Ram Charan Love Letter Story: ‘చిరుత’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ మొదటి సినిమాతోనే తండ్రికి తగ్గ తనయుడుగా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత నుంచి ఆయన చేసిన సినిమాలన్నీ కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ గా నిలవడంతో కమర్షియల్ సినిమాల వైపు ఎక్కువగా అడుగులు వేశాడు. ఇక ఒకానొక సమయంలో రామ్ చరణ్ సినిమాలన్నీ రొటీన్ అయిపోతున్నాయి అని ప్రేక్షకుల నుంచి విమర్శలు వస్తున్న క్రమంలో ఆయన తన పంథాను మార్చుకొని ధృవ, రంగస్థలం లాంటి డిఫరెంట్ సినిమాల వైపు అడుగులు వేశాడు. దాంతో భారీ విజయాలు వరించాయి. ఇప్పటివరకు ఆయన సినిమా ఇండస్ట్రీలో పలు సంచలనాలను క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. గ్లోబల్ స్టార్ గా అవతరించిన నటుడు కూడా తనే కావడం విశేషం… ఇక రామ్ చరణ్ కెరియర్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఒక హీరోయిన్ తనకు లవ్ లెటర్ రాసిందనే విషయం అప్పట్లో మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఇంతకీ ఆ లవ్ లెటర్ రాసింది ఎవరు? ఎందుకని అలాంటి లెటర్ ని రాసి ఇచ్చారు అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…
మగధీర మూవీ షూటింగ్ చేస్తున్న సమయంలో కాజల్ సినిమాలో హీరో కోసం ఒక లవ్ లెటర్ అయితే రాసింది. లవ్ లెటర్ మగధీర అనే సినిమాలో హర్ష క్యారెక్టర్ కి ఇందు అనే అమ్మాయి ఇవ్వాలి. అయితే రాజమౌళి ఆ లెటర్ సన్నివేశాన్ని షూట్ చేశారట. ఇక ఫైనల్ గా అది ఎడిట్ లో ఉంటుందో లేదో తెలియదు కానీ మొత్తానికైతే షూట్ అయితే చేశారు. ఇక ఆ లెటర్ ను స్వయంగా కాజల్ రాయడం విశేషం…
ఇక ఈ విషయం తెలుసుకున్న రామ్ చరణ్ ఆ లెటర్ లో ఏముందబ్బ అని అది తీసుకొని ఆసక్తిగా చదివాడట. అందులో కాజల్ తనకు ఇష్టం వచ్చినట్టుగా ఏదో రాసిందని అది లవ్ లెటర్ కాదు. దానికి ఏ లెటర్ అని పేరు పెట్టాలో నాకు అర్థం కావడం లేదు అంటు రామ్ చరణ్ సినిమా యూనిట్ తో చెబుతూ నవ్వుకున్నారట.
అప్పట్లో సోషల్ మీడియా లేదు కాబట్టి మీడియాలో రామ్ చరణ్ కి లవ్ లెటర్ రాసిన హీరోయిన్ అంటూ కొన్ని కథనాలైతే వెలువడ్డాయి. నిజానికి అదంతా ఫన్నీగా జరిగిన వ్యవహారం. ఇక ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ స్టార్టింగ్ లోనే చాలా మంచి విజయాలను సాధించి తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఇక రాజమౌళి లాంటి దర్శకుడి డైరెక్షన్లో చేసిన మగధీర సినిమా ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేయడం అనేది అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించింది…