Cloudburst In Kishtwar: ఊహించని వరదలు.. చూస్తుండగానే నేలమట్టమైన ఇళ్లు.. కాల గర్భంలో కలిసిపోయిన వృక్షాలు.. కొట్టుకుపోయిన వాహనాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఊహ కందని విధ్వంసం.. మాటలకందని నష్టం.. ఇదేదో అమెరికాలోనో.. ఇంకేదో దేశంలోనో చోటు చేసుకున్నది కాదు.. మనదేశంలోనే.. అది కూడా భూతల స్వర్గంగా పేరుపొందిన జమ్ము కాశ్మీర్లో..
Also Read: ఎయిర్టెల్ యూజర్ లకు బంపర్ ఆఫర్.. రీఛార్జ్ చేసుకుంటే 17,000 మీ సొంతం!
జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలోని కిష్త్వార్ ప్రాంతంలో ఇటీవల క్లౌడ్ బరస్ట్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 60 మంది చనిపోయారు. దాదాపు 100 మందికి పైగా గాయపడ్డారు. కొండలపై నుంచి ఒక్కసారి గవరద నివాస సముదాయాల మీదికి తీసుకొచ్చింది. భారత ప్రభావం వల్ల ఇళ్లు సర్వ నాశనం అయ్యాయి. దుకాణాలు కొట్టుకుపోయాయి. బండరాళ్లు పెద్ద పెట్టున వచ్చాయి.. ఏం జరిగిందో తెలుసుకునే లోగానే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో ఎంత మేరకు నష్టం వాటిల్లిందనే విషయం ఇంకా వెలుగులోకి రాలేదు. కాకపోతే క్లౌడ్ బరస్ట్ వల్ల ఈ ప్రాంతం ఇప్పట్లో కోలుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ ప్రాంతంలో ఈ స్థాయిలో వరదలు రావడం ఇదే తొలిసారి అని స్థానికులు అంటున్నారు.
వాస్తవానికి ఈ ప్రాంతంలో హిమపాతం ఎక్కువగా సంభవిస్తూ ఉంటుంది. వర్షాలు ప్రతి ఏడాది సమృద్ధి గా కురుస్తుంటాయి. అప్పుడప్పుడు వర్షాభావం ఏర్పడినప్పటికీ ఇక్కడి వ్యవసాయం మీద పెద్దగా ప్రభావం చూపించదు. కానీ ఈసారి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా క్లౌడ్ బరస్ట్ చోటు చేసుకోవడంతో కనీవిని ఎరుగని స్థాయిలో వరదలు సంభవించాయి. కొండ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వరద విపరీతంగా వచ్చింది. ఈ వరద వల్ల విపరీతమైన నష్టం వాటిల్లింది. అయితే నష్టం ఏ మేరకు ఉంది.. అనేదానిపై అధికారులు నివేదికలు రూపొందిస్తున్నారు. క్లౌడ్ బరస్ట్ చోటు చేసుకున్న ఈ ప్రాంతాన్ని ఆదుకుంటామని.. ప్రజలకు అండగా ఉంటామని జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చాయి.
Massive cloudburst in Kishtwar of Jammu & Kashmir, led to flash floods. 60+ killed, over 100+ missing. Rescue Ops underway. #cloudburst #CloudburstInKishtwar #Kishtwar #KishtwarTragedy #JammuKashmir #JammuAndKashmir #jammukashmircloudburst #FlashFlood pic.twitter.com/pasBRwzIeB
— Trolls Officials (@trollsofficials) August 15, 2025