Himachal Pradesh Car Video: అద్భుతమైన రోడ్డు ఉంటే వాహనాలు ఏకంగా ప్రయాణిస్తుంటాయి. రయ్యిన దూసుకుంటూ వెళ్తుంటాయి. అదే రోడ్డు సరిగా లేకపోతే వాహనాలు వెళ్లడానికి ఉండదు. అలాంటిది ఓచోట అసలు రోడ్డు లేదు. గతంలో రోడ్డు ఉండేది కానీ.. ఇటీవలి వర్షాలకు అది కొట్టుకుపోయింది. నామరూపాలు లేకుండా పోయింది. దీంతో వాహనాలు వెళ్లడం కష్టంగా మారింది. ఈ క్రమంలో అక్కడి ప్రజలకు ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది. అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అయి కూర్చుంది.
Also Read: ఆమెను అప్పుడు చూశాను..ఫిక్స్ అయిపోయాను. రింకూ సింగ్ లవ్ స్టోరీ సినిమాను మించిపోయిందిగా!
ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. రోజుల వ్యవధిలోనే అక్కడ మేఘ విస్పోటనం జరిగి రికార్డు స్థాయిలో వర్షం కురుస్తోంది. అసలే కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న ప్రాంతం కావడంతో వర్షాల వల్ల నష్టం విపరీతంగా ఉన్నది. వరద ప్రవాహం దూసుకు రావడంతో రోడ్లు మొత్తం నామరూపాలు లేకుండా పోతున్నాయి. వంతెనలు పేక మేడల మాదిరిగా కూలిపోతున్నాయి. ఇక గృహాలైతే దారుణంగా కొట్టుకుపోతున్నాయి. ఆస్తి నష్టంతోపాటు ప్రాణనష్టం కూడా అక్కడ తీవ్రంగా ఉన్నది. ఈ నేపథ్యంలో అక్కడ రాకపోకలు సాగించడం.. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లడం తీవ్ర ఇబ్బందిగా మారింది. ఇలాంటి చోట ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లడానికి అక్కడ గ్రామస్తులు వినూత్నమైన ఆలోచన చేశారు. వారి ఆలోచనకు అందరూ ఫిదా అవుతున్నారు.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కులు ప్రాంతంలో రోడ్లు మొత్తం ధ్వంసమయ్యాయి. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఒక వాహనాన్ని దాటించడానికి అక్కడి ప్రజలు వినూత్నంగా ఆలోచించారు.. లాగ్వాలి ప్రాంతం వద్ద కేబుల్స్, ఇనుప రాడ్లు ఉపయోగించి ఒక వాహనాన్ని దాటించారు. వాస్తవానికి అమెరికాలో ఆ స్థాయిలో వర్షాలు కురుస్తున్నప్పటికీ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వాహనాన్ని తరలించడానికి తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తోంది. అలాంటిది ఎటువంటి టెక్నాలజీ సహాయం లేకుండానే.. యంత్రాల అవసరం లేకుండానే వాహనాన్ని ఇలా దాటించారు. ఇది ఇండియాకు మాత్రమే సాధ్యమని.. చివరికి కృత్రిమ మేధ కూడా ఇలాంటి సందర్భాల్లో సైలెంట్ కావాల్సిందేనని నెటిజన్లు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో సంచలనం సృష్టిస్తున్నది.
View this post on Instagram