World’s largest railway line: ప్రయాణాల్లో కొందరికి ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం. సూదూరంగా వెళ్లడానికి సౌకర్యాలను పొందడంతోపాటు అతి తక్కువ ధరను చెల్లించవచ్చు. మారుమూల ప్రాంతానికి సైతం ట్రైన్ ద్వారా వెళ్లే అవకాశం ఉంటుంది. భారతదేశంలో అస్సాంలోని డిబ్రుగఢ్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు ఉన్న రైలు మార్గం అతిపెద్దదిగా గుర్తింపు పొందింది. మరి ప్రపంచంలో ఉన్న పొడవైన రైలు మార్గం ఎక్కడ ఉంది? ఇది ఏ దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తుంది? ఆ వివరాలు మీకోసం..
ప్రపంచంలో విస్తీర్ణంలో ఉన్న అతి పెద్ద దేశం రష్యా. ఈ దేశంలోని ట్రాన్స్ – సైబీరియన్ రైలు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రైలు మార్గం. రష్యా రాజధాని మాస్కో నుంచి వ్లాడివోస్టాక్ వరకు 9,288 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అంతే దాదాపు 5,772 మైళ్లు అన్నమాట. దాదాపు రష్యా మొత్తం కవర్ చేసే ఈ రైలు ప్రయాణం పూర్తి కావడానికి 7 రోజుల సమయం అంటే 168 గంటల సమయం పడుతుంది. ఈ ప్రయాణంలో 8 జోన్లు దాటుతారు. వీటిలో యెకతెరిన్ బర్గ్, ఓమ్స్, నోవోసిబిర్క్స్, ఇర్కత్స్, ఉలాన్ -ఉడే వంటి ప్రధాన నగరాలు కలుస్తాయి.
1891లో ట్రాన్స్ -సైబిరియన్ రైల్వే లైన్ నిర్మాణాన్ని మే 31న అధికారికంగా ప్రారంభించారు. జార్ నికోలస్ 2 ఈ వేడుకలో పాల్గొన్నారు. అప్పటి నుంచి ఏడాదికి 740 కిలోమీటర్ల దూరం పెంచుకుంటూ చైనీస్ తూర్పు రైల్వేతో అనుసంధానించబడ్డాయి. మొత్తంగా 1916లో పూర్తి చేసుకుంది. ఈ నిర్మాణంలో మొత్తం 90 వేల మంది కార్మికులు పనిచేశారు. ఇక్కడ మంచుతో కప్పబడిన ప్రతికూల వాతావరణం ఉండడంతో నిర్మాణంలో పాలుపంచుకున్న చాలా మంది మరణించారు.
అయితే ప్రస్తుతం ఈ రైలు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిం చెందింది. ఈ రైలు ప్రయాణం కేవలం జర్నీ కోసం కాదని ఒక అనుభూతి చెందుతామని ఇప్పటికే జర్నీ చేసిన వారు చెబుతున్నారు. ఈ రైలు ప్రయాణంలో గ్రామీణ సోయగాలు, మంచు పర్వతాలు, విస్తారమైన అడవులు, బైకాస్ సరస్సు వంటిని చూడొచ్చు. ఇందులో లగ్గరీ బెర్త్ ల నుంచి ఎకానమీ బెర్త్ లు కూడా ఉన్నాయి. అంటే హోటల్ స్థాయిలో సౌకర్యాలను పొందవచ్చు. ఈ రైలులో ప్రయాణం చేయాలంటే రష్యా అధికారిక వెబ్ సైట్ అందుబాటులో ఉంది. మే నుంచి సెప్టెంబర్ వరకు మాత్రమే ఈ ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. ఆ తరువాత మంచుతో కప్పబడి ఉండడం వల్ల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.