Marriage: వెనుకటి కాలంలో ముఖ్యంగా పెళ్లి ఘట్టంలో అటు వధువు, ఇటు వరుడు పెద్దలు చెప్పినట్టుగా వినేవారు. ఒకవేళ తమకు అసౌకర్యంగా అనిపించినప్పటికీ.. ఇబ్బందికరమైన వాతావరణం ఎదురైనప్పటికీ సర్దుకునే వారు. ఒకరికి ఒకరు సర్ది చెప్పుకునేవారు. అందువల్లే పెద్దలు కుదిర్చిన వివాహాలు నేటికీ బలంగా ఉన్నాయి.
ప్రస్తుత కాలంలో మాత్రం అలాంటి పరిస్థితి లేదు. పెద్దలు కుదిర్చిన వివాహాల స్థానంలో ప్రేమ వివాహాలు జరుగుతున్నాయి. పోనీ అవి ఏమైనా కలకాలం నిలబడుతున్నాయా? అంటే అదీ లేదు. నేటి తరంలో యువతకు ఓపిక ఉండడం లేదు. సహనం ఉండడం లేదు. ఎదుటి వాళ్ల మీద జాలి, దయ, కరుణ వంటివి ఉండడం లేదు.. ఎంత వేగంగా అయితే కలుస్తున్నారో.. అంతే వేగంగా విడిపోతున్నారు. ఇక కొన్ని సందర్భాల్లో అయితే పెళ్లికాకముందే వధూవరుల మధ్య బేధాభిప్రాయాలు ఏర్పడి విడిపోతున్నారు. అలాంటి సంఘటనే ఇది. ఈ సంఘటనలో వధువు తీసుకున్న నిర్ణయంతో బంధువులు మొత్తం ఒకసారిగా షాక్ కు గురయ్యారు. ఈ ఉదాంతం ఢిల్లీకి దగ్గరలో ఉన్న ఆగ్రాలో చోటుచేసుకుంది.
Read Also: గంటలోపే శ్రీవారి దర్శనం.. ఎలా సాధ్యం చేస్తున్నారంటే?
ఇంతకీ ఏం జరిగిందంటే..
దేశ రాజధానికి దగ్గరలో ఉన్న ఆగ్రాలో వివాహం జరగాల్సి ఉంది. వివాహ నేపథ్యంలో వరుడి కుటుంబం పెళ్లి కుమార్తె, వారి బంధువుల కోసం హోటల్లో గదిని బుక్ చేసింది. వాతావరణం వేడిగా ఉండడం.. ఉక్కపోత తీవ్రంగా ఉండడంతో వధువు తీవ్ర ఇబ్బందికి గురైంది. అంతేకాదు ఆ హోటల్ గదిలో ఏసీ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏసీ సౌకర్యం ఉన్న గదిని బుక్ చేయాలని ఆమె విన్నవించింది. వధువు కోరికను వరుడి తరపు బంధువులు తిరస్కరించారు. ఈ విషయంపై ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.. చినికి చినికి గాలి వాన లాగా మారి వివాదానికి దారి తీసింది. అప్పటిదాకా ఓపిక పట్టిన వరుడు ఒక్కసారిగా అసహనాన్ని కోల్పోయి తన నోటికి పని చెప్పాడు. వధువు, ఆమె బంధువుల మీద దూషణ పర్వానికి దిగాడు.. అతడు ఆ స్థాయిలో తిట్టడంతో తట్టుకోలేకపోయిన వధువు ఒక్కసారిగా తన మనసు మార్చుకుంది. అతడిని పెళ్లి చేసుకునేది లేదని.. అతడిని తన జీవితంలోకి ఆహ్వానించే పరిస్థితి లేదని మొహమాటం లేకుండా చెప్పేసింది. అంతేకాదు అప్పటికప్పుడు వెనక్కి వచ్చేసింది. ఇంకాసేపట్లో వివాహం జరుగుతుంది అనుకుంటుండగా.. ఈ సంఘటన జరగడంతో.. పెళ్లికి వచ్చిన బంధువులు మొత్తం ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అంతేకాదు ఈ వివాదం అంతకంతకు పెరగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. అంతేకాదు వధువుకు వారు నచ్చ చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. అంతేకాదు వరుడిపై వధువు మండిపడింది..” నాకు కనీస అవసరాలు తీర్చలేనివాడు భర్తగా అవసరం లేదు. అలాంటి వ్యక్తిని నా జీవితంలోకి ఆహ్వానిస్తే నరకం చూడాల్సి వస్తుందని” ఆ వధువు పోలీసులతో స్పష్టం చేసింది.. అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోలేనని.. జీవితాంతం ఇబ్బంది పడలేనని తేల్చి చెప్పింది. తన నిర్ణయాన్ని మార్చుకునే ప్రసక్తి లేదని ఘంటాపథంగా చెప్పేసింది.
Read Also: సన్ ఫార్మాలో కీలక మార్పులు.. ఎండీగా కీర్తీ గానోర్కర్.. ఇంతకీ ఎవరు ఈయన ?
” వధువు మనోభావాలు దెబ్బతిన్నట్టు ఉన్నాయి. అందువల్లే ఆమె మేము ఎంతగా చెప్పినా వినిపించుకోలేదు. చివరికి వరుడి కుటుంబం పెళ్లి కోసం చేసిన ఖర్చులను తిరిగి చెల్లించడానికి వధువు కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. చెల్లింపులు కూడా వెంటనే చేసేసారు. దీంతో ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. వచ్చిన బంధువులు కూడా ఇదేంటి ఇలా జరిగిందనుకుంటూ వారి వారి సొంతప్రాంతాలకు వెళ్లిపోయారు.. వరుడు అడ్డగోలుగా మాట్లాడటం వల్లే ఇదంతా జరిగిందని” స్థానిక పోలీసులు మీడియా ప్రతినిధులతో పేర్కొన్నారు.