగా చేస్తారు. తరతరాల నుంచి ఈ ఆచారం కొనసాగుతూ ఉంది. దీనివల్ల అమ్మాయిల శరీర సౌష్టవం పెరగడంతో పాటు.. వారి ఆరోగ్యం మెరుగుపడుతుందని ఇక్కడి పూర్వికులు చెబుతుంటారు. ఆడపిల్లలు తమ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి కల్పించిన గొప్ప అవకాశం అని అక్కడి వారు చెబుతుంటారు. ఆరోగ్యం మెరుగుపడితే ఆ ఇల్లు బాగుంటుందని.. ఆ అమ్మాయిలు జన్మనిచ్చే సంతానం ఆరోగ్యంగా ఉంటుందని అక్కడివారు నమ్ముతుంటారు. అందువల్లే ఆడపిల్లలకు ఒంటె పాలు.. డ్రై ఫ్రూట్స్.. ఇతర పదార్థాలు పెడుతుంటారు.
రక్తహీనత.. ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడే అమ్మాయిలకు ఫ్యాట్ ఫార్మ్స్ ఎంతగానో ఉపయోగపడతాయని ఇక్కడి వారు చెబుతుంటారు. శారీరక సౌష్టవాన్ని కలిగి ఉండడం ద్వారా ఆడపిల్లలు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారని.. తద్వారా వ్యాధులకు దూరంగా ఉంటారని ఇక్కడివారు చెబుతుంటారు.
