Ghost Cities In China: ఈ పేరు వినగానే మనకు ఏమనిపిస్తుంది అంటే.. ఇదొక దయ్యాల నగరం. ఇక్కడ మనుషులు జీవించే అవకాశం లేదు.. సాయంత్రం అయిందంటే ఏవేవో అరుపులు వినిపిస్తాయి. ఇటువైపు వెళ్లడానికి ఎవరు సాహసించరు.. కానీ చైనాలోని కొన్ని ఘోస్ట్ నగరాలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. మరో దగ్గర గోస్ట్ సిటీ అంటే పాడుబడ్డ బంగ్లాలో ఉన్న నగరం అని అనుకుంటాం. చైనాలో పిలవబడే ఘోస్ట్ సిటీస్ లో పెద్దపెద్ద భవనాలు కనిపిస్తాయి. అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. మంచి రోడ్లు, స్విమ్మింగ్ పూల్, ప్లే గ్రౌండ్ వంటివి ఉంటాయి. అయినా వీటిని ఘోస్ట్ సిటీస్ అని పిలుస్తున్నారు. అసలు అలా పిలవడానికి కారణం ఏంటి? అయినా లో ఘోస్ట్ సిటీస్ ఎన్ని ఉన్నాయి?
ప్రపంచంలో ఆర్థికంగా ఉన్నత స్థితికి రావడానికి చైనా తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా ఒక వైపు టెక్నాలజీని వాడుకుంటూ మరోవైపు నిర్మాణ రంగంలోనూ ముందుకు వెళ్తోంది. మిగతా దేశాల్లో కంటే చైనాలో ఎక్కువగా భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇలా ఎన్నో రకాలుగా భవనాలు నిర్మిస్తూ కొన్ని రకాల నగరాలను సృష్టించారు. మన దగ్గర హైదరాబాద్, వరంగల్ వంటి ప్రధాన నగరాల్లో విల్లాలు లేదా అపార్ట్మెంట్లు నిర్మించి వాటిని విక్రయిస్తూ ఉంటారు. లేదా అద్దెకు ఇస్తుంటారు. కానీ చైనాలో మాత్రం ఖాళీ ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడ కొన్ని భవనాలను నిర్మించి ఒక నగరాన్ని సృష్టిస్తారు. ఇలా సృష్టించిన నగరంలోని భవనాలను విక్రయిస్తూ ఉంటారు. అయితే ఇలా చైనా ప్రభుత్వం కొన్ని నగరాలను నిర్మించి.. వాటిని ప్రజలకు విక్రయించాలని చూసింది. అయితే ప్రభుత్వం అనుకున్నట్లు సాధ్యం కాలేదు. ఇలా ఎన్నో రకాల నగరాలను నిర్మించినా కూడా అందులో ప్రజలు ఉండడానికి ఇష్టపడడం లేదు. అంతేకాకుండా కొన్ని సగం నిర్మాణాలు జరిపి వాటిని మధ్యలోనే వదిలేశారు.
అయితే ఇందులోకి రాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా అధిక ఖర్చు ఉండడమే. ప్రభుత్వం ఇలా భవనాలను నిర్మించి విక్రయించే సమయంలో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని చాలామంది వీటిని కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. చైనాలో చాలా గ్రామాల్లో ఉన్న ప్రజలు నగరాల్లో ఉండడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే వారికి వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలలోనే ఎక్కువగా సౌకర్యంగా ఉంటుందని భావిస్తుంటారు. అలా ఎవరు కొనడానికి ఇష్టపడకపోవడంతో ఈ భవనాలు ఘోస్ట్ పేరు తెచ్చుకున్నాయి.
ఇలాంటి భవనాలు ORODOS, Tianducheng, Yujiapu, Chenggong వంటివి ఉన్నాయి. ఈ నగరాలకు వెళ్లినప్పుడు ఆకాశపు అంతా ఎత్తు ఉండే భవనాలు కనిపిస్తాయి. కానీ ఇందులో ఒక్కరు కూడా కనిపించరు. ఇవి ఎంతో ఖర్చుతో నిర్మాణాలు చేసినా కూడా వాటిలో రావడానికి ఎవరు ఇష్టపడడం లేదు. అయితే వీటిని నిర్మించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రభుత్వం సైతం తీవ్రంగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇక్కడ కొన్ని కార్యాలయాలను ఏర్పాటు చేయడంతో ఇప్పుడిప్పుడే వీటిలోకి రావడానికి ఇష్టపడుతున్నారు. అయినా కూడా చాలా భవనాలు ఖాళీగానే ఉంటున్నాయి. ఇలా ఖాళీగా ఉండడంతో వీటిని ఘోస్ట్ సిటీస్ గా పేర్కొంటున్నారు.