Karnataka Shivamogga Jail: అది కర్ణాటక రాష్ట్రం.. శివ మొగ్గలోని కేంద్ర కారాగారం. అక్కడ జైలులో దౌలాత్ ఖాన్ అలియాస్ గుండ అనే ఖైదీ శిక్ష అనుభవిస్తున్నాడు. ఇటీవల అతడు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డాడు.. దీంతో జైలు అధికారులు అతడిని ఆసుపత్రికి తరలించారు. నొప్పి తీవ్రంగా ఉందని అతడు చెప్పడంతో వైద్యులు ఎక్స్ రే తీశారు. దీంతో వారికి దిమ్మ తిరిగిపోయింది..
గుండ అనేక నేరాలకు పాల్పడ్డాడు. నేర నిరూపణలో పోలీసులు విజయవంతం అవడంతో అతడు జైలుకు వెళ్లక తప్పలేదు. ప్రస్తుతం కొద్దిరోజులుగా గుండ అక్కడ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే ఇటీవల అతడు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డాడు. దీంతో జైలు అధికారులు అతడికి అక్కడ ఉన్న వైద్యుల ద్వారా ప్రాథమిక చికిత్స అందించారు. అయినప్పటికీ అతడు నొప్పి తగ్గలేదని చెప్పడంతో స్థానికంగా ఉన్న వేరే ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీంతో అక్కడి వైద్యులు అతనికి చికిత్స అందించారు. నొప్పి తగ్గలేదని చెప్పడంతో ఎక్స్ రే తీశారు. అతడి కడుపులో ఫోన్ ఉండడాన్ని వైద్యులు చూశారు. వెంటనే అతడికి శస్త్ర చికిత్స చేశారు. అతడి కడుపులో ఉన్న ఫోన్ బయటకు తీశారు.. అతడు కడుపునొప్పితో బాధపడుతుంటే లోపల ఏదైనా కణితి లాంటిది ఏమైనా ఉందేమోనని జైలు అధికారులు అనుమానించారు. వైద్యులు కూడా ఆదే అభిప్రాయానికి వచ్చారు. కానీ అతడి కడుపులో సెల్ ఫోన్ ఉండడాన్ని చూసి వైద్యులు ఒక్కసారి గా షాక్ కు గురయ్యారు.
శివమొగ్గ జైలు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంటుంది. అయితే అటువంటి జైలులో గుండ ఫోన్ మాట్లాడి ఉంటాడని.. అందువల్లే జైలు అధికారులు వచ్చినప్పుడు అతడు భయంతో ఫోన్ మింగి ఉంటాడని తెలుస్తోంది. అయితే అతడికి ఫోన్ ఎవరు ఇచ్చారు? ఏం మార్గంలో ఇచ్చారు? అతడు ఎవరితో మాట్లాడుతున్నాడు? అతడి ఫోన్ నెంబర్ ఆధారంగా కాల్ డాటాను పోలీసులు పరిశీలిస్తున్నారు.. ఎందుకంటే గుండ వయసు 30 సంవత్సరాలు మాత్రమే అయినప్పటికీ.. అతనిపై తీవ్రమైన నేరాలు నమోదయ్యాయి. ఆ అభియోగాలను నిరూపణ చేయడంలో పోలీసులు విజయవంతమయ్యారు. తద్వారా అతడికి న్యాయమూర్తి జైలు శిక్ష విధించారు.
గుండ జైలులో దొంగ చాటుగా ఫోన్ వాడుతున్నాడని పోలీసుల విచారణలో తోటి ఖైదీలు తెలిపినట్టు కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి.. గుండకు ఫోన్ అందించడంలో స్థానికంగా ఉన్న జైలు అధికారులు కూడా తన వంతు సహకారం అందించి ఉండవచ్చని ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. గుండ ఉన్న సెల్ ను పర్యవేక్షక అధికారులను జైలు ఉన్నతాధికారులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. అయితే దీనిపై పూర్తి వివరాలు రావడానికి మరి కొంత సమయం పట్టి అవకాశం ఉందని తెలుస్తోంది. ఏరియమైనప్పటికీ ఈ ఘటన శివమొగ్గ జైలులో లోపాలు ఉన్నాయని.. జైలు సిబ్బంది ఖైదీలకు ఫోన్లు అందిస్తున్నారని వెలుగులోకి వచ్చింది. మరి దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.