Homeబిజినెస్REALME P3 PRO 5G: రంగులు మార్చే రియల్‌మీ P3 ప్రో.. భారత్‌ మార్కెట్‌లో ఇలాంటి...

REALME P3 PRO 5G: రంగులు మార్చే రియల్‌మీ P3 ప్రో.. భారత్‌ మార్కెట్‌లో ఇలాంటి ఫోన్‌ ఫస్ట్‌ అంట!

REALME P3 PRO 5G: దేశీయ మార్కెట్‌లోకి రియల్‌మీ సంస్థ కిర్రాక్‌ స్మార్ట్‌ ఫోన్‌ రాబోతోంది. పవర్‌ ఫుల్‌ ప్రాసెసర్‌తో దీనిని తయారు చేశారట. కంపెనీ తన ్క లైనప్‌ స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ను భారత్‌లో విస్తరించేందుకు యత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఈ సిరీస్‌లోని ఒక మోడల్‌ ’రియల్‌మీ P3 ప్రో 5ఎ’ అనే స్మార్ట్‌ఫోన్‌ విడుదల చేయబోతోంది. ఈ ఫోన్‌పై కొన్ని వారాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈక్రమంలో ఫోన్‌ ప్రాంరభ తేదీని సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి 18న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభిస్తామని ప్రకటించింది. ఈ ఫోన్‌ రియల్‌మీ ్క సిరీస్‌లో మొదటి మోడల్‌. దీంతో పాటు కంపెనీ ఈ సిరీస్‌లో రియల్‌మీ P3 5ఏ, రియల్‌మీ P3 అల్ట్రా అనేడ మోడళ్లను కూడా ప్రారంభించే అవకాశం ఉంది.

పవర్‌ఫుల్‌ ప్రాసెసర్‌..
రియల్‌మీ సంస్థ వీటిలో ప్రాసెసర్‌ కోసం పవర్‌ఫుల్‌ స్నాప్‌డ్రాగన్‌ 7s Gen 3 చిప్‌సెట్‌ను ఉపయోగించిందట. ఈ సెగ్మెంట్‌లో TSMC ప్రాసెస్‌ ఆధారంగా 4nm చిప్‌సెట్‌తో వస్తున్న మొట్ట మొదటి స్మార్ట్‌ఫోన్‌ ఇదే అని కంపెనీ చెబుతోంది. ఇది ప్రీమియస్‌ వెర్షన్‌ చిప్‌సెట్‌తో పోలిస్తే 20 శాతం మెరుగైన CPU అండ్‌ 40% మెరుగైన GPU పనితీరును అందిస్తుందని ఉంటుంది. GT బూస్ట్‌ టెక్నాలజీని ఇందులో ఉపయోగించారు. ఇది అఐ అల్ట్రా స్టిప్‌ ఫ్రేమ్స్, హైపర్‌ రెస్పాన్స్‌ ఇంజిన్, అఐ అల్ట్రా టచ్‌ కంట్రోల్‌ అండ్‌ ఏఐ మోషన్‌ కంట్రోల్‌ ఫీచర్లను అందిస్తుంది.

బడ్జెట్‌ ధరలోనే..
కంపెనీ ఈ ఫోన్‌ను బడ్జెట్‌ ధరలోనే తీసుకువస్తుంది. ఇక స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ’రియల్‌మీ P3 ప్రో 5ఎ’ క్వాడ్‌–కవర్డ్‌ ఎడ్జ్‌ఫ్లో డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది ఈ ధర రేంజ్‌ ఫోన్‌లో మొదటిసారి కనిపించనుంది. అంతేకాక ఈ ఫోన్‌లో ఏరోస్పేస్‌ వీసీ కూలింగ్‌ సిస్టమ్‌ కూడా అందించనున్నారు. వీటితోపాటు ఈ ఫోన్‌ 6000mAh బ్యాటరీతో వస్తుందని తెలుస్తోంది. ఇది 80w ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో రావచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌లో రిలీజ్‌..
ఈ ఫోన్‌ మైక్రోసైట్‌ ప్రముఖ ఈకామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో రిలీజ్‌ అయింది. దీనిలో ఫోన్‌ గ్రీన్‌ కలర్‌ వేరియంట్‌ కన్పిస్తుంది. ఈ ఫోన్‌ మధ్యలో సెల్ఫీ కోసం పంచ్‌–హోల్‌ కటౌట్‌ ఉంటుంది. కుడి వైపున వాల్యూమ్‌ రాకర్‌ అండ్‌ పవర్‌ బటన్‌ కన్పిస్తాయి. టైప్‌–సీ పోర్ట్, స్పీకర్‌ వెంట్స్, సిమ్‌ ట్రే స్లాట్‌ ఫోన్‌ దిగువన ఉంటాయి. వీటితో పాటు ఈ ఫోన్‌లో పెద్ద కెమెరా మాడ్యూల్‌ ఉంటుందని, దీని మెయిన్‌ కెమెరా 50MP OI సపోర్ట్‌తో రావచ్చని ఫోన్‌ లీక్డ్‌ లైవ్‌ ఇమేజ్‌ ద్వారా వెల్లడైంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular