Aunt Marries Nephew: మనుషుల మధ్య ఆప్యాయతలు కరువైపోతున్నాయి. బంధాలు మాయమైపోతున్నాయి. శారీరక సంబంధాలు పెరిగిపోతున్నాయి. వావి వరసలనేవీ మృగ్యమైపోతున్నాయి. ఈ తరహ సంఘటనలు అనేకరకాల దారుణాలకు దారి తీస్తున్నాయి. ఇంత జరుగుతున్నప్పటికీ సొసైటీలో మార్పు రావడం లేదు. పైగా ఘోరాలు మరింత పెరిగిపోతున్నాయి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ ఏరియాలో ఇటీవల ఓ సంఘటన జరిగింది. అదికూడా పోలీస్ స్టేషన్ వెలుపల జరగడంతో పోలీసులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ సంఘటనలో సినిమాను మించి నాటకీయ పరిణామాలు ఉన్నాయి. వాటి గురించి వాకబు చేసిన పోలీసులకు దిమ్మతిరిగిపోయింది. బాబు ఇలా కూడా జరుగుతుందా అనే తీరుగా వారిలో ఆశ్చర్యం కలిగింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ ఏరియాలో ఓ మహిళకు గతంలోనే వివాహం జరిగింది. ఆమె భర్త ట్రక్ డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. ఆ మహిళ భర్తకు సోదరి ఉంది. ఆమెకు ఒక టీనేజ్ కుమారుడు ఉన్నాడు. వీరి కుటుంబాలు పక్క పక్కనే ఉంటాయి. ట్రక్ డ్రైవర్ గా భర్త రోజుల తరబడి ఇంటికి దూరంగా ఉంటాడు. ఇవన్నీ కూడా ఆమెలో తప్పుడు ఆలోచనలు కలిగించాయి. అంతేకాదు ఆమెను తన భర్త అల్లుడికి దగ్గర చేశాయి. మొదట్లో ఆ యువకుడిని వివిధ పనుల నిమిత్తం ఆమె ఇంటికి పిలిపించుకునేది. ఆ తర్వాత అతడిని రెచ్చగొట్టడం మొదలుపెట్టింది. ఒకానొక సందర్భంలో అతడిని లొంగదీసుకుంది. ఇక అప్పట్నుంచి అతడు దినం తప్పకుండా ఆమె వద్దకు వెళ్లేవాడు. ఆమె అతనికి స్వర్గసుఖాలు చూపించేది. అత్తతో శారీరక సుఖానికి మరిగిన అతడు చదువును కూడా నిర్లక్ష్యం చేశాడు. ఇలా మూడు సంవత్సరాల పాటు వారి రహస్య బంధం సాగింది.
ఇలా ఎంతకాలమని ఇద్దరు అనుకున్నారు. అంతే పోలీస్ స్టేషన్ వెళ్లారు. అక్కడ వెలుపల వివాహం చేసుకున్నారు. వివాహం జరిగినప్పుడు ఆ మహిళ భర్త పనిమీద బయటికి వెళ్ళాడు. వారిద్దరు వివాహం చేసుకుంటుండగా పోలీసులు కూడా చూశారు. కాకపోతే వారిద్దరూ మేజర్ లని అనుకున్నారు. చివరికి అసలు విషయం చెప్పడంతో పోలీసులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వివాహం చేసుకున్న అనంతరం ఈ విషయాన్ని ఆమె తన మొదటి భర్తకు చెప్పింది. దీంతో అతడు ఇదేంటి ఇలా చేశావని ఆమెను నిలదీశాడు. “నేను అతడిని ఇష్టపడ్డాను. నీతో సంసారం చేయలేనని” చెప్పేసింది.
In Rampur, UP
— an aunt married her own nephew inside the police station.For 3 years, she hid an affair.
The husband is a drive and had no clue.Police watched.
Society stayed silent.Where are we heading, law claps for adultery and no space for loyalty!! pic.twitter.com/Rr1NQ4X1Bk
— ShoneeKapoor (@ShoneeKapoor) September 22, 2025