Ganesha Statue On Mars: ఈ భూమిపై ఎన్నో వింతలు.. విశేషాలు ఉన్నాయి. అవి ఇప్పుడిప్పుడే సోషల్ మీడియా ద్వారా బయటపడుతున్నాయి. అయితే మీడియా కారణంగా మన భూమి మీద కాకుండా పక్కన ఉన్న గ్రహాలపై కూడా ఏం జరుగుతుందో తెలుసుకోగలుగుతున్నాం. అంతరిక్షంలో ఉన్న గ్రహాలన్నీటిలో మానవ జీవనానికి భూమి మాత్రమే అనువైన గ్రహం. కానీ శాస్త్రవేత్తలు మాత్రం తమ పరిశోధనల ద్వారా మరి గ్రహమైన మానవ జీవనానికి అనుకూలంగా ఉంటుందా? అని పరిశోధనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ముందుగా మార్స్ గ్రహాన్ని ఎంచుకున్నారు. ఈ గ్రహం ఎర్రగా ఉంటుంది అని పుస్తకాల్లో చదివాం. కానీ ఇప్పుడు అమెరికాకు చెందిన నాసా శాస్త్రవేత్తలు ఏకంగా అక్కడికి కొన్ని శాటిలైట్స్ పంపి పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనలో తాజాగా తేలిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే?
మార్స్ గ్రహం.. దీనిని తెలుగులో అంగారక గ్రహం అని పిలుస్తాం. ఇది భూమికి 40 కోట్ల కిలోమీటర్ల ఉన్న మార్స్ గ్రహంపై అమెరికాకు చెందిన నాసా శాస్త్రవేత్తలు అక్కడికి రోవర్లను పంపించి పరిశోధనలు ప్రారంభించారు. అయితే వీరి పరిశోధనల ప్రకారం మార్స్ గ్రహం పై ఎర్రటి రంగులో రాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ గతంలో ఎవరైనా జీవించారా? లేదా ప్రస్తుతం మానవ జీవనానికి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయా? అని పరిశోధనలు చేస్తున్నారు. వీరి పరిశోధనలకు తాజాగా ఆశ్చర్యకరమైన ఒక ఆకారం కనిపించింది. ఆకారం ఒక గణేశుడి విగ్రహం.
అంగారక గ్రహం పై వినాయకుడి ఆకారంతో ఉన్న ఒక రాయి కనిపించడంతో శాస్త్రవేత్తలకు ఆశ్చర్యం కలిగింది. వాస్తవానికి వారికి వినాయకుడు అని తెలియదు. ఇది ఒక సాధారణమైన ఆకారం కావచ్చు అని అనుకున్నారు. ఆ తర్వాత హిందూ దేవుడైన వినాయకుడి విగ్రహం అని తెలుసుకున్నారు. అయితే ఈ విగ్రహాన్ని ఇక్కడ ఎవరైనా తయారు చేశారా? లేదా సహజసిద్ధంగా ఏర్పడిందా? అన్న అనుమానాలు ఉన్నాయి. దీనిని మనుషులు ఎవరు తయారు చేయడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఈ గ్రహంపై మనిషి జాడ ఉన్నట్లు ఇప్పటివరకు గుర్తించలేదు. అయితే గతంలో ఇక్కడ బుద్ధుడి విగ్రహం కూడా లభ్యమైనది. ఇలా విగ్రహాలను పరిశీలిస్తే పురాతన కాలంలో ఇక్కడ మానవులు జీవించారా? అన్న అనుమానాలు మొదలయ్యాయి.
అయితే బిలియన్ సంవత్సరాల కిందట మార్స్ గ్రహం భూమి లాగే నీరు, గాలితో నిండి ఉండే అవకాశాలు ఉన్నాయని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అలా ఉన్న సమయంలో ఇక్కడ నాగరికత కొనసాగిందని అనుమానిస్తున్నారు. అయితే ఒకవేళ అలా ఉంటే ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది మాత్రం అంతు పట్టడం లేదు. కానీ ప్రస్తుతం భూమిపై గ్లోబల్ వార్మింగ్ పెరుగుతున్న నేపథ్యంలో ఆ గ్రహంపై కూడా ఒకప్పుడు అనుకోని సంఘటనలు ఏవైనా జరిగి జీవరాశులు లేకుండా తుడిచిపెట్టుకుపోయిందా? అని అంటున్నారు.
ప్రస్తుతం భూమి గ్లోబల్ వార్మింగ్ కారణంగా వేడెక్కిపోతుంది. దీంతో భవిష్యత్తులో అనేక ఊహించని సంఘటనలు జరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో మరొక సేఫ్ ప్లేస్ ఎంచుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం మార్స్ మాత్రమే అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇక్కడ కొన్ని ఆకారాలు లభ్యం కావడంతో.. ఇక్కడ మనుషులు జీవించడానికి అనుకూలమైన వాతావరణం ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కానీ అది సాధ్యమయ్యే పనేనా? అని కొందరు అంటుంటే.. ఏమో భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేం. కానీ ఒకవేళ గ్రహాలు మారితే మాత్రం మార్స్ మాత్రమే అనుకూలంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇందులో భాగంగా నాసా శాస్త్రవేత్తలు ఈ గ్రహం పైనే పరిశోధన చేస్తున్నారు. మరి ముందు ముందు ఎలాంటి విషయాలు బయట పడతాయో చూడాలి.