History of Kolmanskop: ఒకప్పుడు ఆ నగరం అత్యంత అందమైనది. ప్రపంచంలోనే అతిపెద్దది. అందంలో, విస్తీర్ణంలోనే కాదు.. సంపదలోనూ అత్యంత ప్రాచుర్యాన్ని పొందింది. ఆ నగరం పేరు కాల్మన్ స్కోప్. ఇది నమీబ్ ఎడారిలో ఉండేది.. ఎడారిలో ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో వజ్రాలు, రత్నాలు విరివిగా లభించేవి. వీటిని వెలికి తీయడానికి గనులను తవ్వే వారు.
1900 కాలంలోనే ఈ ప్రాంతంలో వజ్రాలను వెలికితీయడానికి జర్మనీ.. ఇతర దేశాల నుంచి అధిక సంఖ్యలో వర్తకులు వచ్చారు. ఇక్కడ స్థిరపడ్డారు. ఎడారి ప్రాంతమైనప్పటికీ.. భారీ ఖర్చుకు కూడా వెనకాడకుండా ఇక్కడ నీటివసతులు కల్పించుకున్నారు . భారీగా భగవంతుడు నిర్మించుకున్నారు. పార్కులు, థియేటర్లు ఎడారి ప్రాంతాన్ని భూతల స్వర్గం లాగా మార్చుకున్నారు. వజ్రాలు, రత్నాలు లభిస్తున్న నేపథ్యంలో కాల్మన్ స్కోప్ విలాసవంతమైన నగరంగా మారిపోయింది. జర్మన్ సంస్కృతి ఇక్కడ కనిపించేది. జర్మన్ దేశస్తులు ఇక్కడ అతి భారీ భవనాలు నిర్మించుకున్నారు. ఎడారిలో ఉన్నప్పటికీ జర్మన్ దేశస్థులు అత్యంత విలాసవంతమైన భవనాలను నిర్మించుకున్నారు.. వజ్రాలను వెలికి తీయడం ద్వారా వచ్చే డబ్బుతో అత్యంత విలాసవంతమైన సౌకర్యాలను వారు అనుభవించేవారు.
ఎంత గను లైతే మాత్రం.. ఎల్లకాలం వజ్రాలు లభించవు. రత్నాలు దొరకవు. కొంతకాలానికి అవి నిండుకున్నాయి. దీంతో ఆ ప్రాంతం తన అందాన్ని కోల్పోయింది. 1950 నాటికి ఈ నగరాన్ని దాదాపు అందరూ ఖాళీ చేశారు. దీంతో ఒకప్పుడు ఎంతో గొప్ప చరిత్ర ఉన్న ఈ నగరం.. ఆ తర్వాత మసకబారడం మొదలుపెట్టింది. అప్పటిదాకా అక్కడ ఉన్నవారు మొత్తం వెళ్లిపోవడంతో ఆ ప్రాంతం మొత్తం నిర్మానుషంగా మారిపోయింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే దయ్యాల నగరంగా రూపొందింది.. ఎడారి మొత్తం చదును చేసే నిర్మించిన ఆ నగరం మొత్తం ఎడారిలో కలిసిపోయింది. భయంకరమైన ఇసుక తుఫానులు ఆ నగరాన్ని మొత్తం ముంచేశాయి. ఒకప్పటి భవనాలలో భారీగా ఇసుక దర్శనమిస్తోంది. ప్రకృతిని విధ్వంసం చేయకుండా ఉంచితే బాగుంటుంది. ప్రకృతిని గతి తప్పిస్తే చివరికి దానిని తిరిగి పొందుతుంది. దానికి ఉదాహరణే ఈ నగరం.
Also Read: మన ఇండియాలో మరో గోవా..
ప్రస్తుతం దేశ ప్రధాన నరేంద్ర మోడీ నమిబియాలో బుధవారం పర్యటించనున్నారు. అక్కడి పార్లమెంట్లో ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో నమీబియా దేశానికి సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అందులో కాల్మనో స్కోప్ నగరం ఒకటి. ఈ నగరానికి సంబంధించిన చరిత్ర మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాల్మనో స్కోప్ నగరంలో వజ్రాలు లభించి ఉంటే.. రత్నాలు విరివిగా లభించి ఉంటే ఆ నగరం పరిస్థితి మరో విధంగా ఉండేది. కానీ అవన్నీ నిండుకున్న తర్వాత ఆ ప్రాంతం మొత్తం తన పూర్వపు రూపును మొత్తం కోల్పోయింది. ప్రధాని నరేంద్ర మోడీ నమిబియాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఈ నగరానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుగులోకి వస్తున్నాయి.. నమీబియా పర్యటన నేపథ్యంలో నరేంద్ర మోడీ కాల్మనో స్కోప్ ప్రాంతాన్ని సందర్శిస్తారని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటనా రాలేదు.