Bigg Boss 8′ Diwali Episode : నిన్నటి దీపావళి ఎపిసోడ్ లో హైలైట్ గా అనిపించిన అంశాలలో ఒకటి సమీరా భరద్వాజ్ పాడిన పాటలు. కంటెస్టెంట్స్ గురించి ప్రత్యేకంగా రాసుకొచ్చి సుమారుగా 30 నిమిషాల పాటు ఆమె పాటలు పాడింది. ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి ఆమె పాడిన పాటలో పొగడ్త ఉంది, విమర్శ ఉంది అలాగే రాబోయే రోజుల్లో ఎలా ఆడాలి అని హింట్స్ కూడా ఉన్నాయి. పాటలు సొంతంగా ఆమెనే రాసిందా?, లేకపోతే బిగ్ బాస్ టీం ఇచ్చిందా అనేది తెలియదు కానీ, ఆమె ఉన్న ఆ కాసేపు మాత్రం అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ దొరికింది. ఇంతకీ ఎవరు ఈ సమీరా భరద్వాజ్. ఇంతకు ముందు ఏ పాటలు పాడింది?, అసలు ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. సమీరా భరద్వాజ్ ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ కి చెందిన అమ్మాయి. ఈమెకి చిన్నతనం నుండే పాటలు మీద అమితాసక్తి ఉండేది. ఆ ఆసక్తి తోనే ఈమె కర్నాటిక్ మ్యూజిక్, హిందుస్తానీ మ్యూజిక్ , వెస్ట్రన్ క్లాసిక్ మ్యూజిక్ వంటివి నేర్చుకుంది.
2015 వ సంవత్సరం లో స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే ‘సూపర్ సింగర్’ ప్రోగ్రాం లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్న సమీరా భరద్వాజ్ రన్నర్ గా నిల్చింది. అలా సూపర్ సింగర్ షో ద్వారా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సమీరా భరద్వాజ్, అదే ఏడాది ఎనెర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ‘శివమ్’ మూవీ లోని ‘ఐ లవ్ యూ టూ’ అనే పాటకి ప్లే బ్యాక్ సింగర్ గా మారింది. ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా , మ్యూజిక్ పరంగా మంచి హిట్ అయ్యింది.
అలా మొదలైన సమీరా భరద్వాజ్ సినీ కెరీర్, వరుస ఆఫర్స్ తో దూసుకుపోయింది. సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఈమె ఖాతాలో ఉన్నాయి. బ్రూస్లీ ది ఫైటర్, సరైనోడు, నేను లోకల్, రాజా ది గ్రేట్, హైపర్, వాల్తేరు వీరయ్య, శతమానం భవతి ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లోని, పలు బ్లాక్ బస్టర్ సాంగ్స్ కి ఆమె తన గాత్రం అందించింది. సోషల్ మీడియా ద్వారా ఈమె అందరికీ సుపరిచితమే. అలాగే స్టార్ మా ఛానల్ ప్రసారమైన సూపర్ సింగర్ షోని చూసే వాళ్లకు కూడా ఈమె ఎవరో తెలిసే ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా హైలైట్ అయ్యింది మాత్రం బిగ్ బాస్ షో ద్వారానే. ఈమె టాలెంట్ కి నాగార్జున కూడా ముగ్దుడు అయిపోయాడు. అయితే ఈమె తదుపరి సీజన్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంపికైన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పాటలు పాడినప్పటికీ కూడా, ఈమెకు మిగిలిన సింగర్స్ తో పోలిస్తే తక్కువ పాపులారిటీ ఉంది అని చెప్పొచ్చు, బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా పాల్గొంటే మాత్రం ఈమె మరో లెవెల్ కి వెళ్లొచ్చు.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Sameera bharadwaj who attracted special attention with her voice in the diwali episode of bigg boss 8 will be surprised to see the background
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com