Homeవింతలు-విశేషాలుWoman throwing cash from balcony: భర్త మీద కోపం.. ఈ భార్య చేసిన పనితో...

Woman throwing cash from balcony: భర్త మీద కోపం.. ఈ భార్య చేసిన పనితో చుట్టుపక్కల వారు గట్టిగానే వెనకేసుకున్నారు.. వైరల్ వీడియో

Woman throwing cash from balcony: సముద్రం అన్నాక అలలు.. కాపురం అన్నాక గొడవలు కామన్. కాకపోతే ఈ గొడవలు వెంటనే పరిష్కారం కావాలి. లేదా ఎవరో ఒకరు పరిష్కార మార్గం చూపించాలి. అలాకాకుండా గొడవలు అంతకంతకు పెరిగిపోయి.. మరో ఉత్పతానికి దారి తీస్తే ఆ సంసారం పదిమందిలో పడుతుంది. నలుగురిలో నవ్వుల పాలవుతుంది. అందువల్లే సంసారం అనే నావలో ప్రయాణించే భార్యాభర్తలు సర్దుకుపోవాలి. ఒకరు గొడవ పడుతుంటే మరొకరు శాంతమూర్తి లాగా మారిపోవాలి. అలాకాకుండా ఇద్దరు సిగపట్లు పడితే మూడో వాడికి అవకాశం లభిస్తుంది. ఆ తర్వాత చెప్పాల్సిన పని ఉండదు.

భార్య భర్తల మధ్య గొడవలు ఎక్కడైనా కామనే. కాకపోతే ఒకరిపై ఒకరు పై చేయి సాధించాలనే తాపత్రయం వల్ల అడ్డగోలు పనులు చేస్తుంటారు.. రివెంజ్ డ్రామాలు మొదలు పెడుతుంటారు.. దీనివల్ల గొడవలు మరింత పెరుగుతాయి. మనస్పర్ధలు విపరీతమవుతాయి. దీనివల్ల భార్యాభర్తల మధ్య పూడ్చలేని ఆగాధం ఏర్పడుతుంది. అది కాస్త విపత్కర పరిణామాలకు దారితీస్తూ ఉంటుంది.

భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి సర్వసాధారణం. అయితే కొన్ని సందర్భాల్లో భార్య లేదా భర్తకు పట్టరాని కోపం వస్తుంది. అది కాస్త భారీ నష్టానికి దారితీస్తుంది. అటువంటి నష్టమే ఇప్పుడు ఈ భర్తకు ఎదురయింది. ఆ నష్టం విలువ కొన్ని కోట్లలో ఉంది. చైనాలోని సిచు వన్ ఫ్రావిన్స్ ప్రాంతంలో ఓ మహిళ తన భర్తతో గొడవ పడింది. ఇద్దరి మధ్య తీవ్రంగా వాగ్వాదం జరగడంతో తట్టుకోలేకపోయింది. ఆవేశంలో బయటికి వచ్చింది. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లి కరెన్సీ నోట్ల కట్టలను మొత్తం బాల్కనీ నుంచి బయటికి విసిరేసింది. ఆమె విసిరేసిన ఆ నోట్ల ఖరీదు అక్షరాల 1.35 కోట్లు. ఆకాశం నుంచి ఆకస్మాత్తుగా నూట వర్షం కురవడంతో స్థానికులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నోట్లు అదే పనిగా రావడంతో స్థానికులు తమ పని పక్కన పెట్టుకొని వాటిని ఏరుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది.

దీనిపై పోలీసులకు సమాచారం అందింది. ఫలితంగా వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆ నోట్లను ఏరుకుంటున్న వారిని చెదరగొట్టారు. అనంతరం ట్రాఫిక్ మొత్తాన్ని పునరుద్ధరించారు. స్థానికుల సహాయంతో ఆ నగదులో చాలా మొత్తాన్ని పోలీసులు సేకరించారు. ఆ తర్వాత ఆ కుటుంబానికి అందించారు. సాధారణంగా ఆవేశం అనేది ఆయుష్షును హరిస్తుంది అంటారు. చివరికి ఆస్తిని కూడా హారతి కర్పూరం చేస్తుందని చైనాలో జరిగిన సంఘటన నిరూపించింది. అయితే ఆ భార్యాభర్తలకు అక్కడి పోలీసులు ప్రస్తుతం కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఇద్దరి మధ్య గొడవ జరగడానికి కారణమైన పరిస్థితుల గురించి తెలుసుకున్న పోలీసులు.. వాటికి ఒక పరిష్కార మార్గాన్ని చూపిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version