Arya Heroine Latest Photos: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో ‘ఆర్య'(Arya) ఒకటి. ఆయన రాబోయే రోజుల్లో ఎన్ని పుష్ప లాంటి చిత్రాలు అయినా చెయ్యొచ్చు, కానీ ‘ఆర్య’ మ్యాజిక్ ని రిపీట్ చేయడం కష్టం. లవ్ స్టోరీస్ లో ఒక ట్రెండ్ ని సెట్ చేసిన సినిమా ఇది. ఈరోజు దేశం మొత్తం గర్వించదగ్గ దర్శకులలో ఒకరిగా పిలవబడే సుకుమార్(Sukumar) డైరెక్టర్ గా పరిచయమైంది ఈ చిత్రం తోనే. ఇప్పటికీ ఈ సినిమా టీవీ టెలికాస్ట్ సమయంలో మంచి టీఆర్ఫీ రేటింగ్స్ ని సొంతం చేసుకుంటూ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే అల్లు అర్జున్, సుకుమార్ ఇద్దరి కెరీర్ లోనూ ఈ సినిమాకు మోస్ట్ రిపీట్ వేల్యూ ఉంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ గా అను మెహతా(Anu Mehta) నటించింది.
ఈ సినిమాలో ఈమెని చూసి ప్రేమలో పడని తెలుగు కుర్రాడు ఉండదు అంటే అతిశయోక్తి కాదేమో. తెలుగు అమ్మాయి కాకపోయినా చూసేందుకు అచ్చ తెలుగు అమ్మాయి లాగా అనిపిస్తుంది. ఈమె ముఖం లో పలకలేని అభినయం అంటూ ఏది ఉండదేమో. ‘ఆర్య’ పెద్దిహీట్ అయ్యింది కాబట్టి ఆ సినిమా తర్వాత ఈమె తలరాత మారిపోతుందని అంతా అనుకున్నారు. టాలీవుడ్ కొత్త స్టార్ హీరోయిన్ వచ్చేసింది అంటూ అప్పట్లో కథనాలు కూడా ప్రచురించారు. అయితే ఈమె అందరూ ఊహించిన విధంగా పెద్ద రేంజ్ కి చేరుకోలేక పోయింది. స్టార్ హీరోలు ఈమెకు తమకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వ్వలేదు. ‘ఆర్య’ తర్వాత ఈమె ‘నువ్వంటే నాకిష్టం’, అజయ్, వేడుక వంటి చిత్రాల్లో నటించింది. ఒక్క సినిమా కూడా కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు. 2008 వ సంవత్సరం తర్వాత ఈమె సినిమాలకు పూర్తిగా దూరమై వివాహం చేసుకొని స్థిరపడిపోయింది. అయితే చాలా కాలం తర్వాత ఈమెకు సంబంధించిన ఒక ఫోటో విడుదలైంది.
Also Read: Tollywood: ఈ డైరెక్టర్లు తీసిన మొదటి సినిమాలోని హీరోయిన్లు ఫేడ్ అవుట్ అవ్వడానికి కారణాలు ఏంటంటే…
ఈ ఫొటోలో ఆమె లుక్స్ ని చూసి జనాలు షాక్ కి గురయ్యారు. ఆర్య చిత్రం లో ఎంతో అందంగా కనిపించే ఈమె, అకస్మాత్తుగా ఇలా మారిపోయిందేంటి. అసలు ఇదెలా సాధ్యం,మా కళ్ళని మేము నమ్మలేకపోతున్నాము అంటూ సోషల్ మీడియా లో ట్వీట్స్ ఇస్తున్నారు. ఈ సినిమాలో హీరోగా నటించిన అల్లు అర్జున్ ఇప్పుడు ఎంతో అద్భుతమైన లుక్స్ తో కొనసాగుతుంటే,హీరోయిన్ గా నటించిన అను మెహతా ఇలా బండగా తయారైంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె సోషల్ మీడియా లో ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు దగ్గరగా ఉంటుంది. ఆమెకు సంబంధించిన లేటెస్ట్ లుక్స్ ని చూసి మీ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయండి.
ila aypoindi enti ra pic.twitter.com/9GhYI0Qs2C
— _️ (@allu_rockz4666) June 20, 2025