https://oktelugu.com/

Auto: ఆటోకు 3 చక్రాలే ఎందుకు ఉంటాయి.. 4 చక్రాలు ఎందుకు ఉండవో తెలుసా..?

ప్రస్తుతం ఒక ప్రాంతం నుంచి మరో ప్రదేశానికి వెళ్లాలంటే తప్పనిసరిగా ఏదైనా వాహనం కావాల్సిందే. ఇందుకోసం కొంత తమ సొంతవాహనాన్ని వినియోగిస్తారు. అంత స్థోమత లేని వారు ఈ విషయంలో పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వినియోగిస్తుంటారు. అలాగే ఎక్కడికైనా వెళ్లాలంటే ఆటోలను ఆశ్రయించేవారి సంఖ్య కూడా తక్కువ ఏమీ కాదు.

Written By:
  • Rocky
  • , Updated On : February 10, 2025 / 01:00 AM IST
    Auto

    Auto

    Follow us on

    Auto: ప్రస్తుతం ఒక ప్రాంతం నుంచి మరో ప్రదేశానికి వెళ్లాలంటే తప్పనిసరిగా ఏదైనా వాహనం కావాల్సిందే. ఇందుకోసం కొంత తమ సొంతవాహనాన్ని వినియోగిస్తారు. అంత స్థోమత లేని వారు ఈ విషయంలో పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వినియోగిస్తుంటారు. అలాగే ఎక్కడికైనా వెళ్లాలంటే ఆటోలను ఆశ్రయించేవారి సంఖ్య కూడా తక్కువ ఏమీ కాదు..

    ఆటో కొన్ని దశాబ్ధాలుగా సామాన్యుడి వాహనంగా పేరొందింది. ఇది సామాన్యుడు తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయడానికి ఉపయోగపడే వాహనం. ఆటో రిక్షాలో ఎన్ని అప్ డేట్స్ వచ్చినా ఇప్పటి వరకు మూడు చక్రాలతోనే వస్తోంది. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో మాత్రమే కాకుండా.. పట్టణ ప్రాంతాల్లో కూడా లెక్కకు మించి అందుబాటులో ఉన్న ఆటోలకు కార్లు, బస్సుల మాదిరిగా నాలుగు చక్రాలు ఎందుకు ఉండవు?.. మూడు చక్రాలే ఉండటానికి కారణం ఏమిటి అనే విషయాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
    Auto

    నాలుగు చక్రాలు ఉండే వాహనాల కంటే కూడా మూడు చక్రాల వాహనాలను బ్యాలెన్స్ చేయడం కొంత సులభం అని ఓ ఐఐటీ ప్రొఫెసర్ వివరించారు. అంతే కాకుండా.. దీనిని రూపొందించేందుకు అయ్యే ఖర్చు కూడా తక్కువని అన్నారు. ఖర్చు మాత్రమే కాకుండా దీనిని రూపొందించేందుకు ఇంజినీరింగ్‌ వర్క్‌ కూడా తక్కువే. నాలుగు చక్రాల వాహనం కన్నా మూడు చక్రాల వాహనం పరిమాణంలో చిన్నగా ఉంటుంది. అలాంటప్పుడు ఎలాంటి ఇరుకు ప్రాంతంలో ప్రయాణించడానికైనా, కొద్దిపాటి ప్రాంతంలో పార్క్‌ చేయడానికైనా అనువుగా ఉంటుంది. నిత్యం రద్దీగా ఉండే పట్టణాల్లో ఆటోలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.

    మూడు చక్రాలు దీనికి రూపొందించడం వలన ఇంధన వినియోగం కూడా భారీగా తగ్గిపోతుంది. ఆటోను నడిపించేందుకు ఇంజన్ కు తక్కువ శక్తి సరిపోతుంది. కాబట్టి ఆటోలను నడిపేవారు కూడా దీని నిర్వహణకు పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం అనేది ఉండదు. మొత్తం మీద ఈ కారణాల వల్లనే ఆటో మూడు చక్రాలను మాత్రమే కలిగి ఉంటుంది.