Biodiversity Loss : అభివృద్ధి పేరుతో చెట్లను నరికి పడేశాం. విస్తరణ పేరుతో కొండలను పిండి చేశాం. మన ఎదుగుదల కోసం సముద్రాలను సర్వనాశనం చేశాం. నదుల రూపులను మార్చాం. చెరువుల ఆకృతులను సమూలంగా మార్చేశాం. ఇలా చెప్పుకుంటూపోతే ప్రకృతికి మనం చేసిన వ్యక్తి మామూలుది కాదు. అందుకే మనిషి అనే వాడు పర్యావరణ నష్టకారుడు. పర్యావరణానికి నష్టం చేస్తున్న కొద్దీ మనిషి మనుగడ మరింత ప్రమాదంలో పడుతోంది. ఇది ఎంతవరకు దారితీస్తుందో తెలియదు కానీ.. మనిషి చేస్తున్న పనికిమాలిన పనుల వల్ల ప్రకృతి పడుతున్న ఇబ్బందులను ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో తెలియజేస్తూనే ఉంది.
Also Read : కొంగ జపం అంటుంటాం కదా.. చేపల వేటలో ఈ పక్షి స్టైల్ నెక్ట్స్ లెవల్: వైరల్ వీడియో
ఇక అందం అంతరించిపోతుంది
ప్రకృతి మనుషులకు ఇచ్చిన వరాలలో ప్రధానమైనవి సముద్రాలు. ఈ సముద్రాలలోనూ లెక్కకు మిక్కిలి అద్భుతాలు ఉన్నాయి. అంతకుమించి అన్నట్టుగా అందాలు ఉన్నాయి. అలాంటి అందాల దీపిక ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ తీరంలోని పగడపు దిబ్బలు ఉన్నాయి. ఇందులో 900 వరకు దీవులు ఉన్నాయి. 2,600 కిలోమీటర్ల పొడవు వరకు ఇవి విస్తరించి ఉన్నాయి. దీనిని గ్రేట్ బారీయర్ రీఫ్ అని పిలుస్తుంటారు. ఇది అంతరిక్షం నుంచి చూసిన స్పష్టంగా కనిపిస్తుంది. దీనిని సందర్శించడానికి ప్రతి ఏడాది 20 లక్షల మంది వరకు పర్యాటకులు వస్తుంటారు. దీనిని ప్రపంచంలోనే అతిపెద్ద కోరల్ రీఫ్ అని పిలుస్తుంటారు. అయితే వాతావరణ మార్పుల వల్ల.. మనిషి చేస్తున్న దుర్మార్గమైన పనుల వల్ల పగడపు దిబ్బలు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. శాస్త్రవేత్తలు చేసిన పరిశీలనలో ఇది వెల్లడయింది. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల వల్ల ఈ ప్రాంతం భయంకరమైన మార్పులను ఎదుర్కొంటున్నది. ఒకప్పుడు అద్భుతమైన జీవజాతులతో ఈ ప్రాంతం పర్యాటకుల మదిని దోచుకుంది. అటువంటి ఈ ప్రాంతం ఇప్పుడు తన ఉనికిని కోల్పోయే దశకు చేరుకుంది. ఇది అంతరించే దశకు చేరుకోవడం కింద బాధాకరమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఒకవేళ ఇది గనుక అంతరించిపోతే భూమి తనకు అత్యంత విలువైన సంపదలో ఒకదానిని కోల్పోయినట్టే..” ఇది అత్యంత అందమైన ప్రదేశం. ఇందులో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. వీటి మీద ఎన్నో ప్రయోగాలు చేశాం. కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నాం. ఔత్సాహిక శాస్త్రవేత్తలకు ఈ ప్రాంతం ఒక స్వర్గం లాంటిది. కానీ ఇప్పుడు ఈ ప్రాంతం మనుగడ ప్రమాదంలో పడింది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు కానీ.. ఇప్పటికైతే పరిస్థితి బాగోలేదు. బాగవుతుందనే నమ్మకం లేదని” శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే దీన్ని బాగు చేయడం కోసం ఆస్ట్రేలియా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంతవరకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.. అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వం దీనిని బాగు చేయడానికి చొరవ తీసుకోవాలని పర్యటకులు కోరుతున్నారు.