Funny Driving Licence Test Video: డ్రైవింగ్ చేయాలంటే భారత చట్టాల ప్రకారం అందరికీ లైసెన్స్ ఉండాలి. 18 ఏళ్లు నిండిన స్త్రీ, పురుషులు రవాణా శాఖ కార్యాలయం నుంచి డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు. అయితే లైసెన్స్ జారీకి రవాణా అధికారులు కొన్ని టెస్టులు నిర్వహిస్తారు. అందులో పాస్ అయితేనే లైసెన్స్ వస్తుంది. అయితే తాజాగా ఓ మహిళ డ్రైవింగ్ టెస్టులో నడిపిన వీడియో వైరల్ అవుతోంది.
డ్రైవింగ్ పరీక్ష కోసం అందరూ రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లాల్సిందే. సొంత ద్విచక్రవాహనం లేదా అద్దె వాహనంతో రవాణా కార్యాలయంలోని నిబంధనల మేరకు డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. వాహనం నడిపే సమయంలో ఫెయిల్ అయితే లైసెన్స్ ఇవ్వరు. డ్రైవింగ్ పరీక్షను అధికారులు పర్యవేక్షిస్తారు.
Also Read: Electric Scooters: సగం ధరకే రాబోతున్న ఎలక్ట్రిక్ స్కూటర్.. రెంటల్ బ్యాటరీతో హీరో సెన్సేషన్
కాళ్లతోనే డ్రైవింగ్..
తాజాగా ఎక్స్‌లో ఓ మహిళ డ్రైవింగ్ టెస్ట్ వీడియో వైరల్ అవుతోంది. డ్రైవింగ్ టెస్ట్‌కు వెళ్లేవారు ఎంతో కొంత డ్రైవింగ్ నేర్చుకుని వెళ్లారు. అయితే ఈ వీడియోలో మహిళ మాత్రం తనకు బండి పట్టడం కూడా చేతకాదని తెలుస్తోంది. అయినా ఆమె ధైర్యంగా డ్రైవింగ్ టెస్టుకు సిద్ధమైంది. డ్రైవింగ్ ట్రాక్‌పై స్కూటీ నడిపేందుకు అష్టకష్టాలు పడింది. వాహనం స్టార్ట్ చేయకుండానే.. దానిని కాలితో నెడుతూ కొంత దూరం వెళ్లింవది. దీనిని వీడియో తీసిన అక్కడివారు ఎక్స్‌లో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది.
డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షలో అదరగొట్టిన మహిళ
#drivinglicense #uanow pic.twitter.com/Xv9A4lzosS
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) June 21, 2025
నెటిజన్ల స్పందన..
వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇది గత జనగ్ ప్రభుత్వంలా ఉందని కొందరు.. ఇమీడియెట్లీ ఆమెను రిజెక్ట్ చేయాలని మరికొందరు.. నడపడం రాదనే.. ప్రభుత్వం ఫ్రీ బస్ ఇచ్చింది మహిళలకు అని మరికొందరు.. ఇచ్చేయండి సార్ లైసెన్స్ అని కొందరు కామెంట్ పెడుతున్నారు. ఈమెకు లైసెన్స్ ఇస్తే ఎవరిని చంపుతుందో అని మరికొందరు పేర్కొంటున్నారు.