Wedding tradition bride position: కానీ నేటి కాలంలో కొందరు ఆధ్యాత్మికవాదులు చమత్కారంగా భర్తకు ఎడమవైపు ఆడవారు ఎందుకు ఉండాలో చెప్పారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.. వివాహ సమయంలో దంపతులు కూర్చుని సమయంలో వరుడికి ఎడమవైపున వధువును కూర్చోబెడతారు. అయితే సాధారణంగా ఎందుకు కారణం ఏంటంటే.. భర్తకు ఎడమవైపున గుండె ఉంటుంది. భార్యను గుండెలో పెట్టుకొని చూసుకోవాలి అన్నట్లుగా ఎడమవైపు ఉండాలని చెబుతూ ఉంటారు. అంతేకాకుండా మగవారికి భార్య గుండెతో సమానం అని చెప్పేందుకు ఇలా నిల్చమని చెబుతూ ఉంటారు.
Also Read: Marriage: యువతకు ఎందుకు పెళ్లిళ్లు కావడం లేదు.. సమాజం ధోరణి ఎలా ఉంది?
అయితే ఈ విషయాన్ని కొందరు సోషల్ మీడియాలో చమత్కారంగా చెప్పారు. అది ఎలా అంటే.. మ్యాథమెటిక్స్ లో సున్నాకు ఎంత విలువ అందరికీ తెలిసిన విషయమే. సున్నాకు కుడివైపున ఎన్ని అంకలు వేసినా వాటికి విలువ ఉండదు. అలాగే సున్నాలు తర్వాత ఎంత పెద్ద అంకె ఉన్న దానిని సింగిల్ గానే గుర్తిస్తారు. కానీ సున్నాలు కు ఎడమవైపున ఒకటి నుంచి తొమ్మిది వరకు అంకెలు వేసుకుంటూ వెళ్తే వాటి విలువ పెరుగుతుంది. ఉదాహరణకు 0 కు ఎడమవైపున ఒకటి అంకె వేస్తే పది అవుతుంది. 9 అంకె వేస్తే 90 అవుతుంది. అంటే ఎన్ని అంకెలు వేస్తే అంత విలువ 0 కి పెరిగిపోతుంది. అలాగే భర్తకు ఎడమవైపున భార్య ఉంటే భర్తకు విలువ పెరుగుతుంది.
ఇలా ఎన్నో రకాలుగా భార్య ఎడమవైపు ఉండాలని చెబుతూ వస్తున్నారు. అయితే కొందరు మాత్రం భార్యను లక్ష్మీదేవిగా పోలుస్తూ ఎడమవైపున ఉంటారని అంటారు. ఎందుకంటే మగవారు ధరించే షర్టు కు ఎడమవైపున జేబు ఉంటుంది. ఇందులో నిత్యం డబ్బులు ఉంటాయి. అలాగే ఇదే వైపున భార్య కూడా ఉంటే వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుందని చెబుతారు. అయితే చాలామంది నేటి కాలంలో ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో ఇష్టం వచ్చినట్లు నిల్చోని ఉంటున్నారు. అలా చేయడం ఎంత మాత్రం శుభం కాదని ఆధ్యాత్మిక వాదులు చెబుతున్నారు. ముఖ్యంగా పూజల సమయంలో భర్తకు ఎడమవైపున భార్య కూర్చోవడం వల్ల దేవతలు కూడా సంతోషిస్తారని చెబుతున్నారు.
Also Read: Indian Marriage: భారతీయ పెళ్లిళ్లలో జనాలు ఎక్కువగా వేటికి ఖర్చు చేస్తారు.. నిజంగా అవి అవసరమేనా ?
ఇలా కూర్చోవడం వల్ల గ్రహాల శక్తి కూడా అనుకూలంగా మారుతుందని అంటున్నారు. భార్యాభర్తల రాశుల వేరే విధంగా ఉంటాయి. అయితే ఇలా ఎడమవైపు భార్య ఉండడం వల్ల రెండు రాశులు వారికి అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వీరి రాశుల ప్రకారం కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఎలాంటి పూజలు నిర్వహించిన భార్య ఎడమవైపు ఉంటేనే శుభప్రదంగా ఉంటుందని ఆధ్యాత్మిక వాదులు చెబుతున్నారు.