Sahara Desert: చుట్టూ విస్తారంగా ఇసుక.. కనుచూపుమేరలో కనిపించని పచ్చదనం.. ఉదయం 5 గంటలకే సూర్యోదయం.. సాయంత్రం 6 గంటలకు సూర్యాస్తమయం.. మాడు పగిలే విధంగా ఎండ.. అడుగు తీసి అడుగు వేయలేనంత వేడి.. భరించలేని ఉక్క పోత.. అలాంటి చోట నీటి జాడ కనిపిస్తే.. పచ్చటి వృక్షాలు అగుపిస్తే.. దాన్నే ఒయాసిస్ అంటారు. ఇంతకీ అది ఎలా ఏర్పడుతుందంటే.. సహారా ఎడారిలో ఒయాసిస్ లు ఎలా ఉంటాయంటే..
Also Read: మాజీ డిజిపికి అరుదైన చాన్స్.. ఎంతో నమ్మకంతో రెండు పదవులు ఇచ్చిన చంద్రబాబు!*
స్వచ్ఛమైన నీరు.. పక్కనే ఖర్జూర వృక్షాలు.. కొన్ని పూతతో.. ఇంకొన్ని కాతతో… ఆకట్టుకుంటాయి.. ఆ నీరు తాగితే ఎంతో ఉత్తేజం వస్తుంది. ఉల్లాసం కలుగుతుంది. శరీరానికి సత్తువను కలిగిస్తుంది. సాధారణంగా సహారా లాంటి ఎడారుల్లో ఎప్పుడో కానీ వర్షం కురవదు.. ఒకవేళ కురిసినా అది ఇసుక తుఫాన్ అయి ఉంటుంది. ఇసుక తుఫాన్ వల్ల వర్షపాతం తక్కువగా నమోదు అవుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో వర్షాపాతం అధికంగా నమోదవుతుంది. ఆ సమయంలో ఎడారిలో లోతట్టు ప్రాంతంలో నీరు చేరుతుంది. అది కాస్త ఒయాసిస్ గా మారుతుంది. ఎడారిలో చోటుచేసుకునే మార్పుల వల్ల ఆ నీరు అనేది ఇంకదు. ఒయాసిస్ పరిసర ప్రాంతాల్లో ఖర్జూర వృక్షాలు విస్తారంగా పెరుగుతాయి. లిబియాలోని సహారా ఎడారిలో ఇటువంటి ఒయాసిస్ లు ఎక్కువ కనిపిస్తుంటాయి. పర్యటకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. సహారా ఎడారి ప్రాంతంలో ఎండ ఎక్కువగా ఉంటుంది. వాతావరణ పొడిగా ఉంటుంది. అయితే ఒయాసిస్ ల వల్ల పచ్చదనం దర్శనమిస్తుంది.. ఒయాసిస్ పరిసర ప్రాంతాల్లో పెరిగే ఖర్జూర చెట్ల ఫలాలు ఎంత రుచికరంగా ఉంటాయి.. లిబియాలో ఉన్న ఓయాసిస్ లలో గాదా మెస్, కుఫ్రా, అవ్జిలా అత్యంత ప్రముఖమైనవి. ఇవి వాణిజ్య మార్గాలలో కీలకమైన విరామ స్థలాలుగా ఉన్నాయి.
నీరు ఇంకదు
ఒయాసిస్ లో నీరు అసలు ఇంకదు. వర్షాలు కురిసినప్పుడు.. వీటిల్లో నీటి లభ్యత పెరుగుతుంది. సహజంగానే ఇసుకకు శుద్ధి చేసే గుణం ఉంటుంది. అందువల్ల ఒయాసిస్ లలో నీరు స్వచ్ఛంగా ఉంటుంది. నాచు, ఇతర నీటి ఫ్లవకాలు పెరిగే అవకాశం లేనందువల్ల నీరు ఎప్పుడు చూసినా శుభ్రంగా ఉంటుంది. ఒయాసిస్ పరిసర ప్రాంతాల్లో ఖర్జూర చెట్లు పెరుగుతాయి కాబట్టి.. వీటి ఫలాలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. మార్కెట్లో ఒయాసిస్ డేట్స్ ను అత్యంత ఖరీదుకు అమ్ముతుంటారు.. అయితే లిబియా ప్రాంతంలో విస్తరించిన సహారా ఎడారిలో ఒయాసిస్ లు ఎక్కువగా ఉన్నాయి. అందువల్లే పర్యాటకులు ఈ ప్రాంతానికి ఎక్కువగా వస్తుంటారు.. ఒయాసిస్ ప్రాంతాల్లో ఉన్న నీటిని వాణిజ్యపరంగా అమ్మడానికి గతంలో ప్రణాళికలు రూపొందించినప్పటికీ.. తర్వాత ఎందుకనో విరమించుకున్నారు. అయినప్పటికీ ఒయాసిస్ ప్రాంతాలు టూరిస్ట్ ప్రాంతాలుగా వెలుగొందుతున్నాయి. అన్నట్టు కొన్ని ప్రాంతాలలో ఒయాసిస్ లు అత్యంత లోతుగా ఉంటాయి. ఇందులో అదే స్థాయిలో నీరు నిల్వ ఉంటుంది. మొక్కలు కూడా విస్తారంగా ఉంటాయి. వీటి పరిసర ప్రాంతాల్లోనే మరికొన్ని మొక్కలు దర్శనమిస్తుంటాయి.