Giant Hailstones Video: ఆకాశం నుంచి వడగండ్ల వాన కురవడం అనేది పరిపాటి. కానీ ఆ వడగండ్లు కాస్త రాళ్ల మాదిరిగా ఉంటే.. అవి కూడా అతి పెద్ద సైజులో ఉంటే.. సాధ్యం కానే కాదు.. మామూలుగా అయితే వడగండ్లు చిన్న చిన్న రాళ్ల రూపంలో ఉంటాయి.. అంతటి పెద్ద బండ రాళ్లు ఆకాశం నుంచి ఎలా కురుస్తాయని మీరు అనుకుంటున్నారు కదా.. మీ అంచనా కరెక్టే. కాకపోతే సోషల్ మీడియాను ఊపేస్తున్న ఓ వీడియోలో మాత్రం వడగండ్లు పెద్ద బండ రాళ్ల సైజులో ఉన్నాయి.
సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఆ వీడియో ప్రకారం ఆకస్మాత్తుగా అక్కడ వర్షం కురుస్తోంది. వడగండ్లు పడుతున్నాయి. కాకపోతే అవి పెద్ద పెద్ద రాళ్ల పరిమాణంలో ఉన్నాయి. అవి పడుతున్నప్పుడు షాపులు మొత్తం కూలిపోయాయి. రోడ్డు పక్కన పార్కు చేసిన కార్లు పగిలిపోయాయి. ఆ రాళ్ల దెబ్బకు నష్టం విపరీతంగా ఉంది.. నిజంగానే ఈ స్థాయిలో వర్షం కురిసిందా.. ధ్వంసమైన ఓ కారుకు మహారాష్ట్ర నెంబర్ ప్లేట్ ఉంది. ఈ ప్రకారం ఈ వర్షం మహారాష్ట్రలో కురిసిందని చాలామంది ఒక అంచనాకు వచ్చారు.
అయితే మహారాష్ట్రలో ఈ స్థాయిలో వర్షం కురవడం తాము చూడలేదని నెటిజన్లు అంటున్నారు.. ఇదంతా ఏఐ ద్వారా సృష్టించిన వీడియో అని వాదిస్తున్నారు. ఇదే విషయాన్ని గ్రూక్ ను అడిగితే.. ఈ వర్షం కురిసి ఉండవచ్చని అంచనా వేస్తోంది. ఆ వీడియో ఏఐ జనరేట్ ద్వారా చేసింది కాదని చెబుతోంది. మరికొందరేమో ఆ స్థాయిలో మంచు రాళ్ల వర్షం కురిసిన ఆనవాళ్లు లేవని చెబుతున్నారు. కాకపోతే ఆ స్థాయిలో మంచు రాళ్లు కురవడం మాత్రం ఆందోళనకరంగా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
“ఈ సంవత్సరం ఘోరమైన కరువు ఉంటుందని అంటున్నారు. వాతావరణంలో కూడా మార్పులు కనిపిస్తున్నాయి. ఎండలు ఈ ఏడాది రికార్డు స్థాయిలో నమోదవుతున్నా. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వీటన్నిటికీ సంకేతాలుగా ఈ స్థాయిలో మంచు రాళ్ల వర్షం పడుతుంది. చూస్తుంటే మానవజాతికి ఏదో ముప్పు పొంచి ఉందని” నెటిజన్లు పేర్కొంటున్నారు.
Massive hailstones raining down like bombs on a flooded street! Nature’s power is unbelievable. pic.twitter.com/z7zYfTOvoz
— Worldly (@WorldlyHQ) April 27, 2026
