Bermuda Triangle Mystery: అక్కడికి వెళ్తే విమానాలు కనిపించకుండా పోతాయి. నౌకలు కూడా అదే స్థాయిలో మాయమైపోతుంటాయి. చాలామంది అక్కడ ఏదో రహస్య శక్తి ఉందని చెబుతుంటారు. అందువల్లే అక్కడికి వెళ్లడానికి కూడా భయపడుతుంటారు. పైగా అక్కడి వాతావరణం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. దీనిపై అనేక రకాల సినిమాలు వచ్చాయి. అయినప్పటికీ కూడా ఇంతవరకు ఆ రహస్యం బయటపడలేదు. అక్కడ ఏం జరుగుతుందో కూడా ప్రపంచానికి తెలియలేదు. ఇన్నాళ్లకు.. అనేక సంవత్సరాల నిరీక్షణ తర్వాత అసలు విషయం ఇప్పుడు బయటకు వచ్చింది.
అట్లాంటిక్ సముద్రంలో బెర్ముడా ట్రయాంగిల్ గురించి అందరికీ తెలుసు. అక్కడ ఒక రహస్యశక్తి ఉందని అందరూ భావిస్తుంటారు. పరిశోధకులు దీనిని కొట్టి పారేసినప్పటికీ.. దీనిపై అనేక సంవత్సరాలుగా వారు పరిశోధన సాగిస్తూనే ఉన్నారు. చివరికి ఇన్నాళ్లకు అసలు నిజం బయటపడింది.
బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతం.. అట్లాంటిక్ మహాసముద్రం కంటే ఎత్తైన ప్రదేశం గా ఉంటుంది. గడిచిన మూడు కోట్ల సంవత్సరాలుగా ఇక్కడ ఎటువంటి అగ్నిపర్వతాలు విస్పోటనానికి గురికాక పోయినప్పటికీ.. పరిసర ప్రాంతంలో సాగర గర్భం కంటే ఇవి ఎత్తైన ప్రదేశంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ హవాయి వంటి అనేక అగ్నిపర్వతాల దీవుల సమూహాలు ఉంటాయి. ఇవి భూమిలో ఉన్న మాంటిల్ పొర నుంచి వచ్చిన వేడి.. దానిపై తెలియాడే రాతి భాగం పై ఏర్పడుతూ ఉంటాయి. ఈ పదార్థం అనేది పైకి వస్తున్న కొద్ది అగ్నిపర్వతాలు ఏర్పడుతుంటాయి. అందువల్ల అక్కడ సాగర గర్భం కొంచెం ఉబ్బినట్టు కనిపిస్తూ ఉంటుంది. కొంతకాలం తర్వాత ఎగువ ఉన్న పొరలో ఫలకాలు దూరం జరిగిపోతూ ఉంటాయి. దీనివల్ల అగ్నిపర్వత చర్య చల్లారిపోతూ ఉంటుంది. ఉబ్బెత్తుగా ఉన్న ప్రదేశం మళ్లీ సాధారణ స్థితికి వస్తూ ఉంటుంది. అయితే బెర్ముడాలో ఇటువంటి అద్భుతం జరగలేదు. పైగా ఈ దీవులు పరిసర ప్రాంతాల కంటే 16 అడుగుల ఎత్తైన ప్రదేశం మీద ఉన్నాయి. అయితే ఇక్కడ ఎటువంటి అగ్నిపర్వత చర్యలు లేకపోయినప్పటికీ ఆ ప్రదేశం ఇంకా ఇంకా కిందికి దిగకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
దీనిపై పరిశోధకులు దృష్టి సారించారు. భూకంపాల వల్ల ఉత్పన్నమయ్యే సైస్మిక్ తరంగాలను ఆధారంగా తీసుకున్నారు. అవి భూమి లోపల చర్చుకొని పోతూ ఉంటాయి. ఈ క్రమంలో వాటికి ఎదురయ్యే పదార్థాల సాంద్రత .. మూలకాల ఆధారంగా వాటి వేగం ఉంటుంది. ఇక బెర్ముడాలో ఉన్న భూ ప్రకంపన అధ్యయన కేంద్రంలో నమోదైన సమాచారాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించారు. అయితే బెర్ముడా ట్రయాంగిల్ కింద ఉన్న 20 మైళ్ల దూరం వరకు విస్తరించిన భూ అంతర్భాగ చిత్రాన్ని వారు పరిశీలించారు. ఆ పరిశీలనలో అక్కడ భూమిపై పోరా కింద 12 మైళ్ళ మందం కలిగిన ఒక శిల లాంటి పొర కనిపించింది. అది పరిసర ప్రాంతాల్లోని మ్యాంటిల్ కంటే తక్కువ సాంద్రతను కలిగి ఉంది. దీనివల్ల అది అసాధారణ స్థాయిలో తేలియాడుతోంది. అందువల్లే బెర్ముడా ట్రయాంగిల్ తేలియాడుతూ ఉంది. ఈ రాతి పొరను అండర్ ప్లేటింగ్ అని పిలుస్తున్నారు.
