spot_img
Homeబిజినెస్Kishore Odisa Entrepreneur Success Story: ఇతడి ఆలోచన అదుర్స్.. రోజు నాలుగు గంటల కష్టం.....

Kishore Odisa Entrepreneur Success Story: ఇతడి ఆలోచన అదుర్స్.. రోజు నాలుగు గంటల కష్టం.. నెలకు 30 లక్షల ఆదాయం..

Kishore Odisa Entrepreneur Success Story: వివేకం రావాలంటే చదువుకోవాలి. ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే కష్టపడాలి. పదిమందికి ఉపాధి కల్పించాలంటే వ్యాపారం చేయాలి. ఈ మూడిట్లో అతడు మూడవ దానిని ఎంచుకున్నాడు. అతడికి పెద్దగా చదువు రాదు. ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే కావలసిన ఆర్థిక స్థిరత్వం అతడికి లేదు. అతడికి ఉన్నది కేవలం వ్యాపారం చేసే ఆలోచన మాత్రమే. కాకపోతే దాన్ని తనకు అనుకూలమైన విధానంలో చేయడం మొదలుపెట్టాడు. చివరికి విజయవంతమయ్యాడు. ఒకప్పుడు ఒక సాధారణ వ్యక్తిగా ఉన్న అతడు.. ఈరోజు 10 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. తను కూడా
దండిగా సంపాదిస్తున్నాడు.

Also Read: 15 రోజుల్లో 1500 కోట్లు కొల్లగొట్టిన ‘ధురంధర్ 2’.. ఇక మిగిలిన రికార్డు టార్గెట్స్ ఇవే..

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత రకరకాల వీడియోలు తెరపైకి వస్తున్నాయి. అందులో కొన్ని వీడియోలు స్ఫూర్తి నింపే విధంగా ఉన్నాయి. అటువంటిదే ఇది కూడా. స్ఫూర్తి నింపే వీడియోలో జాబితాలో ఇది మొదటి వరుసలో ఉంటుంది.

అతని పేరు కిషోర్. ఉండేది ఒడిశాలో. పెద్దగా చదువుకోలేదు. కాకపోతే వ్యాపారం చేయాలని మొదటి నుంచి అతడికి బలమైన కోరిక. మొదట్లో చిన్న చిన్న పనులు చేసేవాడు. ఆ తర్వాత హోటల్ వ్యాపారాన్ని చిన్నగా మొదలుపెట్టాడు. దానిని అంతకంతకు విస్తరించాడు. చివరికి తన హోటల్లో మటన్ మీల్స్ ను ప్రారంభించాడు. మొదట్లో అంతగా గిరాకీ ఉండేది కాదు. ఆ తర్వాత కొంతకాలానికి మటన్ మీల్స్ తినడానికి చాలామంది రావడం మొదలుపెట్టారు. అలా అతడు ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు.

ప్రారంభంలో ఐదు కిలోల వరకే మటన్ వండేవాడు. ఇప్పుడు అది 200 కిలోలకు చేరుకుంది.. ప్రతిరోజు దాదాపు వెయ్యి మంది వరకు అతని హోటల్లో భోజనం చేస్తూ ఉంటారు. ప్లేట్ మటన్ మీల్స్ వచ్చేసి 100 నుంచి 150 వరకు తీసుకుంటాడు. కట్టెలపై మీద వంటలు వండుతాడు. కేవలం మటన్ మిల్స్ మాత్రమే కాకుండా.. వెజ్ మిల్స్ కూడా అతడి దగ్గర అందుబాటులో ఉంటుంది. మటన్ మీల్స్ ద్వారా అతడు రోజు లక్ష రూపాయల వరకు సంపాదిస్తాడు. వెజ్ మీల్స్ కూడా కలుపుకుంటే 1,50,000 వరకు వస్తుంది. ప్రతిరోజు అతని హోటల్ కేవలం నాలుగు గంటల వరకు మాత్రమే సాగుతుంది. మధ్యాహ్నం 12:30 కు మొదలై మూడున్నర గంటల వరకు పూర్తవుతుంది. ఈ నాలుగు గంటల సమయంలోనే తినేవాళ్లు తింటారు. మిగతావాళ్లు పార్సిల్ తీసుకెళ్తారు. తినేవాళ్ళకంటే పార్సల్ తీసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.

అతని హోటల్లో దాదాపు పది మంది వరకు పనిచేస్తారు. పండుగల సమయంలో మాత్రమే ఆ హోటల్ మూసి ఉంటుంది. మిగతా కాలంలో తెరిచి ఉంటుంది. అందువల్లే అక్కడ విపరీతమైన గిరాకీ ఉంటుంది. పైగా మటన్ నాణ్యత విషయంలో అతడు ఏమాత్రం రాజీపడడు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి నాణ్యమైన గొర్రెపోతులను తీసుకొచ్చి.. వాటి ఆరోగ్యాన్ని పశుసంవర్ధక శాఖ అధికారుల సమక్షంలో పరిశీలించి.. అన్ని ఓకే అయిన తర్వాతనే వధిస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో బయటి వ్యాపారుల వద్ద మటన్ కొనుగోలు చేయడు. అందువల్లే అతడి వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version