Snakes: పాము.. ఈ పేరు వింటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఇక పాము మన ఎదురుగా వస్తే.. భయంతో ఆమడదూరం పరిగెత్తుతాము. అసలు విషయం ఏమిటంటే.. పాము కూడా మనల్ని చూసి అంతే భయపడుతుంది. పాముల్లో అనేక రకాలు ఉన్నాయి. కొన్ని విషపూర్తిమైనవి. వర్షాకాలంలో పాములు గ్రామాలు, పట్టణాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో పాములు కనిపించవు. దీంతో మా ఊళ్లో పాములు లేవని సంబరపడతారు. కానీ, అదే ఇంకా ప్రమాదకరం. ఎందుకంటే అక్కడ కింగ్ కోబ్రా ఉన్నట్లే. అది ఇతర పాములను చంపేస్తుంది. ఇది మరింత ప్రమాదకరమైన పరిస్థితిని సూచిస్తుంది.
Also Read: విలేకరి చెప్పాడు.. పోలీసులు దోచుకున్నారు.. క్యా క్రైం హై
ఊరట కాదు.. హెచ్చరిక
సాధారణంగా ఇళ్ల సమీపంలో బురద పాములు, కట్లపాములు వంటి విషరహిత లేదా తక్కువ విషపూరిత పాములు కనిపిస్తాయి. ఇవి మానవులకు పెద్దగా హాని కలిగించవు, కానీ వీటి సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోతే, అది నాగుపాము వంటి ఓఫియోఫాగస్(పాములను ఆహారంగా తీసుకునే) జాతుల ఉనికిని సూచిస్తుంది. నాగుపాము అత్యంత విషపూరితమై దాని ఆధిపత్య ప్రవర్తన వల్ల ఇతర పాములను దూరంగా ఉంచుతుంది లేదా వాటిని ఆహారంగా తీసుకుంటుంది.
నాగుపాముకు ఓఫియోఫాగస్ లక్షణం..
నాగుపాము(కింగ్ కోబ్రా) ఓఫియోఫాగస్ లక్షణాన్ని కలిగి ఉంటుంది, అంటే ఇది ఇతర పాములను ప్రధానంగా ఆహారంగా తీసుకుంటుంది. దాని శక్తివంతమైన విషం, శారీరక బలం ఇతర విషపూరిత, విషరహిత పాములను సులభంగా వేటాడేందుకు సహాయపడతాయి. భారతదేశంలో, ముఖ్యంగా అటవీ, గ్రామీణ ప్రాంతాల్లో ఈ పాములు సర్వసాధారణం. ఒక ప్రాంతంలో నాగుపాము ఉన్నప్పుడు, ఇతర పాముల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది.
పాములతో పర్యావరణ సమతుల్యత..
పాములు, ముఖ్యంగా నాగుపాము వంటి ఓఫియోఫాగస్ జాతులు, పర్యావరణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి ఇతర పాముల సంఖ్యను నియంత్రించడంతో పాటు, ఎలుకలు, కీటకాలు వంటి జీవుల సంఖ్యను కూడా నియంత్రిస్తాయి. ఈ ప్రక్రియ పర్యావరణ సమతుల్యతను కాపాడుతుంది. అయితే, వీటిని అనవసరంగా చంపడం కాకుండా, సురక్షితంగా తొలగించడం ద్వారా పర్యావరణాన్ని, మానవ భద్రతను కాపాడవచ్చు.