Megastar Chiranjeevi: విశ్వక్ సేన్ హీరో గా నటించిన లైలా చిత్రం ఈ నెల 14వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా నేడు సాయంత్రం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథి గా పాల్గొని మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఆయన తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో నూతనోత్సాహాన్ని నింపాయి. చిరంజీవి నోటి నుండి అలాంటి మాటలు వస్తాయని అభిమానులు ఊహించి ఉండరు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి ఆయన ఎన్నో సందర్భాల్లో గొప్పగా మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ కూడా తన కొడుకు రామ్ చరణ్ లాగానే., అతని విజయాన్ని నా విజయం గా భావిస్తుంటాను అని ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు, కానీ రాజకీయంగా మాత్రం ఆయన ఎప్పుడూ మాట్లాడలేదు.
నేడు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడాడు. విశ్వక్ సేన్ తండ్రి కరాటీ రాజు గతంలో ప్రజారాజ్యం పార్టీ లో మలక్ పేట స్థానం నుండి ఎమ్మెల్యే గా పోటీ చేసాడు. ఆ సందర్భాన్ని ప్రస్తావిస్తుండగా అభిమానులు జై జనసేన అని అరవడం మొదలెట్టారు. దానికి చిరంజీవి స్పందిస్తూ ‘జై జనసేన..అప్పటి ప్రజారాజ్యం పార్టీ నేడు జనసేన పార్టీ గా రూపాంతరం చెందింది.. అందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. చిరంజీవి ఇలా రాజకీయంగా తన తమ్ముడి గురించి, జనసేన పార్టీ గురించి మాట్లాడడం పదేళ్లలో ఇప్పుడే జరిగింది. దీనిపై అభిమానులు ఒక పక్క సంతోషిస్తుంటే , మరోపక్క దురాభిమానులు మాత్రం చిరంజీవి ని విమర్శిస్తున్నారు. తమ్ముడు కష్టాల్లో ఉంటే బహిరంగంగా ఒక్కసారి కూడా బయటకి వచ్చి సపోర్టు చేయని చిరంజీవి, ఇప్పుడు సక్సెస్ లో మాత్రం జనసేన పార్టీ ని అక్కున చేర్చుకుంటున్నాడు అంటూ విమర్శిస్తున్నారు.
అన్నయ్య ప్రజారాజ్యం పార్టీ పెట్టి 18 స్థానాలు గెలిచి, పార్టీ ని నడపలేక కాంగ్రెస్ పార్టీ లో విలీనం చేసి రాజకీయాల నుండి తప్పుకుంటే, తమ్ముడు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయినప్పటికీ కూడా, 5 ఏళ్ళు వీరోచితంగా పోరాడి, 2024 ఎన్నికలలో పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలిచి చరిత్ర సృష్టించాడు, గేమ్ చేంజర్ గా మారి ఆంధ్ర ప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు అంటూ సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. దీనికి పవన్ కళ్యాణ్ అభిమానులు డిఫెండ్ చేస్తూ కలిసి మెలిసి ఉన్న మెగా ఫ్యామిలీ లో చిచ్చు పెట్టాలని చూస్తున్నారని, దయచేసి అభిమానులు రెచ్చిపోకండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా చిరంజీవి ఇలా మాట్లాడడం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పరిణామం అనే చెప్పొచ్చు. త్వరలో ఆయన రాజ్యసభలోకి అడుగుపెట్టబోతున్నాడని టాక్ ఉంది, ఈరోజు ఆయన చేసిన కామెంట్స్ ని చూస్తే అది నిజమేనేమో అని అనిపిస్తుంది.
Jai Janasena – @KChiruTweets pic.twitter.com/edPuOIJdZp
— FSIC (@shr3hs) February 9, 2025