History repeats itself in calendar: ఈ ఏడాదిలో ఆగస్టుకు( August month ) ఎంతో ప్రాధాన్యం ఉంది. సహజంగానే ఆగస్టు అంటే స్వాతంత్ర దినోత్సవం ఉంటుంది. అయితే ఈ ఏడాది ఇదే నెలలో వినాయక చవితి, శ్రావణ మాసం, రక్షాబంధన్, శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి శుభదినాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మరో అరుదైన గుర్తింపున సాధించింది ఈ ఆగస్టు. 1947 ఆగస్టు క్యాలెండర్ లో ఉన్న తేదీలు, వారాలు ప్రస్తుతం 2025 ఆగస్టు మాసంలోని తేదీలు, వారాలు ఒకేలా ఉండటం చెప్పుకోదగ్గ విషయం.
భారతీయుడి గుండెచప్పుడు..
1947 అంటే ప్రతి భారతీయుడికి గుర్తుండిపోతుంది. అందునా ఆగస్టు అంటే శతాబ్దాల ఎదురుచూపుల తర్వాత ఈ నెలకు స్వతంత్రం( independence) వచ్చింది. పరాధీనం నుంచి సంకెళ్లను తెంపుకొని స్వాతంత్రం సిద్ధించింది. 1947 ఆగస్టు 15న సరికొత్త స్వేచ్ఛ ఆయువుతో బయటపడింది ఈ దేశం. అందుకే 1947 ఆగస్టు అంటే ప్రతి భారతీయుడు గుండెచప్పుడుగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు అదే ఏడాది.. అదే నెల సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రాచుర్యం పొందుతోంది.
Also Read: 24 గంటల్లో అంతటి వాన.. ముంబైలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే..
79 సంవత్సరాల తర్వాత..
నిన్ననే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నాం. ఈ నేపథ్యంలో శుభాకాంక్షలు, అభినందనలు పెద్ద ఎత్తున చెప్పుకున్నాం. ఈ పరిస్థితుల్లోనే 1947 ఆగస్టు నెలతో ఉన్న వారాలు, తేదీలను సరిపోల్చుతూ.. ప్రస్తుత ఆగస్టు నెలకు సంబంధించిన తేదీలు, వారాలు ఒకేలా ఉండడాన్ని చూపిస్తూ సోషల్ మీడియాలో( social media) ప్రచారం చేస్తున్నారు. ప్రజలు అప్పటి క్యాలెండర్ ను.. ప్రస్తుత క్యాలెండర్ చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. నెల మొత్తం వారాలు, తేదీలు ఒకేలా ఉండగా.. 79 సంవత్సరాల తర్వాత ఒకేలా ఉండడం సోషల్ మీడియాలో చర్చకు కారణం అవుతోంది.