Threat to China: చైనా మనకే కాదు అన్ని దేశాలకు ఒకరకంగా శత్రువు లాంటిదే. భౌగోళికంగా ఉన్న సరిహద్దులను ఆక్రమించడం.. గతంలో ఉన్న హద్దులను చెరిపేయడం.. ఇతర దేశాల గ్రామాలకు తన పేర్లు పెట్టుకోవడం.. ఏకంగా మ్యాపులను కూడా మార్చేసి.. తన దేశంలో ఉన్నట్టు చూపించడం చైనాకు పరిపాటే. ఉదాహరణకు మన దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న కొన్ని ప్రాంతాలను తమ దేశంలో ఉన్నట్టు చైనా పాలకులు ప్రకటించుకున్నారు. దానికి సంబంధించి అధికారికంగా ప్రకటన కూడా చేశారు. మ్యాప్ కూడా రూపొందించారు. దీనిపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో చైనా పాలకులు ఒక అడుగు వెనకేశారు. ఇక ఆ మధ్య గాల్వాన్ ప్రాంతంలో జరిగిన వివాదంలో మన సైనికుల మీదికి వారి దేశానికి చెందిన సైనికులను ఎగదోశారు. ఒకానొక సందర్భంలో మన సైనికులను డిఫెన్స్ లో పడేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు.. మన దేశం తోనే కాదు ఇతర దేశాలతోనూ చైనాకు ఇలాంటి సరిహద్దు వివాదాలే ఉన్నాయి. కాకపోతే మన దేశం ఆర్థికంగా చైనాకు దరిదాపుల్లో ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. కానీ ఇతర దేశాల పరిస్థితి అలా కాదు. పైగా అవి చైనా చెప్పినట్టు వింటున్నాయి. తమ అవసరాలకు తగ్గట్టుగా చైనా దగ్గర అప్పు తెచ్చుకుంటున్నాయి.
Also Read: Karregutta: మావోయిస్టులు డెన్ ను టూరిస్ట్ హబ్ గా మారుస్తున్న కేంద్రం.. పెద్ద స్కెచ్
అయితే ప్రపంచాన్ని ముంచేసి తను మాత్రం గొప్పగా ఉండాలనే కోరిక చైనాది. ఇక ఆ దేశ పరిపాలకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచం సర్వనాశనమైనా పర్వాలేదు.. తాము మాత్రం గొప్పగా ఉండాలనే కోరిక చైనా పరిపాలకులది. అందువల్లే ప్రకృతికి విరుద్ధంగా ప్రాజెక్టులు కడుతుంటారు. భూకంపాలు చోటుచేసుకునే ప్రమాదం ఉన్నప్పటికీ త్రీ గోర్జెస్ లాంటి జలాశయాలను నిర్మిస్తారు. అయితే ఇప్పుడు చైనానే మునిగిపోయే ప్రమాదం వచ్చింది. ఎందుకంటే చైనాకు దగ్గరలో ఉన్న హిమానీనదాలు ఇటీవల కాలంలో వేగంగా కరిగిపోతున్నాయి. గడచిన ఆరున్నర దశాబ్దాల నుంచి ఈ నదులు అత్యంత వేగంగా కరిగిపోతున్నాయి. ఓ నివేదిక ప్రకారం దాదాపు 7వేలకు పైగా మంచు దిబ్బలు మాయం అయిపోయాయి. ఇవి చైనా చుట్టుపక్కల ఉన్న హిమానీ నదాలలో 26%. ఒకవేళ ఇవి ఇలానే కరిగిపోతే భవిష్యత్తు కాలంలో చైనా తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. తీర ప్రాంతాలలో ఉన్న నగరాలు మొత్తం నీట మునిగిపోతాయి. వేగంగా మంచు దెబ్బలు కరిగిపోతే భవిష్యత్తు కాలంలో నీటి వనరుల మట్టం పెరిగిపోతుంది. ఒకవేళ కరువు కాటకాలు ఏర్పడినప్పుడు నీటి కొరత ఎదురవుతుంది. పైగా చైనాలో ఉన్న పెద్ద పెద్ద నగరాల మొత్తం నది తీరాలలో ఉన్నాయి. నదుల నీటిమట్టం కనుక పెరిగి నగరాలు మునిగిపోతే చైనా తీవ్ర ఇబ్బందులు పడాలి. ఒకరకంగా ఆర్థికంగా కష్టాలు కూడా చవి చూడాలి.. అవన్నీ జరగకూడదు అనుకుంటే మంచు దిబ్బలు కరగడం ఆగాలి. అయితే ఇది ఆచరణలో సాధ్యమయ్యే తీరుగా కనిపించడం లేదు. చైనాలోని టిబెట్, షింజియాంగ్ ప్రాంతాలలో మంచు దిబ్బలు అధికంగా కరిగిపోతున్నాయి. వీటి నివారణ కోసం చైనా ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఉపయోగం ఉండడం లేదు.