Brothers Marry One Women: ఒక అమ్మాయిని ఒకరు మాత్రమే చేసుకుంటారు. కానీ ఈ సామాజిక వర్గంలో ఒక అమ్మాయిని ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పెళ్లి చేసుకోవచ్చు.. వింటుంటే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.. ఇది ఎప్పటినుంచో వస్తున్న ఆచారం. వెనుకటి కాలంలో బహుభార్యత్వం అనే సాంప్రదాయం ఉండేది. కానీ బహు భర్తత్వం అనే సంస్కృతి ఉండేది కాదు. వెనకటి కాలమే కాదు అంతకుముందు జరిగిన పురాణాలలోనూ బహుభార్యత్వమే ఉండేది. “ద్రౌపది” విషయాన్ని పక్కన పెడితే..మిగతా ఏ ఉదాహరణ తీసుకున్నా బహు భర్తత్వం అనేది కనిపించదు, వినిపించదు.
మనదేశంలోని హిమాచల్ ప్రదేశ్ లో హట్టి అనే సామాజిక వర్గం ఉంది. వీరంతా కూడా వ్యవసాయం, వ్యాపారం చేస్తూ జీవిస్తుంటారు. ఈ తెగ వారు ఎక్కువగా కొండ ప్రాంతాలలో జీవిస్తుంటారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో వీరు కూడా నగరాలలో జీవిస్తున్నారు.. ఈ సామాజిక వర్గంలో జోడి దారా అనే విధానం మనలో ఉంటుంది. దీని ప్రకారం ఇద్దరూ లేరా అంతకంటే ఎక్కువ మంది అన్నదమ్ములు ఒకే భార్యను కలిగి ఉండవచ్చు. పరస్పరం అంగీకారంతో భార్యను రాత్రికి లేదా వారానికి ఒకసారి మార్చుకుంటారు. ఇక పిల్లలకు అన్నదమ్ములలో పెద్ద వ్యక్తిని తండ్రిగా భావిస్తుంటారు. ఈ విధానాన్ని తెరపైకి తీసుకురావడానికి కారణం లేకపోలేదు. ఈ తెగవారికి భూములు అధికంగా ఉండేవి. అయితే అవి ముక్కలు కాకుండా ఉండడానికి.. వాటాలకు గురికాకుండా ఉండడానికి ఈ విధానాన్ని పూర్వికులు రూపకల్పన చేశారు.. అప్పటినుంచి ఈ తెగలో ఈ విధానం కొనసాగుతోంది. అలాగాని ఈ తెగ వారు కచ్చితంగా ఒకే అమ్మాయిని అంతమంది చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది ఒకే భార్యను చేసుకుంటున్నారు. ముఖ్యంగా పట్టణాలు, నగరాలలో స్థిరపడినవారు జోడి దారకు వ్యతిరేకంగా ఉంటున్నారు. జోడి దారాను వ్యతిరేకించే వారిని గతంలో సామాజికంగా బహిష్కరించిన ఉదంతాలు ఉన్నాయి. కానీ నేటి కాలంలో ఆ విధానాన్ని వ్యతిరేకించినప్పటికీ పెద్దగా చర్యలు తీసుకోవడం లేదు.
Also Read: ఐఐటీలలో చదవలేదు.. ఐటీ ఉద్యోగం చేయడం లేదు.. నెల జీతం 4.5 లక్షలు.. ఇంతకీ ఇతడు ఏం చేస్తాడంటే..
జోడి దారా విధానం వల్ల ఆడవాళ్ళ ఆరోగ్యాలు పాడవుతున్నాయని.. అందువల్లే బహు భర్తత్వం అనే విధానాన్ని తిరస్కరించాలని అప్పట్లో కొంతమంది నిరసనలు కూడా చేపట్టారు..” మన సామాజిక వర్గం ఒకప్పుడు పాత విధానాన్ని పాటించింది. ఇప్పుడు కాలానికి తగ్గట్టుగా మారాలి. వెనకటి కాలం మాదిరిగా ఉంటే ఇప్పుడు పరిస్థితులు బాగోలేవు.. పైగా ఈ కాలంలో బహు భర్తత్వం అనేది సరికాదు.. బహుభార్యత్వం కూడా పద్ధతి కాదు. అందువల్ల ఆడవాళ్ళ ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంతవరకు పాతకాలపు పద్ధతులను పక్కన పెట్టాల్సిందేనని” హట్టి సామాజిక వర్గానికి చెందినవారు డిమాండ్ చేశారు. అయితే ఇందులో కొంతమంది ఏకసతివ్రతాన్ని పాటిస్తున్నారు. బహు భర్తత్వం వల్ల ఆడవాళ్ళ అంతర్గత ఆరోగ్యం దెబ్బతింటున్నదని.. అందువల్లే ఈ విధానానికి స్వస్తి పలకాలని అప్పట్లో కొంతమంది వైద్యులు ఈ తెగ వారికి సూచించారు. అందువల్లే అప్పటినుంచి వీరిలో మార్పు వచ్చినట్టు తెలుస్తోంది.