Atlys Visa Sale: నేటి కాలంలో విమానాలలో ప్రయాణించే వారి సంఖ్య పెరిగిపోయింది. ఈ దశలో వీసా జారీ చేసే కేంద్రాలు ఎక్కువయ్యాయి. విదేశాలకు విమానాలు నడిపే సంస్థలు పెరిగిపోయాయి. మన దేశం కేంద్రంగా ఆన్ లైన్ లో వీసాలు జారీ చేసే స్టార్టప్ సంస్థలు అనేకం ఏర్పాటయ్యాయి. అందులో అట్లీస్ అనే సంస్థ ఒకటి. ఈ సంస్థకు సీఈవో గా మోహక్ నహ్తా వ్యవహరిస్తున్నారు.
గత ఏడాది పారిస్ కేంద్రంగా ఒలంపిక్స్ జరిగినప్పుడు.. భారత జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధిస్తే అందరికీ వీసాలు ఇస్తానని ప్రకటించారు. అప్పట్లో ఈయన చేసిన ప్రకటన సంచలనంగా మారింది. మళ్లీ ఇప్పుడు ఆయన అదే స్థాయిలో ఒక ప్రకటన చేశారు. 15 కంటే ఎక్కువ దేశాలకు ప్రయాణించే భారతీయులకు కేవలం ఒక రూపాయికి వీసా అందిస్తున్నట్టు వెల్లడించారు. యూఏఈ, యూకే, ఇండోనేషియా, వియత్నాం, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, హాంకాంగ్, ఈజిప్ట్, ఓమన్, జార్జియా, ఖతార్, మొరాకో, కెన్యా, తైవాన్ వంటి దేశాలకు ప్రయాణించే భారతీయులకు కేవలం ఒక రూపాయి కే వీసాలు ఇస్తామని అట్లీస్ సంస్థ ప్రకటించింది. వీసా ప్రాసెసింగ్ రెండు రోజులపాటు అట్లీస్ వెబ్ సైట్ లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది..ఈ వీసాలను ప్రత్యేకంగా విక్రయిస్తుంటారు..
Also Read: మాకు ఇప్పుడు విజయ్ దేవరకొండ నే పవన్ కళ్యాణ్ – నాగవంశీ
మనదేశంలో తొలిసారిగా ఈ తరహాలో మొట్టమొదటి వీసా కేటాయింపులను అట్లీస్ చేపట్టింది.. ఈ సమయంలో దరఖాస్తుదారు తరఫున ప్రభుత్వ రుసుము, సేవా రుసుములతో అన్ని చార్జీలను అట్లీస్ సంస్థ భరిస్తుంది. ఈ ఆఫర్ ఎంపిక చేసిన గమ్య స్థానాలకు మాత్రమే వర్తిస్తుంది..ఈ – వీసా, సర్వీస్, ప్రభుత్వ రుసుములను దరఖాస్తుదారులు చెల్లించాల్సిన అవసరం లేదు. వీసా జారీకి సంబంధించిన ప్రత్యక్ష ప్రసారం ఆగస్టు 3,4 తేదీలలో వెబ్ సైట్ లో కనిపిస్తుంది. యునైటెడ్ స్టేట్స్, ఎంపిక చేసిన దేశాలకు వ్యక్తిగత సందర్శనలకు వెళ్లే వారికి అపాయింట్మెంట్ బుకింగ్ కూడా కేవలం ఒక రూపాయి కే లభిస్తుంది. యునైటెడ్ స్టేట్స్, ఎంపిక చేసిన దేశాలకు అట్లీస్ సర్వీస్ ఫీజు, అపాయింట్మెంట్ బుకింగ్ ఫీజు మాత్రమే ఉంటాయి. వీసా ఫీజులు, ఇతర ఖర్చులు, ప్రభుత్వ చార్జీలను దరఖాస్తుదారుడు నేరుగా చెల్లించాలి. భారతీయ పాస్ పోర్ట్, ఆర్థిక రుజువులు, ప్రయాణ బుకింగ్ లు, ఇతర సహాయక పత్రాలు అప్లోడ్ చేయాలి..
యూరోపియన్ యూనియన్ కమిషన్, కొండే నాస్ట్ ట్రావెలర్ నివేదిక ప్రకారం గత ఏడాది పలు దేశాలలో భారతీయ దరఖాస్తుదారులు 664(వీసాలు పొందేటప్పుడు తిరిగి చెల్లించని రుసుము) కోట్లకు పైగా నష్టపోయారు. గడిచిన 60 రోజుల్లో వియత్నాం, జార్జియా, ఇండోనేషియా, యునైటెడ్ కింగ్డమ్, యూఏఈ వంటి విస్తృత శ్రేణి ఉన్న గమ్యస్థానాలకు వెళ్లే భారతీయుల సంఖ్య 18 శాతం నుంచి 44 శాతం వరకు పెరిగిందని అట్లీస్ వెల్లడించింది.. టైర్ -1, టైర్ -2 నగరాల నుంచి ఆయా దేశాలకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోందని ఆ సంస్థ ప్రకటించింది.. ముఖ్యంగా జనరేషన్ జెడ్, మిలీనియల్స్ ఎక్కువగా ఆ దేశాలకు వెళ్తున్నారు.