Animals sleep : ఈ భూమ్మీద ఉన్న ప్రతీ జీవికి కూడా నిద్ర అనేది తప్పనిసరి. ఏ జీవి అయిన ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా నిద్రపోవాలి. సాధారణంగా అందరూ కూడా నిద్రపోయేటప్పుడు పడుకుంటారు. కానీ కొన్ని జంతువులు మాత్రం నిలబడి నిద్రపోతుంటాయి. సరైన ప్లేస్‌లో కంఫర్ట్‌గా నిద్రపోతేనే పడుకున్న ఫీలింగ్ ఉంటుంది. లేకపోతే నీరసం, అలసటగా అనిపిస్తుంది. ఇది కేవలం మనుషులకే కాకుండా అన్ని జీవులకు కూడా అనిపిస్తుంది. ఎంత ప్రశాంతంగా నిద్రపోతే ఏ జీవి అయినా ఎక్కువ ఏళ్లు జీవిస్తుంది. లేకపోతే జంతువులకు కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి. సాధారణంగా మనుషులు అయితే కంఫర్ట్‌గా పడుకుని నిద్రపోతేనే పడుతుంది. దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. లేకపోతే తప్పకుండా అనారోగ్య సమస్యలు బారిన పడతారు. మరి ఇదంతా పక్కన పెడితే అసలు నిలబడి నిద్రించే జంతువులు కూడా ఉన్నాయా? అసలు ఆ జంతువులు ఏవి? అసలు ఇవి నిలబడి ఎలా నిద్రపోతాయి? దీనికి గల కారణాలు ఏంటి? పూర్తి వివరాలు కూడా తెలుసుకోవాలంటే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.
గుర్రాలు
గుర్రాలు ఎక్కువగా నిలబడి నిద్రపోతాయి. ఎందుకంటే ఇవి ఇతరుల నుంచి తమని తాము రక్షించుకోవడానికి నిలబడి నిద్రపోతాయి. సడెన్‌గా ఏదైనా జరిగితే వెంటనే పారిపోవచ్చనే ఉద్దేశంతో గుర్రాలు ఎక్కువగా నిల్చోని నిద్రపోతాయి. కొన్నిసార్లు గుర్రాలు బాగా అలసిపోతాయి. దీంతో అవి కీళ్లను లాక్ చేయడానికి నిలబడి నిద్రిస్తాయి. వీటిలానే ఆవులు కూడా నిలబడి నిద్రిస్తాయి. అయితే గుర్రాల వలె ఇవి గాఢంగా నిద్రపోవు.
ఫ్లెమింగోలు
ఇవి ఎల్లప్పుడూ కూడా నిలబడి నిద్రస్తాయి. శరీర వేడిని, శక్తిని ఆదా చేయడానికి ఫ్లెమింగోలు ఎక్కువగా ఒంటికాళ్ల మీద నిద్రిస్తాయి. నిజానికి ఒంటి కాళ్ల మీద నిల్చోవడమే కష్టం. అలాంటిది ఇవి ఒంటి కాళ్ల మీద నిద్రపోతాయి.
జిరాఫీలు
జిరాఫీలు ఎక్కువగా నిలబడి నిద్రిస్తాయి. ఎందుకంటే వీటి ఎత్తు వల్ల చాలా ఇబ్బంది పడతాయి. దీంతో జిరాఫీలు ఎక్కువగా నిల్చోని నిద్రపోతాయి. ఇలా నిలబడి పడుకోవడం వల్ల వాటికి గాఢంగా నిద్రపడుతుందట. ఈ కారణం వల్ల జిరాఫీలు పడుకుని కాకుండా నిల్చోని నిద్రపోతాయి. దీనివల్ల వాటికి తక్కువ సమయం నిద్రపోయినా కూడా ఎక్కువ సమయం నిద్రపోయినా ఫీలింగ్ వాటికి వస్తుందట.
ఏనుగులు
ఏనుగులు కూడా నిల్చోని నిద్రపోతాయి. నిజం చెప్పాలంటే ఇవి నిలబడి నిద్రపోవడం వీటికి సాధారణ విషయమే. సాధారణంగా కంటే నిలబడి నిద్రపోవడం వల్ల గాఢంగా నిద్ర పడుతుందని జంతవులు ఇలా చేస్తాయట.
కంగారులు
కంగారులు సపోర్ట్ కోసం నిల్చోని నిద్రపోతాయి. ఇలా నిద్రపోవడం వల్ల వాటి కండరాలు బలంగా ఉంటాయట. అందుకే ఎక్కువగా కంగారులు నిలబడి నిద్రపోతాయి. ఇవే కాకుండా గొర్రెలు, మేకలు, ఖడ్గమృగాలు కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో నిలబడి నిద్రపోతాయట.