Tara River: ఒక ప్రాంత అభివృద్ధికి.. ఒక సంస్కృతి విలసిల్లడానికి ప్రధాన కారణం నదులే. సింధూ నది ఉన్నచోట హరప్పా సంస్కృతి విస్తరించింది. ప్రస్తుత కాలంలో నదులు ఉన్నచోట నగరాలు నిర్మితమయ్యాయి. పట్టణాలు విస్తరిస్తున్నాయి. అందుకే మనిషి అభివృద్ధికి.. నాగరికత విస్తరణకు నీళ్ళే మూలం. ఒక మాటలో చెప్పాలంటే నీళ్లే జగతికి ఆధారం.
ఈ భూమి మీద ఎన్నో నదులు ఉన్నాయి. వాటి ఆధారంగా ఎన్నో నగరాలు నిర్మితమయ్యాయి. మరెన్నో పట్టణాలు విస్తరించాయి. ఒక్కో నదికి ఒక్కో విధమైన చరిత్ర ఉంటుంది. దానికి ఘనమైన నేపథ్యం ఉంటుంది. కాలక్రమంలో కొన్ని నదులు కాలగర్భంలో కలిసిపోగా.. మరికొన్ని నదులు కాలుష్య కాసారాలుగా మారిపోయాయి. కొన్ని నదులు మాత్రం నేటికీ స్వచ్ఛంగానే ఉన్నాయి.. అలా స్వచ్చంగా ఉన్న నదుల్లో తారా నది ఒకటి. తారా నది యూరప్ లో ప్రముఖంగా ఉంది. ఇది అత్యంత లోతైన నదిగా పేరుపొందింది..ఇది మాంటి నెగ్రో లో ప్రవహిస్తుంది. దీని లోతు దాదాపు 1300 మీటర్ల వరకు ఉంటుంది. ఈ నది యూరప్ లోని దుర్మిటర్ నేషనల్ పార్క్ లో భాగంగా ఉంది.. ఐక్యరాజ్యసమితి ఈ నదిని ప్రపంచ వారసత్వ సంపదగా పేర్కొంది. తారా నదిలో నీరు స్పటికమైన స్పష్టంగా ఉంటుంది. ఈ నది రాఫ్టింగ్ కు అత్యంత అనుకూలంగా ఉంటుంది. తారా అదిని యూరప్ కన్నీటి బొట్టుగా పేర్కొంటారు. ఎందుకంటే ఇందులో నీరు అత్యంత స్వచ్ఛంగా ఉంటుంది.. దీనిని యూరప్ ప్రజలు నేరుగా తాగుతుంటారు. చుట్టుపక్కల ఉన్న హరితవనాలు, నేలలు, సంవత్సరంలో సుదీర్ఘకాలం కురిసే వర్షం వల్ల ఈ నది విస్తృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. మీరు కూడా అత్యంత స్వచ్ఛంగా కనిపిస్తూ ఉంటుంది. పర్యాటకులు ఈ నది నీటిని తాగడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తుంటారు.
అరుదైన జీవజాతులకు నిలయం
తారా నది లో అరుదైన జీవజాతులు ఉంటాయి. ఈ నదిలో పెరిగే చేపల్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అవి క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తాయి. అందువల్లే ఈ చేపలను పర్యటకులు ఇష్టంగా తింటూ ఉంటారు. చేపలు మాత్రమే కాకుండా, రొయ్యలు, ఆలు చిప్పలు, పీతలు వంటివి కూడా ఈ నదిలో ఎక్కువగా కనిపిస్తుంటాయి.. సంవత్సరం మొత్తం ఈ నదిలో చేపల వేట సాగుతుంది. కాకపోతే మన ప్రాంతంలో మాదిరిగా కాకుండా.. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు చేపలు పట్టుకుంటారు. ఇక్కడి రొయ్యలు కూడా చాలా రుచిగా ఉంటాయి. ఈ నదిలో నీటికి ఔషధ గుణాలు ఉంటాయని.. అవి వివిధ రోగాలను తగ్గిస్తాయని యూరప్ ప్రజలు నమ్ముతుంటారు. యూరప్ లోని వివిధ ప్రాంతాలకు చెందినవారు తారా నదిలో నీటిని తీసుకెళ్తుంటారు.. అయితే ఈ నదికి చుట్టుపక్కల ఎటువంటి పరిశ్రమలు లేవు. పర్యావరణ కాలుష్యం కూడా లేదు. హరితవనాలు ఎటువంటి క్షయానికి గురి కాలేదు. అందువల్లే ఈ నది ఇంకా అలానే ఉంది. ఇందులోని నీరు స్వచ్ఛంగా ఉంది. అందువల్లే ఈ నది నీటిని యూరప్ కన్నీటి బొట్టు అంటారు. మన కన్నీటిలో ఎటువంటి కల్తి ఉండదు. కల్తీ చేయడానికి ఆస్కారం కూడా ఉండదు. తారా నది కూడా అలాంటిదే. అందువల్లే దానిని యూరప్ కన్నీటి బొట్టు అని పిలుస్తుంటారు.. అయితే ఈ నది చుట్టూ ఎటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా గతంలోనే చట్టాలు రూపొందించారు. అందువల్లే ఈ నది ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది.