Black Heron: నీటి వనరులలో జీవనం సాగించే చేపలను వేటాడే విషయంలో పక్షులు విభిన్నమైన శైలిని ప్రదర్శిస్తుంటాయి. చేపలను వేటాడేందుకు భిన్నమైన పంథా అనుసరిస్తుంటాయి. ఉదాహరణకు కొంగలు చేపలను పట్టుకునేందుకు దొంగ జపం చేస్తుంటాయి. ఇక కింగ్ ఫిషర్ అయితే వేగంగా నీటిలోకి దూసుకెళ్తుంది. చేపలను వేటాడుతుంది.. ఇక వేట విషయంలో బ్లాక్ హెరాన్ (నల్ల కొంగ) అనుసరించే విధానం విభిన్నంగా ఉంటుంది. ఇది ఒక రకంగా చేపలకు ట్రాప్ వేస్తుంది. అందులో అవి పడిపోతాయి. ఆ తర్వాత నల్ల కొంగ దర్జాగా వాటిని తినేస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి జారుకుంటుంది.
Also Read: పాక్ అణుస్థావరాలను టచ్ చేసిన భారత సైన్యం.. అందుకే అమెరికా జోక్యం!
నల్ల కొంగ ఎలా వేటాడుతుందంటే..
చేపలు ఎక్కువగా ఉన్న ప్రాంతానికి నల్ల కొంగ వెళుతూ ఉంటుంది. చేపల కదలికలను అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటుంది. ఆ తర్వాత చేపలు విస్తారంగా ఉన్న ప్రాంతానికి వెళ్తుంది. ముందుగా అటూ ఇటూ చూస్తుంది. ఆ తర్వాత తన విస్తారమైన రెక్కలను ఒక్కసారిగా విప్పుతుంది. నీటిలో ఉన్న చేపలను.. ఇతర జంతువులను ఆకర్షిస్తుంది. ఆ తర్వాత తన రెక్కలను ఒక్కసారిగా విప్పడంతో జలచరాలు ఆకర్షణకు గురవుతుంటాయి. ఇదేదో నీడలాగా ఉందని భావించి దాని కిందికి వస్తాయి. ఎప్పుడైతే తన రెక్కల కిందికి చేపలు రావడాన్ని గమనిస్తుందో.. అప్పుడే ఆ చేపలను నల్ల కొంగ వెంటనే తన నోట కరుచుకుంటుంది. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సురక్షితమైన ప్రాంతంలో వేటాడిన జల పుష్పాలను భద్రపరుస్తుంది. ఆ తర్వాత ఇంకో ప్రాంతానికి వెళ్లి ఇలానే జల పుష్పాలను వేటాడి.. తన గతంలో ఏ ప్రాంతంలో అయితే వేటాడిన జల పుష్పాలను భద్రపరచిందో.. అక్కడికి వెళ్తుంది. వేటాడిన చేపలను హాయిగా తింటుంది. అయితే నల్ల కొంగ అనేది అత్యంత తెలివైన పక్షి. అది నీటిలోని చేపలు కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ఏమాత్రం చేపలు ఎక్కువగా ఉన్నట్టు అనిపించినా.. వెంటనే అక్కడికి వెళ్ళిపోతుంది. దర్జాగా వేటాడి.. కడుపు నింపుకుంటుంది. అందుకే కొంగ జాతిలో నల్ల కొంగను అత్యంత తెలివైన పక్షి అని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. అయితే నల్ల కొంగ ఇష్టానుసారంగా వేటాడదు. కేవలం తన ఆకలి తీరేంతవరకు మాత్రమే చేపలను వేటాడుతుంది. తన ప్రాణాలకు ఏదైనా ముప్పు వాటిల్లుతుంది అని తెలిసిన వెంటనే నల్ల కొంగ అక్కడి నుంచి తక్షణం వెళ్ళిపోతుంది. అయితే నల్ల కొంగలు వేట విషయంలో గుంపులు గుంపులుగా ఉండవు. ఒంటరిగా మాత్రమే వెళుతుంటాయి. ఒంటరిగానే వేట కొనసాగిస్తుంటాయి. ఒక కొంగ వెళ్లిన ప్రాంతానికి మరోకంగా అస్సలు వెళ్ళదు
. ఎందుకంటే ఇది వేటకు వెళ్తున్నప్పుడు తమ శరీరం నుంచి ప్రత్యేకమైన రసాయనాలను విడుదల చేస్తుంటాయి. ఆ రసాయనాల వాసనకు ఇతర కొంగలు ఆ ప్రాంతానికి వెళ్ళవు.
View this post on Instagram