Gucchi Mushroom: అయితే గుచ్చి పుట్టగొడుగులలో ఎలాంటి పోషకాలు ఉంటాయి, అలాగే వాటి ధర ఎంత, ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ శాఖాహారి అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయనకు ముఖ్యంగా పుట్టగొడుగులు అంటే చాలా ఇష్టం. ఆయన వివిధ రకాల పుట్టగొడుగులను ఎంతో ఇష్టంగా సేవిస్తారు. ఆయనకు చాలా ఇష్టమైన పుట్టగొడుగులలో మోరల్ అని పిలవబడే గుచ్చి పుట్టగొడుగులు కూడా ఒకటి. గుచ్చి పుట్టగొడుగులను మిచెలిన్ వంటి ఉన్నత స్థాయి ఉన్న రెస్టారెంట్లలో వడ్డిస్తారు. ఇవి అంటే ప్రధాని మోదీకి చాలా ఇష్టం. వీటి ధర కిలో 30 వేల రూపాయలు ఉంటుంది. అంటే 100 గ్రాములకు 3000 రూపాయలు అన్నమాట. ఇవి ఎక్కువగా మన దేశంలో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఉన్న హిమాలయ పర్వత ప్రాంతాలలో పెరుగుతాయి. వసంతకాలంలో కొంతకాలం పాటు మాత్రమే ఇవి అడవులలో దొరుకుతాయి.
Also Read: ఆపరేషన్ సిందూర్: భారత్‌కు గర్వకారణం, పాక్‌కు షాక్
అయితే మార్కెట్లో వీటి ధర మరియు డిమాండ్ కారణంగా వీటిని చాలామంది పండించడానికి చాలాసార్లు ప్రయత్నించారు. కొంతమంది వీటిని ఇంట్లో పండించడంలో కూడా సక్సెస్ అయ్యారు. కానీ ఇంట్లో పండించిన గుచ్చి పుట్టగొడుగుల నాణ్యత మాత్రం జమ్ము కాశ్మీర్ వంటి ప్రాంతాలలో పండించిన వాటికి సమానంగా లేదు అని చెప్పొచ్చు. వీటిలో అధిక మొత్తంలో పోషకాలు ఉండటం వలన కూడా వీటి ధర చాలా ఎక్కువ అని తెలుస్తుంది. గుచ్చి పుట్టగొడుగులలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్ డి మరియు విటమిన్ బి చాలా పుష్కలంగా ఉంటాయి. గుచ్చి పుట్టగొడుగులు ఎముకలను బలోపేతం చేయడానికి, క్యాన్సర్ నిరోధించడానికి అలాగే రోగనిరోధక శక్తిని పెంచడానికి బాగా సహాయం చేస్తాయి.
ఇవి శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెంచి చెడు కొలెస్ట్రాలను తగ్గించడంలో సహాయం చేస్తారు. అలాగే గుండె జబ్బులను కూడా నివారిస్తాయి. బరువు తగ్గడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి జుట్టు రాలడాన్ని కూడా క్రమంగా తగ్గిస్తాయి. కానీ వీటి అధిక ధర కారణంగా ఇవి అన్నిచోటల అందుబాటులో ఉండవు. అలాగే ఎన్నో పోషకాలు ఉన్న గుచ్చి పుట్టగొడుగులకు మార్కెట్లో డిమాండ్ బాగా ఉంటుంది. ముఖ్యంగా ఇవి జమ్ము కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాలలో పెరుగుతాయి కాబట్టి ఆ ప్రాంతాలలో ఇవి ఎక్కువగా అందుబాటులో ఉంటాయని చెప్పొచ్చు.
Also Read: ఉగ్రవాదానికి భారత్ సమాధానం.. ఒక చిత్ర కథ