Bihar : బీహార్‌లోని కతిహార్‌లో ఓ వింత ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఒక దూడను నాదంటే నాదని తగువు పడ్డారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరడంతో పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ దూడకు నిజమైన యజమానిని ఎలా తేల్చాలో తెలియక పోలీసులే సందిగ్ధంలో పడ్డారు. మరోవైపు, దూడకు డీఎన్‌ఏ టెస్ట్ నిర్వహించాలని యజమానులు ఇద్దరూ పోలీసులను డిమాండ్ చేశారు. విషయం కతిహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాల్కోఠి మోనిధర్ ప్రాంతానికి చెందినది. ప్రస్తుతం పోలీసులు ఇరువర్గాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లాల్కోఠి మోనిధర్ ప్రాంతంలో నివసిస్తున్న ఛోటీ కుమారి ఆ దూడ తనదేనని చెబుతున్నారు. ఆమె ఆవు ఏడాది క్రితం విద్యుదాఘాతానికి గురై మరణించింది. కొన్ని రోజుల తర్వాత, ఈ దూడ ఇంటి నుండి వెళ్లిపోయింది. ఇప్పుడు దానంతట అదే ఇంటికి తిరిగి వచ్చింది. ఛోటీ కుమారి ప్రకారం, ఆమె ఆవుకు మూడు దూడలు ఉన్నాయి. మూడు ఎరుపు రంగులో ఉన్నాయి. ఈ దూడ కూడా ఎరుపు రంగులో ఉంటుంది. మరోవైపు దూడ తనదేనని 21వ వార్డులో నివాసముంటున్న అమిత్ కుమార్ చెబుతున్నాడు.
ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు
ఛోటీ కుమారి తన దూడను బలవంతంగా తన ఇంట్లో కట్టేసిందని ఆరోపించింది. వార్డు 21 కౌన్సిలర్ ప్రతినిధి మనోజ్ రాయ్ ప్రకారం, ఛోటీ కుమారి ఇప్పుడు తన ఆవును తీసుకురావాలని అడుగుతోంది. దూడ తన ఆవు పాలు తాగితే దూడను తిరిగి ఇస్తానని చెప్పింది. ఈ విషయమై ఇరువర్గాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనితో పాటు, దూడపై తమ యాజమాన్య హక్కులను తెలియజేస్తూ ఇరుపక్షాలు తమ తమ వాదనలను కూడా వినిపించాయి.
డీఎన్ఏ టెస్ట్ చేయాల్సిందే
ఈ విషయంలో పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేక పోవడంతో దూడలకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించాలని ఇరువర్గాలు డిమాండ్ చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ దూడకు డీఎన్‌ఏ టెస్ట్ ఎలా నిర్వహించాలో పోలీసులే సందిగ్ధంలో పడ్డారు. అయితే, సమస్యను త్వరగా పరిష్కరిస్తామని పోలీసులు ఇరువర్గాలకు హామీ ఇచ్చారు. ఇప్పుడు దూడ తల్లిని కనుగొనడానికి డీఎన్ ఏ టెస్ట్ మాత్రమే సహాయపడుతుందని పోలీసులు కూడా చెబుతున్నారు.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Both the owners demanded the police to conduct a dna test on the calf to find out the real owner of the calf in bihar
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com